కోనసీమ: మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశా. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని ఆయన కోరారు. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50వేల మందికి పరిహారం ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, గీతగా భావించాం. ప్రతీ మత్స్యకారుడికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మండలం) మురమళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ మత్స్యకార భరో్సా కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే .. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాదాపు లక్షా తొమ్మిదివేల మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నాం. అందులో భాగంగానే వరుసగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున.. ఈ ఏడా 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్లు రోజు జమ చేస్తున్నాం. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశాం. దాదాపుగా 180 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలోనే ఒక మహానుబావుడు ఇక్కడ పుట్టడం, మనందరికి పరిచయం ఉన్న పేరే..మల్లాది సత్యలింగం నాయకర్ . ఆయన కూడా ఒక మత్స్యకారుడు. తాను చదువుకోలేకపోయాడు. సముద్రమంతా కష్టాల్లో తన జీవితాన్ని ప్రారంభించి, సముద్రాన్ని నమ్ముకొని, సముద్రం నుంచే బర్మాకు చేరుకొని అక్కడ కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి రంగోల్‌లో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అంత ఎత్తుకు ఎదిగి కూడా తన సొంత గడ్డపై మమకారంతో తాను సంపాదించినందతా అమ్మేసి ఇక్కడ ఓ ట్రస్ట్ పెట్టి ఎన్నో వేల మంది పేద వాళ్లకు మంచి జరిగిస్తూ..చదివిస్తూ ధనదర్మాలు చేసిన ఘనత ఆ మహానుభావుడిది. ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే ఎందరికో మేలు జరుగుతుంది. ఒక మంచి బీజం చెట్టు అయి కొన్ని వేల మందికి మంచి చేస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని, వారి మంచి స్ఫూర్తితో ఇంకా మంచి చేసే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ప్రతి ఒక్క మత్స్యకారుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,అగ్రవర్ణాలలో పేదలు ఇబ్బందులు పడకూడదు. అలాంటి భరోసా ఇచ్చిన రోజే ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా అగ్రవర్ణ పేదలు ..వీళ్లంతా నావాళ్లుగా భావించాను. పేదరికంలో ఉన్న మహిళలను నా సొంత అక్కచెల్లెమ్మలుగా భావించి, అలాంటి వారి కోసం 32 పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది అని సగర్వంగా , మీ బిడ్డగా చెబుతున్నాను. మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు నా కళ్లారా చూశాను. నా పాదయాత్రలో ప్రతి అడుగులోనూ మీరు చెప్పే ప్రతి మాట విన్నాను.. ఈ రోజు నేను ఉన్నానని భరోసా ఇస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. అందులో భాగంగానే ఈ రోజు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు అడుగులు వేస్తున్న మన ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద లక్ష 9 వేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున దాదాపు రూ.108.70 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఈ ఏడాది మనం ఇస్తున్న రూ.109 కోట్లు కలిపితే ఈ ఒక్క పథకానికే మనందరి ప్రభుత్వం ఏకంగా అక్షరాల రూ.419 కోట్లు ఈ పథకం ద్వారా నేరుగా మత్స్యకార కుటుంబాలకు ఇవ్వగలిగానని మీ బిడ్డగా తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో మరే ప్రభుత్వం ఇంతగా సహాయం అందించిన ప్రభుత్వం ఏది లేదు. మీ బిడ్డగా ఈ రోజు తెలియజేస్తున్నాను. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇంతగా ఇవ్వడం లేదు.మరోవంకా ఇక్కడ ఓఎన్‌జీసీ పైప్‌లైన్ డ్రిల్లింగ్ కారణంగా కోనసీమ జిల్లాలోని 69 గ్రామాలకు చెందిన 6079 బోట్లకు పని లేకుండా పోతుంది. ఈ గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన 23458 మత్స్యకార కుటుంబాలకు నెలకు 11,500 చొప్పున నాలుగు నెలల పాటు రూ. 46 వేల నేరుగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. అక్షరాల రూ.108 కోట్లు ఇస్తున్నాం. మత్స్యకార భరోసా సొమ్ము రూ.109 కోట్లు.. నేరుగా జమ చేస్తున్నందుకు దేవుడికి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా. గతంలో జీఎస్‌పీసీ వాళ్లు డ్రిల్లింగ్‌కార్యక్రమం చేయడంతో అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14824 బాధిత మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి ఒక్కో కుటుంబానికి రూ.42700 చొప్పున గతంలో ఇవ్వకుండా పోతే..గత ప్రభుత్వ హయాంలో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కనీసం ఇప్పించాలనే తపన చూపించలేదు. వాళ్లు ఇవ్వకపోతే ఏమీ..మనమే ఇవ్వవచ్చు అన్న పరిస్థితులు ఆ రోజు లేవు. మనం అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే రూ.70 కోట్లను మనం విడుదల చేసి మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపాం. ఒక్కసారి తేడాను గమనించాలని సవినయంగా కోరుతున్నాను. నా సుదీర్ఘ పాదయాత్రలో తీరప్రాంతాల మీదుగా సాగినప్పుడు మత్య్సకారుల కష్టాలను కళ్లారా చూశాను. ఎన్నికల ప్రణాళికను ఒక బైబిల్, ఖురాన్, భగవత్గీతగా భావించాను. ప్రతి ఒక్కరికి మేలు చేస్తామని హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ చేపల వేట నిషేధ సమయంలో అందించే పరిహారాన్ని రూ.4 వేల నుంచి రూ.10వేలకు పెంచాం. గతంలో కొంత మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఇవాళ ఎంత మందికి ఇస్తున్నామో గమనించాలి. 2014–2015లో మత్స్యకారులకు కేవలం 12,170 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడే సరికి వెన్నులో వణుకు పుట్టి 80 వేల మందికి ఇచ్చారు. ఎన్నికలు లేనప్పుడు చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి కేవలం రూ.2 వేలు. ఎన్నికలు దగ్గరపడేసరికి రూ.4 వేలకు పెంచారు. చంద్రబాబు మొట్టమొదటి సారి కేవలం రూ.2.50 కోట్లు మాత్రమే. ఎన్నికల నాటికి చివరి ఏడాది రూ.32 కోట్లు. ఆ పెద్ద మనిషి పరిపాలన చేసిన ఐదేళ్లలో రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ రోజు మీ బిడ్డ ఏడాదికి రూ.109 కోట్లు బటన్ నొక్కి ఇస్తున్నాడు. ఇంతవరకు మీ బిడ్డ ఇచ్చింది రూ.419 కోట్లు మీ చేతుల్లో పెట్టాడు. గతంలో మీ అందరికి తెలిసిందే..గతంలో డీజిల్‌పై సబ్సిడీ రూ.6 ఇచ్చేవారు. ఎప్పుడు ఇచ్చేవారో తెలియదు. ఈ రోజు సబ్సిడీ 50 శాతం పెంచాం. రూ.9 లీటర్‌కు సబ్సిడీ ఇస్తున్నాం. పెట్రోల్ పట్టుకునే సమయంలోనే సబ్సిడీ ఇస్తున్నాం. మత్స్యశాఖకు చెందిన 6 డీజిల్ బంకులతో పాటు 93 ప్రైవేట్ బంకుల్లో కూడా మత్స్యకారులకు సబ్సిడీ అందేలా స్మార్ట్‌కార్డులు అందజేశాం. రోజుకు 300 లీటర్లకు సబ్సిడీ ఇస్తునానం. మూడేళ్లుగా సబ్సిడీపై డీజిల్ ఇస్తున్నాం. సముద్రంలోకి వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారుడు చనిపోతే పట్టించుకోవాలని గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. పేరుకు మాత్రం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పేవారు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది. ఈ రోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేలా ఆలోచన చేస్తున్నాం. పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం. ఈ రోజు 110 కుటుంబాలకు మన ప్రభుత్వం మేలు చేసిందని సవినయంగా తెలియజేస్తున్నాం. మత్స్యకారులు ఎలా బతకాలని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు.ఈ రోజు ఆ పరిస్థితిని మార్చుతూ..చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 షిప్పింగ్ హార్బర్లను, 4 ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాలు, విశాఖ ఫిషింగ్‌ను ఆధునీకరిస్తున్నాం. ఈ రోజు పనులు జరుగుతున్నాయని సగర్వంగా చెబుతున్నాను. ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 4 షిప్‌ల్యాండింగ్ పనులు రూ.402 కోట్లతో ప్రారంభిస్తున్నాం. ఇంతగా మీ మంచి కోసం ఆలోచన చేసే మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని కోరుతున్నాను. ప్రతి మత్స్యకారుడికి మంచి జరగాలి. వారు తీసుకువచ్చిన చేపలకు మంచి రేటు రావాలని..ఫిష్ ఆంధ్ర పేరుతో రూ.338 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఫిష్‌హబ్‌లు ఏర్పాటు చేశాం. 80 వేల మంది మత్స్యకారులకు ఉపాధి దొరకుతుంది. బీసీలకు, ఎస్సీలు, మైనారిటీలు, ఓసీలోని నిరుపేదలకు ..ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి మన 35 నెలల పరిపాలనలో కేవలం డీబీటీ ద్వారా నేరుగా రూ. లక్ష 40 వేల కోట్లు బటన్ నొక్కి అందజేశాం. ఎక్కడా వివక్ష లేదు. లంచాలు లేవు. సచివాలయాల్లోనే జాబితాను ఏర్పాటు చేశాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్నాం. మన గ్రామాల స్వరూపాలు మారుతున్నాయి. ప్రతి ఊరులో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నాం. ఆర్‌బీకేలు, విలేజ్ క్లినిక్స్, సచివాలయాలు, వీటికి అనుసంధానంగా 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లు ఉన్నారు. నేరుగా మీ ఇంటికే వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో సహాయం చేస్తున్నారు. ఇంతటి మంచి చేస్తున్న ప్రభుత్వం, ఇంతటి అభివృద్ధి, ఇంతటి సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరుతున్నా. ఇంతలా మంచి చేశామని చెప్పే ధైర్యం మనలా చంద్రబాబుకు లేదు. ఇంతటి మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్తుడికి లేదు. ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతికి లేదు. టీవీ5కి లేదు. ఈ ఎల్లోమీడియా కు ధైర్యం లేదు. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో, వాగ్ధానాలు 95 శాతం పూర్తి చేశామని ఇంటింటికి వెళ్లి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉందని మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నా. కాబట్టే మన ప్రభుత్వం గడపగడపకు ఏం చేసిందో చెప్పేందుకు మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు మీ ఇంటికి, మీ గడప గడపకు బయలుదేరారు. మీ ఇంటికి ఏయే పథకాలు అందాయో ప్రతి కుటుంబానికి లేఖలు రాశాను. ఎంత మేలు జరిగిందో చెబుతూ అక్కచెల్లెమ్మలకు నేను స్వయంగా రాసిన లేఖను తీసుకుని మన ప్రజాప్రతినిధులు మీ ఆశీస్సుల కోసం బయలుదేరారు. చేసిన వాగ్ధానాలు అమలు చేశామని, గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలని మీ వద్దకు మన పార్టీ నేతలు వస్తున్నారు. ఇంత నిజాయితీ, నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నాం కాబట్టి తాము చేసిన మంచిని చెప్పుకోలేక, మనం చేసిన మంచిని ఒప్పుకోలేక దుష్ట చతుష్టయం. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు జీర్ణించుకోలేక కడుపులోనుంచి మంట, ఈర్ష్య పుట్టుకొస్తోంది. ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగనన్న వైద్యం చేయిస్తాడు కానీ, ఈర్ష్య, కడుపు మంటకు మాత్రం ఆ దేవుడు మాత్రమే వైద్యం చేస్తాడని కచ్చితంగా చేస్తాడని చెబుతున్నా. మన ప్రతిపక్షం గురించి క్లుప్తంగా నాలుగు మాటలు చెబుతున్నాను. పరీక్ష పేపర్ వీల్లే లీక్ చేయిస్తారు. లీక్ చేసిన వారిని సమర్ధించే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా?ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యోగుల ఈఎస్‌ఐలో లేబర్‌మంత్రిగా ఉంటూ ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి..పౌడర్, మందులు, టూత్ పేస్టు పేరుతో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీలు లేదని అంటున్న ప్రతిపక్ష నాయకుడిని, దుష్ట చతుష్టయాన్ని ఎక్కడైనా చూశారా? కొడుకుకు ఏమి నేర్పుతాం. అబద్దాలు చెప్పవద్దు. మోసం చేయవద్దని మనం నేర్పుతాం. కానీ చంద్రబాబు తన కొడుకుకు అబద్ధాలు, మోసాలు ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు. చంద్రబాబు లాంటి తండ్రిని మీరు ఎప్పుడైనా చూశారా? మంత్రిగా పని చేసి, మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒక్కరు. రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకోరు. ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటున్న చంద్రబాబులాంటి 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిని ఎక్కడైనా చూశారా? రాజకీయ నాయకుడు ప్రజలను నమ్ముకుంటారు. కానీ ప్రజలను నమ్ముకోకుండా కొడుకును, దత్తపుత్రుడిని నమ్ముకున్న నాయకుడిని ఎప్పుడైనా చూశారా? పేదలకు ఇళ్ల స్థలాలు గతంలో ఇవ్వకపోగా, మనం ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు ఇల్లు లేకపోతే తపించే మనసు నాకు ఉంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అమరావతిలో వీరు ఉండకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. డెమోగ్రఫి ఇన్‌బ్యాలెన్స్ వస్తుందని పిటిషన్లు వేస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఎక్కౖyð నా ఉంటుందా? ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకుంటున్నారు. పిల్లలకు గొప్పగా చదువులు చెప్పించేలా తపన పడాలి. ఇలాంటి రాబందులకు, ప్రజలకు ఏ మంచి జరిగినా, అందులో జగన్ ప్రభుత్వంలో మంచి జరిగితే వీళ్లకు అసలు నచ్చదు. ఇళ్ల పట్టాలు, ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుంటారు. పేదలకు మంచి చేసేందుకు డబ్బులు తెచ్చినా అడ్డుకుంటారు. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా వీళ్లకు బాధే. బ్యాంకులు అప్పులు ఇచ్చినా వీళ్లకు బాధే. ఢిల్లీ నుంచి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అడ్డుకునే ఇలాంటి రాబంధులను ఏమనాలో మీరు చెప్పాలి.ఇలాంటి వారిని రాష్ట్ర ద్రోహులా, దేశ ద్రోహులా? మీరు ఆలోచన చేయండి. కళ్లు ఉండి మంచిని చూడలేని ఇలాంటి కబోదులను ఏమనాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆశ్చర్యమనిపిస్తోంది. కుప్పంలో పర్యటిస్తూ ..ఈ మూడేళ్లలో దేవుడి దయతో ప్రతి ఇంటికి వెళ్లి ఈ మంచి చేశామని, ఆశీర్వదించమని కోరుతూ లేఖ ఇస్తున్నాం. మన ప్రజాప్రతినిధులను చూసి ఓర్వలేక చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నాడు. 27 ఏళ్లు ఎమ్మెల్యేగా కుప్పంలో ప్రాతినిధ్యం వహించారు. ఏ రోజు కూడా అక్కడ ఇళ్లు కట్టుకోవాలని ఆలోచన చేయలేదు. ఈ రోజు వైయస్ జగన్ మూడేళ్ల పాలన చూసి కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు పరుగులు తీస్తున్నాడు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించండి. ముగించే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా..మనం చేయగలిగిన మంచిని చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రజలకు చేశాం. చేస్తునే ఉన్నాం. దేవుడి దయ..మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ప్రజలు ఇవ్వాలని, ఇలాంటి వక్రబుద్ధి ఉన్న నాయకుల నుంచి దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని దేవుడిని కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ సెలవు తీసుకున్నారు. పీవీ రావు ఘాట్, ప్లడ్‌బ్యాంకు, రోడ్డు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే సతీష్ అడిగారు. వీటిని మంజూరు చేస్తున్నానని వైయస్ జగన్ మాట ఇచ్చారు.