చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం వైయ‌స్ జగన్‌ భూమిపూజ 

చిత్తూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు డెయిరీ వద్ద అమూల్‌ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్‌, ఎగ్జిబిషన్‌ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో  ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 
రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప‌నుల‌కు భూమి పూజ చేశారు. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభ‌మ‌య్యాయి.  2024 ఏప్రిల్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top