చిరస్మరణీయుడు... మేకపాటి గౌతమ్‌ రెడ్డి  

పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి:  దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, రచయిత, జర్నలిస్ట్‌ విజయార్కె రాసిన చిరస్మరణీయుడు...మేకపాటి గౌతమ్‌ రెడ్డి పుస్తకాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ నెమ‌రువేసుకున్నారు. 
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, రచయిత డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి పాల్గొన్నారు.

Back to Top