సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట

కులం, మతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నా కొందరు ఈర్ష్యతో మాట్లాడుతున్నారు

6 నెలల్లోనే పేదల సంక్షేమం కోసం రూ.28,122 కోట్లు ఖర్చు చేశాం

అవినీతిని బయటకు తీసి అరెస్టులు చేస్తుంటే..టీడీపీ నేతలు రోడ్డెక్కుతారా?

చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 

తాడేపల్లి: కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతుంటే ప్రతిపక్షం ఈర్ష్యతో విమర్శలు చేస్తుందన్నారు. ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వం ప్రజలకు రూ.28,122 కోట్లు నేరుగా అందజేసిందని, ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. హై అండ్‌ ఎక్యూప్‌మెంట్‌ సపోర్టు ఉన్న  1,068 కొత్త అంబులెన్స్‌లు  ఇవాళ విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లినప్పుడు ఒళ్లు పులకించింది. పరిపాలనలో పేద ప్రజలకు ఏరకంగా సాయం చేయాలన్న ఆలోచనలు చేస్తే ప్రజల్లో ధైర్యం, భరోసా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఒక్క వైయస జగన్‌లోనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షం బురద జల్లే ప్రయత్నాలు చేçస్తోంది. వారు పరిపాలనలో ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చేతకాలేదు. ఈర్ష్యలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు నేరుగా అందుతుంటే మీరు ఎలాగు అభినందించలేరు. మీడియా ఉందని ఏదో ఒకటి మాట్లాడటం సరికాదు. రాజకీయాల్లో హుందా తనం ఉండాలి. చెప్పింది చేయాలి..ఇలాంటి చేయలేదు కాబట్టే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేసిందో చూడండి. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి ఆదాయం గండి పడింది. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ ఆరు నెలల్లో రూ.28,122.4 కోట్లు పేద ప్రజలకు చేర్చాం. ఈ ఘనత వైయస్‌ జగన్‌దే. ప్రతిపక్ష నాయకులారా అడ్డగోలుగా మీడియాలో మాట్లడం కాదు..మేం చెప్పేది కూడా విని గ్రహించండి. మేం చెప్పేది వినండి. కరోనా కాలంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసిందో గమనించండి.

ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఖర్చు చేసిన లెక్కలు..

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా 2,62,493 మంది లబ్ధిదారులకు రూ.262.50 కోట్లు ఖర్చు చేశాం.

వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద 49,43,593 మంది రైతులకు రూ.3,675.25 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమా చేశాం

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద 59 లక్షల 3 వేల మందికి రూ.8,457. 59 కోట్లు పింఛన్‌ కింద ఉదయం 6 గంటల నుంచే ఇంటికి వెళ్లి అందజేశాం. దరఖాస్తు చేసుకున్న వారందరికీ పది రోజుల్లో పెన్షన్‌ వచ్చేలా చేసి ఈ రోజు అదనంగా 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశాం. 

సున్నా వడ్డీ కింద మహిళలకు రూ.90 లక్షల 37 వేల మంది మహిళలకు దాదాపుగా రూ.1400 కోట్లు ఇచ్చాం

వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద 69 వేల 300 మంది చేనేత కార్మికులకు దాదాపుగా రూ.166 కోట్లు ఇచ్చాం.

మత్స్యకార భరోసా కింద 3, 09,231 మందికి రూ.110 కోట్లు ఇచ్చాం.

అమ్మ ఒడి కింద తమ పిల్లలను బడికి పంపించిన తల్లులకు 42 లక్షల 33 వేల మందికి రూ.6,350 కోట్లు అందజేశాం.

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఆరు నెలల్లోనే రూ.1400 కోట్లు ఖర్చు చేశాం. వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం కింద 68 లక్షల మందికి  రూ.54 కోట్లు ఖర్చు చేశాం.

జగనన్న వసతి దీవెన కింద 15 లక్షల 57 వేల మందికి రూ.1,220 కోట్లు కేటాయించాం.

జగనన్న విద్యా దీవెన కింద 19,53,043 మందికి రూ.3,853 కోట్లు కేటాయించాం.

 విదేశీ విద్యా దీవెన కింద  1,645 మందికి  రూ.113 కోట్లు ఇచ్చాం.

ఎంఎస్‌ఎంఈ రిస్టార్ట్‌ కింద గత ప్రభుత్వ బకాయిలు తీర్చుతూ 5,251 మందికి రూ.450 కోట్లు విడుదల చేశాం. 

ఇమామ్స్, మౌజమ్స్, పూజరులు, పాస్టర్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద  77,290 మందికి రూ.38 కోట్లు

జగనన్న చేదోడు కింద 2 లక్షల 48 వేల మందికి రూ.248 కోట్లు

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం కింద 2 లక్షల 36 వేలమందికి రూ.354 కోట్లు విడుదల చేశాం

 
అన్ని పథకాలకు ఈ ఆరు నెలల్లోనే 3,53,2,377 మంది లబ్ధి పొందారు. వీరికి దాదాపుగా రూ. 28,122.03 కోట్లు ప్రజల ఖాతాల్లోజమా చేయడం గొప్ప విషయం కాదా?. ఇవన్నీ మేం చేశాం. ఇలాంటివి మీరు చేయగలిగారా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇందులో లోటుపాట్లు ఉంటే గమనించండి. 

నేరుగా ప్రజల ఖాతాల్లోకే..
మా ప్రభుత్వం జెండా చూడదు..పార్టీ చూడదు. కులం చూడదు. కమిటీల ద్వారా రమ్మని చెప్పదు. నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమా చేస్తున్నాం.  శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఐస్‌ ముక్క ఇచ్చి చుట్టూ తిరిగి వచ్చేసరికి ఏమి మిగలలేదు అన్న సామెతలా మా ప్రభుత్వం చేయడం లేదు.  నిధులు కేటాయించి తప్పించుకోవడం కాదు. నేరుగా ప్రజలకే అందజేస్తున్నాం. ఇది గొప్పతనం కాదా? . చంద్రబాబు పరిశ్రమలకు రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. గతంలో మహిళా తహశీల్దార్‌ను జుట్టుపట్టుకొని ఇసుకలో ఈడ్చారు. అవి మరిచి ఈ రోజు బీహర్‌లా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇది కరెక్టు కాదు.  ఎదురుదాడి చేయడం, నిందలు మోపడం సరైన పద్ధతి కాదు. చంద్రబాబు పాలన గురించి జపాన్‌కు సంబంధించిన మాకీ సంస్థ ఏం చెప్పిందో మరిచిపోయారా? ఆంధ్రప్రదేశ్‌ కంటే బీహర్‌ మేలన్ని అప్పట్లో వాస్తవం కాదా?. బీహర్‌ కన్నా దారుణంగా ఉందని ఆ సంస్థ లేఖలు రాసింది. మా ప్రభుత్వంలో అవినీతికి, దౌర్జన్యానికి పాల్పడితే ఏ ఒక్కరి వదిలిపెట్టమని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటున్నారు. లోకేష్‌ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని వెనుకెసుకొని వస్తున్నారు. ఓ మహిళను దుర్భషలాడిన వ్యక్తిని వదిలిపెట్టాలా?. మాపై అరెస్టులు చేస్తారా అంటూ రోడ్లపైకి వచ్చి అరుస్తున్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐలో దోచుకుంటే ఎందుకు వెనుకెసుకొస్తున్నారు. ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు. 
ఈ రోజు 104, 108 వాహనాల ప్రారంభోత్సవంబ్రహ్మండంగా జరిగింది. కుయ్‌..కుయ్‌ అంటూ అంబులెన్స్‌లు వెళ్తుంటే ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేసేందుకు అరవింద ఫార్మా, విజయసాయిరెడ్డి వియ్యంకుడు అంటూ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తారా? ఇందులో ఏదైనా అవినీతి ఉందని నిరూపించండి..నేనే బహిరంగ చర్చకు వస్తానని శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పిన వైయస్‌ జగన్‌ చెప్పి..ఆ పేరు తెచ్చుకున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలాగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. మేం చెప్పింది జరుగుతుందన్న గర్వంతో మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు మార్చి నుంచి హైదరాబాద్‌లో దాక్కొని జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతున్నారు. అనునిత్యం ప్రజలు, అధికారుల మధ్య ఉంటున్నవైయస్‌ జగన్‌ గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటు. 108 వాహనాల కొనుగోలుపై ధైర్యం ఉంటే చర్చకు రండి. ప్రజాస్వామ్యంలో హుందాతనంగా రాజకీయాలు చేయాలి. రామోజీరావు కష్టపడి పైకి వచ్చి ఉండవచ్చు. కానీ ఈ రోజు వివక్షతో వార్తలు రాయడం సరికాదు. తెలంగాణలో ఒక మాదిరిగా, ఏపీలో మరోమాదిరిగా కరోనాపై వార్తలు రాయడం సరైంది కాదు. ఇది తప్పు కాదా?. 9 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం ఒక్క ఏపీ మాత్రమే. రికవరీ రేటు బ్రహ్మండంగా ఉంది. డేత్‌ రేట్‌ తక్కువగా ఉంటే తప్పుడు రాతలు రాస్తారా?. ఎందుకు కళ్లు మూసుకొని వార్తలు రాస్తారు. గ్రామవాలంటీర్లు, ఆశావర్కర్లతో ఇంటింటి సర్వేలు చేస్తుండటం మీకు కనిపించడం లేదా? ఓటుకు నోటుకు కేసులో దొరికితే అది కెమెరా తప్పు అంటారా?. రాజ్యాంగపదవిలో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో కలిస్తే హోటల్‌పై నిందలు వేస్తారా? ఓ డాక్టర్‌ తప్పతాగి రోడ్డుపై చిందేస్తే..మందు అమ్మిన వారిదే తప్పు అంటారా. ఇలాంటి వింత పోకడలు మానుకోకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్షాన్ని హెచ్చరించారు.
 

Back to Top