వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు మొట్ట మొదటి సంతకం  

ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ముఖాముఖి

ప్ర‌కాశం: వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పూర్తిగా మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్ట మొదటి సంతకం చేస్తానని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి, వారి అభిప్రాయాలు, స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:

ఈరోజు అవ్వాతాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య, మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా, మీ మనవడిగా మీ అందరితోపాటు మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది.
ఈరోజు నేను ప్రతి అవ్వతోనూ, ప్రతితాతతోనూ.. అందరితో కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. 

గతంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్‌ రూ.1౦౦౦ మాత్రమే.
ఒకసారి మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తుండేది, ఎంత మందికి వస్తుండేది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే.. ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు గానీ, వికలాంగులకు గానీ, వితంతు అక్కచెల్లెమ్మలకుగానీ ఇటువంటి అభాగ్యులకు, ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వారికి ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు గతంలో పెన్షన్ రూ.1000. అవునా? కాదా? 


బాబు హయాంలో కేవలం 39లక్షల పెన్షన్లు మాత్రమే
ఎన్నికలకు 6 నెలలు ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంత మందికి ఇచ్చేవారో తెలుసా?.
కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెబుతున్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు ఖర్చయ్యే ఆరోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్లెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, వీళ్ల ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్లు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని ఉండకూడదని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదని, లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత, ఎక్కడికెక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత, ఈరోజు లేదు రేపు రా.. అని మళ్లీ చెప్పే పరిస్థితి రాకూడదని, మొట్ట మొదట సారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు. అవ్వాతాతల గురించి ఆలోచన చేశాడు. వారి ఆత్మగౌరవం గురించి, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు. 

వాలంటీర్లతో ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తూ...
అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, దానికి అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించడం, గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికీ, ప్రతి అవ్వా, ప్రతి తాత ముఖంలో చిరునవ్వు చూడటానికి ప్రతి ఇంటికీ నెల 1వ తారీఖునే అది సెలవుదినమైనా, ఆదివారమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికీ నెల 1వ తారీఖునే వచ్చి తలుపుత ట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వనూ, ప్రతి తాతనూ వాలంటీర్లు ఒక మనవడిగా, మనవరాలిగా పలకరిస్తూ అవ్వాతాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా పెన్షన్ చేతుల్లోనే పెడుతున్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతోంది. 

మార్పు అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను.జరిగిన  మార్పు ఇదొక్కటే కాదు. రెండో మార్పు కూడా జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ అప్పట్లో కేవలం రూ.1000 మాత్రమే ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్లు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా చివరకు ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా, ప్రతి ఒక్కరినీ కూడా నా అవ్వ, నా తాత అని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 


ఇవాళ 66.34 లక్షల మందికి పెన్షన్లు.
అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్ దారులు ఈరోజు చూస్తే 66.34 లక్షల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1000 ఇస్తున్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు.. ఈరోజు ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతోంది. తేడాను ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద అభాగ్యుల మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు, మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి. 

బాబు అవ్వాతాతల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు.
గత పాలకులను చూశారు. నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడూ అంటుంటాడు. 14 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటుంటాడు. నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెబుతుంటాడు ఆయన. కానీ ఏ ఒక్కరోజూ కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేశాడా? అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కారణం ఏమిటంటే మనసులో ఉండాలి ప్రేమ. అది చేతల్లో బయటకు వస్తుంది అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. 

ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే.. రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తున్నారు. ఏ మాదిరిగా జరుగుతున్నాయి రాజకీయాలు అనేది మీరంతా చూస్తున్నారు. అసలు రాజకీయాలు అన్నవి నిజంగా పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్ట మొదటి సారిగా అడుగులు వేగంగా వేశాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా, ఎవరైనా మేనిఫెస్టో అనేది ఇచ్చేవారు. ఆ మేనిఫెస్టో చూస్తే... అబ్బో రంగు రంగులుగా కనిపిస్తోంది. అవ్వలకు ఇది చెప్పేస్తున్నారు, తాతలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు ఇవి చెప్పేస్తున్నారని రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేవి. రకరకాలుగా సామాజికవర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేవి. 


గత పాలకులు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు.
కానీ ఏం జరిగేది. ఎన్నికలు అయిపోయే సరికే ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో, దాన్ని ఏపొద్దన్నా నెరవేర్చాలా లేదా అన్న ఆలోచన కూడా చేయని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికల ప్రణాళిక ఇస్తే, దానిని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెబుతున్నాడు. 

మీ జగన్‌కు బాబు మాదిరిగా మోసం చేయడం రాదు
నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం రాదు. మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు. ఈ రెండూ మీ బిడ్డకు తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా అబద్ధాలతో, మోసాలతో పోటీ పడలేడు. ఎందుకంటే వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికేముంది, నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్లది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే అది కచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టే కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు ఉంచుతున్నా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

రూ.3వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు.
ఈరోజు జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మనది. జనాభా ప్రకారం చూస్తే ఇలా 66.34 లక్షల మందికి పెన్షన్ అందుకుంటున్న, జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా పెన్షన్ అమౌంట్‌ ఇస్తున్న రాష్ట్రం మనదే. రెండోది ఏమిటి అంటే రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు.. దేశంలోనే ఎక్కడా లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్లు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తున్న పరిస్థితి. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్న పరిస్థితి ఉంది. 

58 నెలల్లో ఏకంగా రూ.90వేల కోట్లు పెన్షన్ రూపంలో పంపిణీ.
ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వంవచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకొంటే ఏకంగా రూ.90 వేల కోట్లు ఈ పెన్షన్ రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఒక్కసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి రూ.24 వేల కోట్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత గమనిస్తే బిహార్ లో చూస్తే రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది రూ.5160 కోట్లు, కర్ణాటకలో చూస్తే రూ.4700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా రూ.8180 కోట్లు. అంతే. ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తున్న డబ్బు ఏకంగా రూ.24 వేల కోట్లు ఇస్తున్నాం. 

మోసం చేసేందుకు పెంచి చెబుతారు.
ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే రేప్పొద్దున మోసం చేసేందుకు రూ.4 వేలంటారు, రూ.5 వేలంటారు, రూ.6 వేలంటారు, ఇంకా అవసరం అయితే మోసం చేసేందుకు ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే, మంచి చేసే మనసు ఎవడికైనా ఉంది అంటే నేను ఈరోజు నేను గర్వంగా కూడా ఒకమాట అయితే మీ అందరికీ ఇస్తున్నాను. మేనిఫెస్టోలో నేను చెప్పినా, చెప్పకపోయినా, ఎందుకంటే చేయగలిగిందే నేను చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, చెప్పకూడదు. చేయగలిగిందే చెప్పాలి.

కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ మీ అందరికీ కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ఏదైనా, ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఇటువంటి ఏ సెక్షన్స్ కు అయినా కూడా మంచి చేసే విషయంలో జగన్ తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని మాత్రం చెబుతున్నాను. 

వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు. అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశం, పరిస్థితి అసలు ఉండనే ఉండదు అని కూడా చెబుతున్నా. ఈ విషయాలన్నీ మీ అందరికీ ఎందుకు చెబుతున్నానంటే 2014లో ఏం జరిగింది అన్నది మీ అందరికీ కూడా తెలిసే ఉండాలి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుండే ఉంటుంది. నా సిద్ధం సభలు చూస్తున్నారా టీవీల్లో అయినా చూస్తున్నారా మీరంతా నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలు అన్నీ కూడా. చూసే వాళ్లందరూ ఒక్కసారి చేతులు పైకెత్తండి. చూసే వాళ్లు మాత్రమే. 

అందరూ చూస్తున్నారు కాబట్టి నేను మళ్లీ చెప్పడం రిపిటేషన్ అవుతుంది. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు ఏమి హామీలిచ్చాడు అని నేను ఇలా ఆయన పోస్టర్ చూపించి, ఆయన స్వయంగా సంతకం పెట్టి, ఆయన ఫొటో, మోడీ గారి ఫొటో, దత్తపుత్రుడి ఫొటోతో 2014లో ఆయన ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడు అని ఇలా మనం ఫొటోలు చూపించి ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు, ముఖ్యమైన హామీలంటూ 2014లో ఏరకంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికీ ఆ పాంప్లెట్ పంపించాడు. టీవీల్లో అప్పట్లో ఈనాడులో, ఆంధ్రజ్యోతి, టీవీ5లో ఏ రకంగా అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంప్లెట్ లో రాసినవి, ముఖ్యమైన హామీలంటూ తాను చెప్పిన విషయాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన అమలు చేయని పరిస్థితులు అన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చెప్పడం జరిగింది. 

ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెబుతున్నాను. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండి. ఎందుకంటే మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ మాదిరిగా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే ఎక్కడా కూడా కరప్షన్, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తీసుకొచ్చాడు కాబట్టే ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి రూ.70 వేల కోట్లు మంచి చేస్తూ ఈరోజు పనులు జరుగుతున్నాయి. 

కానీ ఈరోజు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకొంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను కరప్షన్, వివక్ష లేకుండా రూ.70వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి జగన్ కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటివి అబద్ధాలే కదా అని రూ.1.40 లక్షల కోట్లు గురించి చెబుతున్నాడంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

బాబుకు ఓటేస్తే పులినోట్లో తలపెట్టినట్లే...
తర్వాత మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే మాత్రం.. పులినోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. 
ఇక మైకులో మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైకు పంపిస్తాను. మీరేదైనా సలహాలు, సూచనలు ఏదైనా ఇస్తే కూడా తీసుకుంటాను. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన సామర్ధ్యాన్ని  పెంచేదాని కోసం ఉపయోగపెట్టుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

పెన్షనర్లతో ముఖాముఖి అనంతరం చివర్లో మాట్లాడుతూ సీఎం ఇంకా ఏమన్నారంటే...
ఈరోజు ఎంత మందికి మైకు ఇచ్చినా కూడా... అందరికీ మైకు ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేం కాబట్టి వీలైనకాడికి మీ అందరి అభిప్రాయాలను, కొద్దో గొప్పో తెలుసుకునే కార్యక్రమం, అవకాశాన్ని బట్టి చూసుకున్నాను. ప్రతి ఒక్కరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పని చేస్తున్నది. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థను, ఎంతగా కోరుకుంటున్నారో, ఎంతగా కావాలానుకుంటున్నారో తెలుసుకున్నందుకు, చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 

ఇదే తేడా ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి, మూడు సార్లు సీఎంగా నేను చేశాను అని చెప్పుకొనే ఈ చంద్రబాబు నాయుడుకు కనీసం ఏరోజు ఆలోచన కూడా రాలేదు. ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి, ఇంటింటికీ మంచి జరగాలి, మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకుని రాగలుగుతాము అన్న ఆలోచన ఏరోజూ రాలేదు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం, వాటి ద్వారా అజమాయిషీ చేయించడం, ఒకవైపున లంచాలు తీసుకుంటూ, మరోవైపున వివక్ష చూపుతూ, ఏ పార్టీ వాళ్లు అని అడుగుతూ, వాళ్ల పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయాలి అని తాపత్రయ పడుతూ చివరకు అది కూడా సరిగ్గా చేయక చంద్రబాబు నాయుడు అనే మనిషి అధ:పాతాళానికి ఎలా వెళ్లిపోయాడో మనమంతా కూడా చూస్తున్నాం.

కచ్చితంగా నేను మరొక్కసారి మీ అందరికీ మాట చెబుతున్నాను. మనం మొట్ట మొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున.. వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పూర్తిగా మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్ట మొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొక్కసారి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే మాత్రం ఆ స్లిప్స్ మీద రాసి ఆ బాక్సులో ఇస్తే ముఖ్యమైన సలహాలన్నీ నా దాకా వస్తాయి. అది రాయించి ఇచ్చేయండి.  రేపు ఉగాది కాబట్టి... మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి..

1. ప్రభావతి, దర్శి:

ప్రతినెలా ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెట్టి పోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడుచోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్లాను ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు ఇంకోచోటకు వెళ్లాను అక్కడా కాదన్నారు. మోకాళ్లనొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో. చివర్లో ఒకచోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో అంటే అక్కడికి వెళ్లి తెచ్చుకున్నాను. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు మమ్మల్ని మంచికి అయితే కాదు. మాకు వాలంటీర్లు కావాలి, వాలంటీర్ల వ్యవస్థ కావాలి. మేము చూడటానికి మనుషులం బాగున్నా మోకాళ్లనొప్పితో నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు , మాకు వాలంటీర్లు కావాలి. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు, గడపగడపకు పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాస్కులతో సహా గడపగడపకు పంపించారు. వాలంటీర్ల వ్యవస్థను మాత్రం తీసేస్తే మాత్రం మేము ఒప్పుకోము.    

2. నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు:

నేను 2019కి ముందు ఉన్న చిన్నమాట చెబుతాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీ అని ఒకటి ఉండేది. వాళ్లు డబ్బు రూపంలో గానీ, లేదనుకో వాళ్ల మనుషులయితే అయితే పనిచేసేవాళ్లు, పెన్షన్లు ఇచ్చేవారు. మీరు పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఇవ్వని ఒకటి ఏంటంటే దేవుని దూతగా వాలంటీర్ ను పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి మీ రూపంలో దివ్యాంగులకు ఏం కావాలి, దివ్యాంగులకు ఎటువంటి హెల్ప్ కావాలి అని పెన్షన్ ఒక్కటే కాదు సదరం సర్టిఫికెట్ అయినాసరే, ఆధార్ కార్డు అయినాసరే ప్రతిఒక్కటీ వచ్చి మేము కాళ్లు బయటపెట్టకుండా చూసుకునేవారు. కానీ చంద్రబాబు మిమ్మల్ని ఏం చేయాలేక తన అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టికొట్టుకుపోతారు. నేను కళ్లారా చూశాను ఓ 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కు వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయింది దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డా.. చంద్రబాబా అందరూ ఆలోచన చేయాలి.    

3. దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు:

ఇంట్లో నుంచి బయటకు పోవడానికి అవకాశం లేని దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు మీ ఎదురుగా నిలబెట్టి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు పాదాభివందనాలు. అన్నా.. పెన్షన్ టీడీపీ గవర్నమెంట్లో వెయ్యి రూపాయలు ఇవ్వడం కాదన్నా. ఒక పెన్షన్ ఒక వ్యక్తి చనిపోతేనే రెండోవ్యక్తికి జన్మభూమి కమిటీలో పెన్షన్ శాంక్షన్ చేశారన్నా ఊరిలో. రూ.2 వేలు ఇచ్చింది చివరి రెండు నెలల్లోనే. ఆ తర్వాత మీరు రూ.3 వేలు చేస్తానని చెప్పిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లను ఆపాలి ఎలాగైనా..ఈ జగన్ మోమన్ రెడ్డి గారికి పేరు రాకూడదు.. వీళ్లను ఏవిధంగానైనా ఆపాలని నాలుగు గద్దలు తోడై..రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఐదో గద్దను తోడు చేసుకున్నారన్నా పురంధేశ్వరిని. ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసి ఒక్కదెబ్బ ముసలోళ్లు, గుడ్డోళ్ల మీద వేసాడన్నా. పది మంది చూపు తగిలితే రాయి అయినా పగులుద్దన్నా. అటువంటిది 69 లక్షల మంది చూపుతగిలిందన్నా ఈ ఐదుగురికి. వీళ్లంతా నామరూపాలు లేకుండా పోతారన్నా. మీరు 2024 కే ముఖ్యమంత్రి కాదు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు. 

4. వెంకటపతి, దర్శి:

రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్ కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చినోళ్లకు కుర్చీలుండవు. అప్పుడు దోమలు మరీ కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుంది అని నేను వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వాడ్ని. 8 గంటలకు వచ్చేవారు అన్ని పనిచేసేసరికి 9 అయ్యేది. అప్పటికే దాదాపు వంద, రెండొందల, మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లకు మీరు సాయంత్రం గానీ, రేపు గానీ రండి అని చెప్పేవారు. అలా 7 రోజులదాకా పెన్షన్ ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డి బంగారపు మెదడు లోనుంచి వచ్చిన మేధావి ఆలోచన. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వీళ్లద్దరికీ మే 13న ప్రజాకోర్టులో శిక్ష వేస్తుంది, జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది.        

5. శ్రీనివాస్ రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం:

అన్నా మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ నాలుగువేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది, కానీ నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండలస్థాయి ఆఫీస్ కు వెళ్లాలి, కానీ ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసే భయపడుతున్నారు. 

6. గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం:

నువ్వే రావాలి మాకు. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాన్న హయాంలో మా ఇంట్లోకి నీళ్లుపోతే నాకు ఇళ్లు కట్టించాడు వైయస్. ఎన్ని సంవత్సరాలు అయినాసరే నువ్వేకావాలి.  నాకు నలుగురు కొడుకులున్నా లాభం లేదు, నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు నా కొడుకువి. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది  బ్యాంకుల నుంచి రూ.23 వేలు నీ సొమ్ము వచ్చాయి నేను తింటున్నాను.  నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా.

Back to Top