హైదరాబాద్: 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప,దిగని గడప లేదన్నట్టుగా తిరుగుతున్నారని ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు ఉపాధి కల్పించే స్థితిలో ఎవరూ లేరని..వాళ్లే అసలు ఉద్యోగం లేకనో,సగం పనితోనో కాలం గడుపుతున్నారన్నారు. ఏపీలో కౌంటింగ్ నిలిపేయడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు.వీవీ ఫ్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయారు.తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టు,సుప్రీంకోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయని ట్విట్ చేశారు.