పరాకాష్ఠకు చంద్రబాబు అరాచకాలు

సొంత ప్రయోజనాలకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను వాడుకుంటున్నారు

ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు,ఎన్నికలకు సంబంధమేమిటి..?

ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్‌ ఛీప్‌ పాత్ర

ఇంటెలిజెన్స్ డీజీపై వేటు స్వాగతిస్తున్నాం..

డీజీపీని కూడా పక్కనపెట్టాలి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌: ఏపీలో అధికార వ్యవస్థ అరాచకంగా తయారైందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలను గత రెండేళ్లుగా  మీడియా ద్వారా  వైయస్‌ఆర్‌సీపీ ప్రజల దృష్టికి తీసుకెళ్తుందన్నారు.చంద్రబాబు సొంత ప్రయోజనాలు కోసం ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని, ఇంటెలిజెన్స్‌ నిరంకుశ రాజు తయారు చేసుకున్న వ్యవస్థలా మారిందన్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయానికి  ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌సీపీ స్వాగతిస్తునట్లు తెలిపారు.

చంద్రబాబు తప్పడు పనులకు ఏబీ వెంకటేశ్వరావు, డీజీపీ కొమ్ము కాస్తున్నారని అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశామన్నారు. డీజీపీని కూడా పక్కనపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచం తల్లకిందులు అయిపోయినట్లు చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతున్నారన్నారు. ఈడి,బీజేపీ కుమ్మక్కయిందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.ఈసీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎందుకంత గగ్గోలు పెడుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకుంటున్నాని తెలిపారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు,ఎన్నికలకు సంబంధమేమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ సేకరిస్తోందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేతల పార్టీ నేతల ఫోన్లు కూడా టాప్‌ చేస్తున్నారన్నారు. చీకటి చక్రవర్తి తయారుచేసిన వ్యవస్థలా ఇప్పుడున్న ఇంటెలిజెన్స్‌ మారిందన్నారు.వీరి వల్లన ఫోన్‌ ట్యాపరింగ్‌లు కూడా జరుగుతున్నాయన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఫోన్‌ల్లో మాట్లాడానికి కూడా భయపడతున్నారన్నారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌  తన పరిధిని దాటి రాజకీయంగా కూడా జోక్యం చేసుకుంటున్నారని అందరికి తెలుసునన్నారు.

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా అందరికి కూడా తెలుసునన్నారు.ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్‌ ఛీప్‌ పాత్ర ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారన్నారు.ప్రత్యేకంగా 20 మంది హ్యాకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారన్నారు.ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్ళి మరీ టెక్నాలజీని తీసుకొచ్చారన్నారు.వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లో కూడా చొరబడుతున్నారన్నారు. డీజీపీని తప్పించాలని మరోసారి ఈసీని కలవబోతున్నామన్నారు.

Back to Top