వాళ్ల కోసం బాబు నానా తంటాలు పడుతున్నారు

ట్విట్ట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి

హైదరాబాద్‌ : ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులను చకచక క్లియర్‌ చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ నెల 23న  రిటర్న్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

తెల్లకాగితం మీద అగ్రిమెంట్‌ రాసుకోవడమేంటో?
రవిప్రకాశ్‌ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్‌ కేసుగా పరిగణించి ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ‘ రవి ప్రకాశ్‌ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజీ కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్‌ కేసు అవుతుంది. ట్రిబ్యునల్‌ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అయినా తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్‌ రాసుకోవడమేంటో?’ అని  ట్విట్‌ చేశారు. 

 

Back to Top