జి.కృష్ణ ప్రణీత్‌కు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన సీఏ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌
 

తాడేపల్లి: చార్టర్డ్ అకౌంటెంట్  (సీఏ) ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌ జి.కృష్ణ ప్రణీత్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. కృష్ణ ప్రణీత్‌తో పాటు  జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించిన వి.ఆంజనేయ వరప్రసాద్‌  శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.
 

Back to Top