వైయ‌స్ జగన్ పాలన చూసి టీడీపీ నాయకుల‌కు వ‌ణుకు

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.రామ‌చంద్ర‌య్య
 

వైయ‌స్ఆర్ జిల్లా:   వైయ‌స్‌ జగన్‌కు అనుభవం లేదని అవహేళన చేశార‌ని అలాంటి నాయ‌కులు ఈరోజు ముఖ్య‌మంత్రి పాలన చూసి వణుకు మొదలైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.రామ‌చంద్ర‌య్య అన్నారు. గత 5 ఏళ్ల చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమని మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు గాడి తప్పించారని ధ్వజమెత్తారు. బుధ‌వారం క‌డ‌ప న‌గ‌రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు తన కళ్ల ముందు వైయ‌స్‌ జగన్ ముఖ్యమంత్రి అవ్వడంతో అవమానం భరించలేకపోతున్నారు. వైయ‌స్ జగన్ స్పష్టమైన పరిపాలన అందిస్తారు. రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలకు తావివ్వకుండా చూడాలని హోంమంత్రి సుచరితను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ నేరవేరుస్తారు. చంద్రబాబు తన కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను మరిచారు. వైఎస్‌ జగన్ అలా కాకుండా అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి సమతుల్యం పాటించారు. జగన్‌కు అనుభవం లేదని అవహేళన చేశారు. ఈరోజు జగన్ పాలన చూసి టీడీపీ నాయకులకు వణుకు మొదలైంది. ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీ వర్కర్లకు, హోంగార్డులకు వేతనాలు పెంచి వారి జీవితాల్లో సంతోషాలు తెచ్చారు. వైయ‌స్ జగన్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు ప్రశంసించాల్సింది పోయి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. మీరు తిన్న ప్రతి రూపాయి విచారణలో వైయ‌స్ జగన్ కక్కిస్తారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, ప్రజల ఓట్లు తొలగించావు. డేటాను చోరీ చేశావు. ఆంధ్ర ప్రజలు మంచి వారు కాబట్టి చంద్రబాబు చేసిన అరాచకాలకు ఇంకా ఘోరంగా అవమాన పరచలేదు. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ తప్పకుండా విచారణ చేయిస్తారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి కూడా రైతులకు ఎటువంటి మేలు చేయలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన జిమ్మికులను ప్రజలు గుర్తించారు' అని రామచంద్రయ్య అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top