అర్హ‌త ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తాం

- మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

అన్ని ప్ర‌భుత్వం శాఖ‌ల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల‌ను వారి అర్హ‌త, స‌ర్వీసును బ‌ట్టి క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తాం. దీనిపై మంత్రుల క‌మిటీ ఏర్పాటైంది. ఇప్ప‌టికే అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌లో రెండు సార్లు చ‌ర్చించ‌డం కూడా జ‌రిగింది. ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, ప్రిన్సిప‌ల్ ఫైనాన్స్ సెక్ర‌ట‌రీలతో క‌లిపి క‌మిటీ వేశాం. వారికి గడువు ఇచ్చాం. క‌మిటీ ఇచ్చిన గ‌డువు మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటాం. ప్ర‌తిప‌క్షం కోరిన‌ట్టు చ‌ట్టం చేసిన తెల్లారే అమ‌లై పోతాయ‌ని ప్ర‌జ‌ల్లో భ్ర‌మ‌లుక‌ల్పించ‌డం స‌రికాదు. టీడీపీ మాదిరిగా 600 హామీలు ఇచ్చి త‌ప్పించుకునే త‌త్వం మాది కాదు. మేనిఫెస్టోలో పొందుప‌రిచిన ప్ర‌తి హామీని నెర‌వేరుస్తాం. టీడీపీ మాదిరిగా వెబ్‌సైట్‌లో మేనిఫెస్టో పెట్టి తీసేసే సంస్కృతి మాది కాదు. 
 

Back to Top