అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పెట్టిన బీఆర్‌ఎస్ పార్టీకి స్థానం లేదని మంత్రి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. ఏపీలో ఎవరెన్ని ఎన్ని సభలు పెట్టినా ప్రజల అభిమానం పొందలేరన్నారు. పార్టీలు ఎవరైనా పెట్టవచ్చు అని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వారికే ప్రజలు పట్టం కడతారన్నారు. ప్రతి సంక్షేమం ద్వారా ఈ రోజు సీఎం వైయస్ జగన్ ప్రతి వ్యక్తి గుండెల్లో ఒక దేవుడిలాగా ఉన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గడపలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉందన్నారు. వైయస్ జగన్‌ను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పల్లకీలో మోస్తున్నారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శించారు. ఎన్ని పార్టీలు వచ్చినా విజయం వైయస్ జగన్‌దేనని, మా టార్గెట్ 175కు 175 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని మంత్రి ఉషాశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ కుప్పం అనే టార్గెట్‌లో మేం పని చేస్తున్నామని వివరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో అనే కార్యక్రమం కాదు..కాంగ్రెస్ జోడో అని పాదయాత్ర చేస్తే బాగుంటుందన్నారు. మళ్లీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉషాశ్రీ చరణ్ తెలిపారు.