ప్రకాశం: మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, నాపై ఆరోపణలు నిరూపించకుంటే మీ నేతలపై చర్యలు తీసుకుంటారా? అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే సహించేంది లేదన్నారు. అసత్యాలు రాస్తున్న ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఫైరయ్యారు.
బాలినేని శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మైత్రి మూవీస్‌లో నేను పెట్టుబడి పెట్టినట్టు పవన్ కల్యాణ్ నిరూపించగలరా?. మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. నాపై ఆరోపణలు నిరూపించకుంటే మీ నేతలపై చర్యలు తీసుకుంటారా?. పవన్.. మీ పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొంటారు. ఎవడో ఎక్కడో స్టేట్‌మెంట్ ఇస్తే ఇక్కడ ఈనాడు దుర్మార్గపు రాతలు రాస్తోంది. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే సహించేంది లేదన్నారు. అసత్యాలు రాస్తున్న ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఫైరయ్యారు.
వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్‌కి ఒంగోలులో పర్మిషన్ ఇప్పిస్తే ఆ సినిమాకి నేను పెట్టుబడి పెట్టానని ప్రచారం చేశారు. టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ రాజుపాలెంలో భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా?. జనార్థన్ నీ బాగోతం మొత్తం నాకు తెలుసు. దాన్ని బయటపెడతాను అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.