బాబు జ‌గ్జీవ‌న్‌రామ్‌కు ఘ‌న నివాళి

విజ‌య‌వాడ‌:  స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త, మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్ర‌హానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శైలాజా, స్థానిక కార్పొరేటర్ బాల గోవింద్, త‌దిత‌రులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు కాలే పుల్లారావు, బుదాల శ్రీను, తోకల శ్యామ్,మదిరి ప్రభాకర్,లెల్లపూడి లాజర్,ఒగ్గు విక్కీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top