విశాఖ: గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే తిప్పాలనాగిరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజులు నిర్వహిస్తున్నట్లు సిడిఎంఎ కోటేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించారని, మా ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండే విధంగా చాలా మార్పులు చేర్పులు చేసిందని ఎమ్మెల్యే నాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి ఈ కార్యక్రమం 45 రోజులు ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచించారు. జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ.. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ ప్రభుత్వం వైద్యం ప్రజలందరికీ దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా చేసిందని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఇంకా దగ్గర అయిందని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో గాజువాక వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక మునిసిపల్ కమిషనర్ సింహాచలం, హాస్పిటల్ ప్రధాన వైద్యాలు, కార్పొరేటరలు రాజాన రామారావు, ఉరుకూటి చందు, పల్లా చినతల్లి, కోమటి శ్రీనివాస్, గుడివాడ లతీష్, ఇళ్ళపు ప్రసాద్, బొగాది సన్ని, వాసు గౌడ్, దర్మాల శ్రీను, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు, హాస్పిటల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.