ఆర్టీసీ కార్మికుల సంబరాలు

సీఎం వైయస్‌ జగన్‌కు అజన్మాంతం రుణపడి ఉంటామని ప్రతిజ్ఞ

సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి కావడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో 54 వేల మందికి లబ్ధి చేకూరింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఆర్టీసీ డిపో వద్ద సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రపటాలకు ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అజన్మాంతం రుణపడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

Back to Top