నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

 విజయవాడ:  నూతనంగా ఎన్నికైన  శాసన మండలి సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు నూత‌నంగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇస్రాయిల్,  జయ మంగళ వెంకటరమణ, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,  ఎంవీ రామచంద్రారెడ్డి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, మంగమ్మల‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల,  మంత్రులు అంబటి , కారుమురి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

Back to Top