ఏపీలో మరో ఐదు చోట్ల రీపోలింగ్‌

ఈసీ ఆదేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల ఈ నెల 19న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు.  ఎన్‌ ఆర్‌ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురంలో 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ పోలింగ్‌ ఉంటుంది. 
 

Back to Top