మాట ఇస్తే తప్పని నైజం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ది

ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కన్వీనర్ దేవదాసు, ప్రధాన కార్యదర్శి మధుసుదనరాజు 

 ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సమ్మెకు దూరం

అనంతపురం: మాట ఇస్తే తప్పని నైజం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిది అని ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కన్వీనర్ దేవదాసు, ప్రధాన కార్యదర్శి మధుసుదనరాజు, గౌరవాధ్యక్షుడు నరసింహ మూర్తి పేర్కొన్నారు.ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉన్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బుధ‌వారం వారు మీడియాతో మాట్లాడారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ స్వార్థ పరులని విమ‌ర్శించారు. మెజార్టీ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉన్నార‌ని తెలిపారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ ఉద్యమం హాస్యాస్పదంగా ఉంద‌ని పేర్కొన్నారు. త్వరలో పీఆర్పీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఇప్పటికే ప్రకటించార‌ని, సీఎం ప్రకటన తర్వాత ఆందోళన చేస్తామనటం అవివేకమ‌న్నారు. ఉనికి కోసమే బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస్ రావు పాకులాట అని విమ‌ర్శించారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ రావులకు ఉద్యోగుల మద్దతు లేద‌ని వారు స్ప‌ష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top