కేబినెట్‌ భేటీ ప్రారంభం

సుమారు 30 అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో జరుగుతున్న సమావేశానికి రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మినహా మంత్రిమండలి సభ్యులందరూ హాజరయ్యారు. మంత్రి పేర్ని నాని మాతృమూర్తికి అనారోగ్యం కారణంగా ఆయన కేబినెట్‌ భేటీకి గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. వాటిలో ప్రధానంగా చిరు వ్యాపారులకిచ్చే జగనన్న చేదోడు పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. 

అంతేకాకుండా ఉచిత నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీపై కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అదే విధంగా ఇసుక పాలసీలో మార్పులు, భూముల రీసర్వేపై చర్చించనున్నారు. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. పాడేరు మెడికల్‌ కాలేజీ 35 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌పై మంత్రిమండలి సభ్యులు చర్చించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top