నీచమైన ఆలోచనలతో సీఎం వైయ‌స్ జగన్‌పై బురద  

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్ర‌హం

తప్పుడు కథనాలతో రామోజీ శునకానందం 

ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు

తుపాను వచ్చిన సమయంలో బాబు ఇచ్చిన‌ దానికంటే సీఎం వైయ‌స్ జగన్‌ ఎక్కువగానే పరిహారం ఇచ్చారు

తెలుగుదేశం అలసత్వం వల్లే గుండ్లకమ్మకు ఈ దుస్థితి

తెలంగాణలో  బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జ‌న‌సేన‌కు రాలేదు

ఎంత మంది కలిసొచ్చినా మళ్లీ వైయ‌స్‌ జగనే సీఎం

 తాడేపల్లి: నీచమైన ఆలోచనలతో సీఎం వైయ‌స్ జగన్‌పై బురద జల్లుతున్నార‌ని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విపరీతమైన బురద జల్లుతోంది. ఈనాడులో రామోజీరావు చాలా నీచమైన విష ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు ఈ వయసులో కూడా శునకానందాన్ని పొందుతున్నాడు. చంద్రబాబులాగా షో చేయడం సీఎం వైయ‌స్ జగన్‌కి తెలియద‌ని మంత్రి అంబటి పేర్కొన్నారు.  తుపానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో తీవ్ర నష్టం తప్పిందని, ప్రాణనష్టం లేకుండా ఆస్తినష్టంతో బయటపడ్డామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,..ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు.

 

 

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

నష్టపోయిన వారందరినీ అదుకుంటాం:

  • మిగ్‌జాం తుపాను రాష్ట్రంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. పంటలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది.
  • రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన జాగ్రత్తలు తీసుకుని, ప్రభుత్వం యంత్రాంగాన్ని లోతట్టు ప్రాంతాల పంపి అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాం.
  • తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టంతోనే బయటపడ్డాం.
  • ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఎవరైతే నష్టపోయారో వారందరినీ ఆదుకునేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • 9 వ తేదీ నుంచి పంట నష్టం అంచనాలను, ఇళ్ల నష్టాన్ని కూడా లెక్కించడం మొదలు పెట్టాం.
  • జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని బురదజల్లే నీచ మనస్థత్వం చంద్రబాబుది:

  • ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని, జగన్‌ గారిపై, ప్రభుత్వంపై బురదజల్లాలని నారా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నాడు.
  • ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలనే నీచ మనస్థత్వం కలిగిన చంద్రబాబు బురదజల్లాలని చూస్తున్నాడు.
  • ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం స్పష్టంగా అర్ధం అవుతోంది.
  • ఆయనకు కుడి, ఎడమలుగా ఉండే పత్రికలు కూడా విపరీతంగా ప్రచారం చేసి బురదజల్లుతున్నాయి.
  • ఈనాడులో రామోజీరావు ఈ వయసులో కూడా నీచమైన వార్తలు రాస్తున్నాడు.
  • ఈ రోజు మొదటి పేజీలో మట్టి అంటకుండా..చొక్కా నలగకుండా..కార్పొరేట్‌ పరామర్శ, రైతు బాధలు పట్టని అసమర్ధ సీఎం, కొత్తవి కట్టరు..ఉన్నవి కొట్టుకుపోతాయి అంటూ రాతలు రాశారు.
  • చంద్రబాబుకు అనుకూలంగా, జగన్‌ గారికి వ్యతిరేకంగా ఇలాంటి వార్తలు రాసి ఈ వయసులో కూడా ఒక రామోజీరావు వికృతమైన ఆనందాన్ని, శునకానందాన్ని పొందుతున్నాడు.

చంద్రబాబు ఏమైనా మట్టిలో పొర్లాడాడా? బురద రాసుకున్నాడా?:

  • తుపాను బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు మట్టిలో పొర్లాడాలా..?
  • చంద్రబాబు ఏమైనా మట్టిలో పొర్లాడాడా..? బురద రాసుకున్నాడా?
  • తుపాను సమయంలో అక్కడే ముఖ్యమంత్రి కూర్చుంటే పనులు జరగవు. సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగవు..
  • 24 గంటలు అక్కడే కూర్చుని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఫోటోలు వేయించుకుని షో వర్కులు చేయడం జగన్‌ గారికి కుదరదు.
  • మొన్నటి వరకూ ఇలాంటి ప్రచారంతో చంద్రబాబును పైకెత్తడాన్ని ప్రజలు గమనించారు కాబట్టే మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఓడించారు.

చంద్రబాబు కంటే ఎక్కువ పరిహారం ఇస్తున్నాం:

  • రైతులు బాధలు జగన్మోహన్‌ రెడ్డి గారికి పట్టవా..? అంటూ రాతలు రాశారు. జగన్‌ గారు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు.
  • చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు...అప్పుడు కూడా తుపానులు వచ్చాయి..అప్పుడు మీరెంత ఇచ్చారు చంద్రబాబూ..?
  • మేం గుండెమీద చేయి వేసుకుని చెప్తున్నాం..చంద్రబాబు కంటే జగన్‌ గారు ఎక్కువ పరిహారం ఇస్తున్నారని మేం సవాల్‌ చేసి చెప్తున్నాం.
  • మేం ఇప్పుడు హెక్టారుకు రూ.15 వేలు ఇస్తున్నాం..అరటికైతే హెక్టారుకు రూ. 25 వేలు ఇస్తున్నాం.
  • మీ సమయంలో ఇంత ఇచ్చారా? నువ్వు చూపించే జీవో కాదు..మేం ఈ మధ్యనే జీవో ఇచ్చి పరిహారం పెంచాం.
  • రైతులకు జరిగిన నష్టాన్ని ఒక్క సారిగా పూడ్చలేం. చన్నీళ్లకు వేన్నీళ్లుగా ఉదారంగా జగన్‌ గారు సాయం అందిస్తున్నారు.
  • జగన్‌ గారు రైతు బాధలు పట్టించుకోని అసమర్ధ సీఎం అంటూ విషపు రాతలు రాస్తున్నారు.
  • అసలు వ్యవసాయమే దండుగ అన్న పెద్దమనిషి చంద్రబాబు మాత్రం సమర్ధ సీఎం అట.
  • ఐటీనే ప్రధానమని భావించిన చంద్రబాబు గురించి డప్పాలు కొట్టే రాతలు రాస్తున్నారు.
  • ఏ పంటకు నష్టం జరిగినా ఆ నష్టాన్ని పూడ్చాలని తాపత్రయం పడుతున్న వ్యక్తి జగన్‌ గారు.
  • అలాంటి వ్యక్తి రైతు బాధలు పట్టవంటూ, అసమర్ధ సీఎం అంటూ రాసి శునకానందం పొందుతున్నారు.

ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టింది చంద్రబాబా..? వైఎస్సారా..?:

  • ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టిందెవరో రామోజీ సమాధానం చెప్పాలి.
  • ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టింది చంద్రబాబా..?
  • వాటికి అంకురార్పణ చేసి పూర్తి చేసింది ఒక్క డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారే.
  • గుండ్లకమ్మను శరవేగంగా పూర్తి చేసి వైఎస్సార్‌ గారే కాల్వలకు నీరిచ్చారు.
  • పులిచింతలను కూడా ఆయనే నిర్మిస్తే..ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది.
  • జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలని ఆయన తపన పడ్డారు.
  • నేడు వాటిని పూర్తి చేసేందుకు నడుంకట్టిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ గారు.
  • నెల్లూరులో రెండు బ్యారేజీలను కూడా డాక్టర్‌ వైఎస్సార్‌ శంకుస్థాపన చేస్తే జగన్‌ గారు ప్రారంభించారు.
  • అవుకు రెండో టన్నెల్‌ను కూడా పూర్తి చేసి ఇటీవలే నీటిని విడుదల చేసింది జగన్‌ గారే.
  • వెలిగొండ రెండో టన్నెల్‌ను కూడా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి జగన్‌ గారు.
  • శంకుస్థాపనలు చేసింది వైఎస్సార్‌ గారు..వాటిని పూర్తి చేస్తోంది జగన్‌ గారు.

చంద్రబాబు అవినీతి వల్లే గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది:

  • గుండ్లకమ్మలో గేటు కొట్టుకుపోవడం జగన్‌ గారి అసమర్థతా..? ఇంతకు ముందు కూడా గేటు కొట్టుకుపోయింది.
  • ఇది కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబే. ఖచ్చితంగా తెలుగుదేశం అలసత్వం వల్లే గుండ్లకమ్మకు నష్టం జరిగింది.
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014–19లో డ్యాం సేఫ్టీ రివ్యూ పానెల్‌ ఒక నివేదిక ఇచ్చింది.
  • గుండ్లకమ్మ గేట్లు తుప్పుపట్టిపోతున్నాయి..గడ్డర్లు తుప్పు పట్టిపోతున్నాయి..రిపేరు చేయండి అని నివేదికలో స్పష్టం చేశారు.
  • దానికి టీడీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేశారు..కేవలం రంగులేసి, బ్యూటిఫికేషన్‌ చేసి తెలుగు తల్లి విగ్రహం పెట్టారు.
  • ఈజీగా డబ్బులు చేసుకోడానికి వీలున్న పనులు చేశారు కానీ గేట్ల పనులు మాత్రం చేయలేదు.
  • ఆనాడు దుర్వినియోగం అయిన ఆ ఐదు కోట్లు గేట్లకు పెట్టి ఉంటే ఈ రోజు ఈ ప్రమాదం జరిగేది కాదు.
  • జగన్‌ గారు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి ప్రత్యేకంగా రూ.9.14 కోట్ల నిధులు కేటాయించి టెండర్లు పిలిచారు.
  • గేటు కొట్టుకుపోవడానికి మరుసటి రోజే టెండర్లు ఖరారు అయ్యాయి.
  • అంతకు ముందు కూడా ఒక గేటు కొట్టుకుపోతే వెంటనే దాన్ని బాగుచేశాం.
  • ఇప్పుడు స్టాప్‌ లాక్‌ గేట్‌ను యుద్ధప్రాతిపదిక పెట్టి వాటర్‌ వృథా కాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం.
  • కచ్చితంగా టీడీపీ ఫెయిల్యూర్‌ దీనిలో ఉందని ప్రజలంతా గమనించాలి.
  • అప్పుడు కేటాయించిన నిధులను కాంట్రాక్టర్లు మింగేయడం జరిగింది.

ఆ నిజాన్ని ఈనాడు ఒప్పుకున్నారు:

  • కొత్త డయాఫ్రం వాల్‌ గురించి కూడా ఒక వార్త రాశారు.
  • ఆ డయాఫ్రం వాల్‌ ఎందుకు కొట్టుకుపోయిందో, టీడీపీ వారు చేసిన నిర్వాకం ఏంటనేది చెప్తూనే ఉన్నాం.
  • ఈ రోజు ఈనాడు వారు కూడా 2020లో కాఫర్‌ డ్యాంపై అతి వేగంగా నీరు ప్రవహించడం వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న విషయాన్ని ఒప్పుకున్నారు.
  • ఇదే నిజం...అన్యమనస్కంగానైనా ఈనాడు ఈ తప్పును ఒప్పుకుంది. దాన్ని కూడా ప్రజలు, నిపుణులు గమనించాలి.

వారికి ఆంధ్రరాష్ట్రంతో సంబంధమే లేదు:

  • తుపాను రాగానే చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటి వరకూ గుళ్లూ గోపురాలు తిరుగుతున్నాడు.
  • లోకేశ్, పవన్‌ కల్యాణ్, చంద్రబాబులకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు.
  • వీళ్లు ఏపీలో పోటీ చేస్తారు కానీ...ఇళ్లు మాత్రం ఇక్కడ లేవు. వీళ్లకి ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయో లేవో తెలియదు.
  • ఇక్కడ దూషిస్తారు...విమానంలో హైదరాబాద్‌ వెళ్లిపోతారు.
  • అప్పుడప్పుడు గెస్ట్‌లా వచ్చి రాజకీయం చేస్తారు..ఇదీ ఈ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితి.
  • ఈ రెండు పార్టీలు అక్కడ కూడా ఉన్నాయి. టీడీపీ అంతకు ముందు కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేసింది.
  • మొన్న మాత్రం కాంగ్రెస్‌కి సపోర్ట్‌ చేయలేదు అంటున్నాడు. అందుకే కాంగ్రెస్‌ గెలిచినట్లుంది.
  • చంద్రబాబును నువ్వెవరికి మద్దతు పలికావు అని అడిగితే గోడమీద పిల్లిలా ఉన్నాను అంటున్నాడు.
  • కానీ వారి జెండా మాత్రం ఎవరికి కావాల్సిన చోట వారికి అనుగుణంగా ఎగురుతోంది.
  • గాంధీభవన్‌లో కొందరు తిరుగుతున్నారు..కూకట్‌పల్లిలో జనసేన వాళ్ల చేతిలో వాళ్ల జెండా తిరుగుతోంది.
  • చంద్రబాబు చేతిలో పచ్చ జెండా లేదు. ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తున్నాడు.
  • ఏది గెలిస్తే వారితో శెభాష్‌ అనిపించుకుందాం అని చంద్రబాబు గోడమీద పిల్లిలా ఉన్నాడు.
  • కానీ ఈయన ఎక్కడైతే జెండాలు పట్టుకుని తిరగాడో అక్కడ కాంగ్రెస్‌ భూస్థాపితం అయ్యింది.

బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు..ఇక్కడొచ్చి డప్పాలు కొడుతున్నాడు:

  • ఇక పవన్‌ కల్యాణ్‌ 8 చోట్ల పోటీ చేశాడు. టీడీపీ తనకు రహస్యంగానైనా మద్దతు పలుకుతుంది అనుకున్నాడు.
  • పాపం ఒక్క చోట కూడా డిపాజిట్‌ రాలేదు. కూకట్‌పల్లిలో మాత్రం కాస్త ఓట్లు వచ్చాయి.
  • మిగతా చోట్ల బర్రెలక్కకు వచ్చిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు.
  • అలాంటి ఈ నాయకులు ఇక్కడికి వచ్చి డప్పాలు కొట్టుకుంటున్నారు.
  • తనను చూడ్డానికి వస్తున్నారు కానీ ఓట్లు వేయలేదని పవన్‌ కల్యాణ్‌ గతంలో అన్నాడు.
  • వాస్తవాలను కాస్త లేటుగానైనా పవన్‌ గమనిస్తున్నాడు.
  • ఇంకో మూడు వాస్తవాలను కూడా పవన్‌ గమనించాలని కోరుతున్నాను.
  • అందులో మొదటిది చంద్రబాబు..జనసేనకు ముష్టి వేసినట్లు సీట్లు వేస్తాడని గుర్తుపెట్టుకోండి.
  • రెండోది...ఆ ఇచ్చిన ముష్టిలో నీకు అభ్యర్థులు లేకపోతే పరకాయ ప్రవేశం చేసినట్లు టీడీపీ వారినే నిలబెడతాడు.
  • మూడో అంశం ఏంటంటే..నీకు ఇచ్చిన సీట్లలో తుక్కుతుక్కుగా నిన్ను ఓడిస్తాడు.
  • అదీ చంద్రబాబు నైజం..ఈ మూడు వాస్తవాలు గమనిస్తే నీకు ముందుగానే జ్ఞానోదయం అవుతుంది.
  • గమనించకపోతే ఈ మూడు ఆచరణ రూపంలోకి వచ్చాకైనా నీకు జ్ఞానోదయం అవుతుంది.

రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ టీడీపీ, జనసేన:

  • ఈ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ఉల్లిపాయ సమస్య కాదు..బంగాళాదుంప సమస్య కాదు.
  • రాయలసీమలో ఉర్లగడ్డ అంటారు..ఎర్రగడ్డ అంటారు..అవేమీ సమస్యలు కావు.
  • సమస్యలల్లా క్యాన్సర్‌ గడ్డలు ప్రమాదకరమైన సమస్యలు.
  • ఈ రాష్ట్రంలో ప్రధానమైన క్యాన్సర్‌ గడ్డ తెలుగుదేశం క్యాన్సర్‌ గడ్డ.
  • దాని పక్కనే చేరుతున్న జనసేన క్యాన్సర్‌ గడ్డ కూడా చాలా ప్రమాదమైందని ప్రజలు గమనించాలి.

ప్రశ్నలు–సమాధానాలు అసలు టీడీపీ, జనసేన పొత్తుకు పవిత్రత ఉందా?:

  • జగన్‌ గారికి అహంకారం ఉందని ఎస్టాబ్లిష్‌ చేయాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నాడు.
  • చంద్రబాబుకు ఉన్నటువంటి అహంకారం వల్లనే మొన్న ఆయన ఓడిపోయాడు.
  • తెలంగాణలో ప్రభుత్వం పదేళ్ల తర్వాత దిగిపోయింది కాబట్టి ఇది కూడా దిగిపోద్దనే చచ్చు వాదనలు చేస్తున్నారు.
  • మా పార్టీ అక్కడ లేదు. అక్కడ మేం ఎవరికీ సపోర్ట్‌ చేయడం లేదు.
  • చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చినా నూటికి నూరు పాళ్లు జగన్‌గారు సీఎం అవుతారు.
  • టీడీపీ, జనసేన పొత్తుకు పవిత్రత ఉందో లేదో వారు సమాధానం చెప్పాలి.
  • అక్కడ లేని పొత్తు..ఇక్కడెందుకు ఉందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్లకుంది.
  • అక్కడేమో పవన్‌ బీజేపీకి చేస్తారు..చంద్రబాబు అన్ని పార్టీలకు రహస్యంగా చేస్తాడు.
  • ఇక్కడ మాత్రం కలిసి మా మీద పోటీ చేస్తాననడానికి కారణం ఏంటో ప్రజలకు చెప్పాలి.
  • మా ఇష్టం వచ్చినచోట పోటీ చేస్తాం..మాకు ఎవరు డబ్బులిస్తే వారికి కాల్‌ షీట్‌ ఇస్తామంటే కుదరదు.
  • అక్కడేమో బీజేపీకి కాల్‌షీట్‌ ఇస్తాడు...ఇక్కడేమో టీడీపీకి కాల్‌షీట్‌ ఇస్తాడు.
  • రాజకీయాల్లో భాగస్వామ్యం వేరు..సినిమాల్లో కాల్‌షీట్లు ఇవ్వడం వేరు.
  • ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోలేకపోతున్నాడు.
  • తెలుగు సినీ రంగంలో రోజు రూ.2 కోట్లు పారితోషకం తీసుకుంటాను అంటున్న పవన్‌ ఎవరన్నా రూ.3 కోట్లు ఇస్తే వారికి కాల్‌షీట్‌ ఇస్తాడు.
  • అందుకే వారిది అపవిత్ర కలయిక..దాన్ని ప్రజలు తిరస్కరిస్తారు.
  • తెలుగుదేశం, పవన్‌ కల్యాణ్‌ కలిస్తే వారికే తీవ్ర నష్టం..
  • వారి కలయికకు కారణం చెప్పలేదు కాబట్టి...వారిది పవిత్రత లేని కలయికే.
  • అయినా వీళ్లది పాత కాపురమేగా...2014లో ఆ మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి.
  • ఆ తర్వాత చెడింది...మోడీని చంద్రబాబు దూషించాడు. చంద్రబాబును మోడీ దూషించారు.
  • పవన్‌ కల్యాణ్‌..చంద్రబాబును దూషించలేదా? చంద్రబాబు..పవన్‌ను దూషించలేదా?
  • కలహాల కాపురం ఫెయిల్‌ అయింది...మళ్లీ కలిసి వస్తామంటే ఏపీ ప్రజలేమన్నా పిచ్చోళ్లా..?
  • ఇది కొత్త ఫార్ములా కాదు..ఫెయిలైన ఫార్ములా..
  • ఈ ఫెయిలైన ఫార్ములాతో ఎంత మంది కలిసొచ్చినా జగన్‌ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
Back to Top