కొప్పర్తిలో సీఎం వైయ‌స్ జగన్ ప‌ర్య‌ట‌న‌

ఆల్‌ డిక్సన్‌ యూనిట్ ప్రారంభించిన ముఖ్య‌మంత్రి

వైయ‌స్ఆర్ జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా కొప్పర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. వైయ‌స్ఆర్‌ ఈఎంసీ క్లస్టర్‌లో ఆల్‌ డిక్సన్‌ యూనిట్‌తోపాటు పలు పారిశ్రామిక యూనిట్లను సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. ఆల్ డిక్సన్ సి.పి ప్లస్ యూనిట్ లో 2 నుంచి 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. చైనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మూడవ అతిపెద్ద యూనిట్ కొప్పర్తిలో ఏర్పాటు కానుంది. సీఎం వెంట సీఎస్‌ జవహర్‌ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి ఉన్నారు. 

కాగా, కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను  సీఎం వైయ‌స్ జగన్‌ ప్రారంభించారు.


 

తాజా వీడియోలు

Back to Top