16న వైయస్‌ఆర్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ

హైదరాబాద్‌:ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పార్టీ తరపున ప్రాతినిథ్యం వహించే కౌంటింగ్‌ ఏజెంట్లకు వైయస్‌ఆర్‌సీపీ ఒక రోజు శిక్షణ శిబిరాన్ని 16వ తేదీన విజయవాడలో నిర్వహించనుంది.  ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అంశాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరుకూ బందర్‌రోడ్డులోని డీవీమేనర్‌ హోటల్‌ ఎదురులైన్‌ని ‘ఏ1’ కన్వెన్షన్‌ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. లోక్‌సభ, శాసన సభ నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ కౌంటింగ్‌ ఏజెంట్లను తీసుకుని తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి,జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆయా జిల్లాలకు సర్క్యులర్‌ జారీ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top