కోవిడ్‌-19 హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన సీఎం

తాడేపల్లి: కోవిడ్-19పై పూర్తి సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ ద్వారా కోవిడ్-19 సమాచారాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రారంభించారు. వాట్స్‌ఆప్‌లో 8297104104 నంబర్ ద్వారా, ఫేస్‌బుక్‌లో ఆరోగ్య ఆంధ్ర మెసింజర్ ద్వారా కోవిడ్‌-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. వధంతులకు తావు లేకుండా కచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసింది. 
 

Back to Top