చంద్ర‌బాబుకు హోంగార్డుల ఉసురు త‌గులుతుంది

ఎల‌క్ష‌న్ డ్యూటి చేసిన హోంగార్డుల‌కు 9వేలు డీఏ చెల్లించాలి

ట్విట్ట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో 65 రోజులు ఎర్రని ఎండలో డ్యూటీ చేసిన హోంగార్డులకు తొమ్మిదివేల చొప్పున డీఏ చెల్లించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి  ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  12 వేల మంది ఉద్యోగులకు కేవ లంరూ.4500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని  మండిపడ్డారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రూ.400 కోట్లు వెదజల్లి ఖజానా ఖాళీ చేసిన చంద్రబాబుకు హోంగార్డుల కుటుంబాల ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నిటినీ వెంటనే నిలిపివేయాలని అన్నారు. రాయపాటి సంస్థలకు అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే చంద్రబాబు కేబినేట్‌ సమావేశమంటూ హడావిడి చేస్తున్నారని  ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులపై ఆడిటింగ్‌ జరిపిన తర్వాతే పేమెంట్స్‌ చేయాలని స్పష్టం చేశారు.

శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

 సైన్స్‌ టీచర్‌ సుధారాణి మృతికి కారణమైన శ్రీ చైతన్య యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాలేని స్థితిలో ఉన్నా.. శిక్షణ పేరుతో ఆమెను అనంతపురం నుంచి కర్నూలుకు పిలిపించారని, నిండు గర్భిణి దూర ప్రయాణం చేయడం వల్ల తీవ్ర రక్త స్రావమై ఆమె మరణించిందని వివరించారు. సుధారాణి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top