చంద్రబాబూ..హుందాగా వ్యవహరించు..!

గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహించేలా చంద్రబాబు ఆడియో

పదవి కోసం దేనికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు

టీడీపీ నీచరాజకీయాలు ప్రజలందరికి తెలుసు

ఓడితామని తెలిసే ఈవీఎంలపైకి నెపం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు విడుదల చేసిన ఆడియో  గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక సీఎం హోదాలో ఉండి సత్తార్‌ మార్కెట్,మట్కాలపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన ఇటువంటి వ్యక్తి ఉంటే భవిష్యత్‌పై ఆందోళన కలుగుతుందన్నారు.40 ఏళ్ల అనుభవం ఏమయ్యిందని ప్రశ్నించారు. పదవికాంక్ష, పార్టీలో అధ్యక్ష పదవిని కాపాడుకోవడానికి దేనికైనా దిగజారడానికి  సిద్ధమని చంద్రబాబు ఒక మెసెజ్‌ ఇచ్చారన్నారు.చీకటికోణంలో ఉన్న వాళ్లు తమకు సహకారం అందిస్తున్నారని,మాఫీయా మా వెనుక ఉందనే సందేశం చంద్రబాబు ఇచ్చారని.. ఎందుకు చంద్రబాబుపైన కేసు పెట్టకూడదని ప్రశ్నించారు.ఈసీ ఆలోచన చేయాలన్నారు.చట్టానికి అందరికి సమానమే అన్నారు చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టినప్పుడు నుంచి చీకటిలో ఉండేవాళ్లు ఆయనకు మద్దతు ఇస్తారని అందరికి తెలుసు.ప్రజలకు మాత్రం చంద్రబాబుకు మద్దతు ఇవ్వరని తెలిపారు.

వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు బాగా తెలుసునని మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబును దుర్మార్గపు ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ప్రజలపై చంద్రబాబుకు నమ్మకం లేదని.. తను ఓడిపోతానని తెలిపి గ్రౌండ్‌ పిపేర్‌ చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఒక బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చేయకూడని పనులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చట్టవిరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రజల ఓట్లపై చంద్రబాబుకు నమ్మకం ఉండదన్నారు. ప్రజలు తనకు ఓటు వేయలేదని తెలిసి కొత్తకొత్త పంథాలు సృష్టిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశంలో పార్టీలో ఒక ముసలం ఏర్పడిందని, పార్టీలో చంద్రబాబును భరించలేమని కొందరు తెలుగుదేశం నేతలు చెబుతున్నారన్నారు. తనను తను రక్షించుకోవడం  కోసం చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై  కక్ష  తీర్చుకోవడానికి కిక్రెట్‌ బెట్టింగ్‌ చేశారని చెప్పి నెల్లూరు ఎమ్మెల్యేను నానారకాలుగా  వేధించారని తెలిపారు. చేయని నేరానికి ఇరిక్కించాలని ప్రయత్నాలు చేశారన్నారు.సీఎస్‌ తన వాడు అయితే మంచివాడు..తన వాడు కానప్పుడు వేరే సీఎస్‌ వస్తే..అతడు పనికిరాడు..రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యనిస్తారని మండిపడ్డారు. గతంలో వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉనప్పుడు డీజీపీ  యాదవ్‌ను బదిలీ చేస్తే..చిరునవ్వుతో  హుందాగా వ్యవహరించిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని అన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే చంద్రబాబుకు ఎంతకంత బాధ అని ప్రశ్నించారు. ఎలక్షన్‌ పరిధిలో ఉన్న డీజీపీని అనేక ఫిర్యాదులు చేసిన బదిలీ చేయలేదు.వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు డీజీపీ ఠాకూర్‌ ఎలా ప్రవర్తించారో దేశమంతంట తెలుసునన్నారు.డీజీపీ టీడీపీకి కొమ్ము కాస్తున్నారని అనేక పర్యాయాలు వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసిందన్నారు.ఈసీ,వైయస్‌ఆర్‌సీపీ కుమ్మక్కుఅయ్యిందని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై రాద్దాంతం చేసే చంద్రబాబు..డీజీపీ ఠాకూర్‌ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.టీడీపీ ఓడిపోతుందని ఆరు నెలల క్రితమే పసిగట్టారని ఓడిపోతామనే ఈవీఎంలపై నెపం నెట్టారని తెలిపారు.సీఎస్‌పై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు. లోకల్‌బాడీ ఎలక్షన్‌లో టీడీపీ పార్టీ మిగలదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఓడిపోతామని తెలిసి దొంగసర్వేలు చేయించారన్నారు.చంద్రబాబు కుమారుడు లోకేష్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు.చంద్రబాబు ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top