తాడేపల్లి: ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై తణుకులో జరిగిన పార్టీ ప్రచార బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరసాపురం బిజేపి లోక్ సభ అభ్యర్ది శ్రీనివాసవర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తివిరుధ్దంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో కూడా చంద్రబాబునాయుడు సీఎం వైయస్ జగన్ గారిపై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఎన్నికల కమిషన్ కు అందించారు. పత్రికా విలువలకు పాతరేస్తూ ఈరోజు(11-04-24) ఈనాడు దినపత్రికలో ఓ జనహంతక చక్రవర్తి అనే శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ప్రచురించారు. ఇది ప్రతిపక్షాలకు మేలు చేసేదిలాగా తెలుగుదేశం పార్టీ కరపత్రంలాగా వార్తను వండి వార్చారని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.