వర్షమ్మ..మమ్మల్ని గర్వపడేలా చేశావు.. 

చిన్న కుమార్తె వర్ష స్నాతకోత్సవం 

 వైయ‌స్ జగన్‌ భావోద్వేగ ట్వీట్ 

అమరావతి: ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్‌ కాలేజ్‌ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఫైనాన్స్‌) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘వర్షమ్మకు అభినందనలు. 

అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ’ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కూతురును ఆశీర్వ‌దించారు.  ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌ చేశారు.  

Back to Top