వైయ‌స్ఆర్‌సీపీ తొమ్మిదో జాబితా విడుదల

ఒక పార్లమెంట్‌, రెండు అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జిల నియామకం

విజయసాయిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్‌

మంగళగిరి ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యకు బాధ్యతలు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంతియాజ్‌కు కర్నూల్‌ అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు

ఇప్పటిదాకా 9 జాబితాల్లో.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తల నియామకం/మార్పులు

సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటముల్నే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక

ఎన్నికల కోసం దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లేనని ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం వైయ‌స్ జగన్‌ 

 తాడేప‌ల్లి: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ  లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది. 
అలాగే.. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్‌(రిటైర్డ్‌ ఐఏఎస్‌), మంగళగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్‌ ఈ మధ్యే వీఆర్‌ఎస్‌ తీసుకుని వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

తాజాగా మంగళగిరిలో జరిగిన వైయ‌స్ఆర్‌సీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని..  ఒకటిరెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్‌ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు.

Back to Top