వర్షాకాలం నీరు నిలుస్తాయనే ఇంగిత జ్ఞానం లేదా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

నిర్మాణంలోని ఇళ్ల కాలనీల్లో నిలిచిన నీటిని భూతద్దంలో చూపిస్తున్న బాబుగారు! 

సొంతిల్లు ఉండాలనే జనం కోర్కెను జగనన్న కాలనీలు తీర్చుతున్నాయి

అమ‌రావ‌తి: కొత్త కాలనీలు లేదా లేఅవుట్లలో వర్షాకాలం నీరు నిలుస్తాయనే ఇంగిత జ్ఞానం 72 ఏళ్ల సీనియర్‌ పొలిటీషియన్‌ నేతృత్వంలోని పార్టీకి లేకపోవడం నిజంగా దురదృష్టకరమ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. పేదలందరికీ జగనన్న ఇళ్లు పథకం కింద అభివృద్ధి చేస్తున్న వైయ‌స్ఆర్‌ జగనన్న కాలనీలు తాజాగా తెలుగుదేశం అడ్డగోలు విమర్శలకు లక్ష్యంగా మారాయి. త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నవరత్నాల హామీల్లో ఒకటైన ఈ గృహనిర్మాణ కార్యక్రమం గత రెండేళ్లుగా చక్కగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ గృహాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. సొంతిల్లు ఉండాలనే జనం కోర్కెను జగనన్న కాలనీలు తీర్చుతున్నాయి.

కొత్తగా పట్టణాలను ఆనుకుని ఉన్న పొలాల్లో వేసిన లేఅవుట్లలో నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలకు అన్ని సౌకర్యాలు సమకూరడానికి సహజంగానే సమయం పడుతుంది. నిర్మాణంలో ఉన్న ఈ కాలనీల ఇళ్ల స్థలాల్లో, రోడ్లపై మొన్నటి వర్షాలకు నీరు నిలిచాయి. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పండగే పండగ. ‘చూడండి, అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న కాలనీల్లో నిలబడిన నీళ్లను,’ అంటూ రెండు ఫోటోలు పెట్టి దుష్ప్రచారం ప్రారంభించింది టీడీపీ. నిజమే, దశాబ్దాలుగా ఉంటున్న కాలనీలే భారీ వర్షాలకు నీటిమయం అయ్యే పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఈ సమస్య తాత్కాలికమని ప్రజలకు, ప్రభుత్వానికి తెలుసు. పల్లపు ప్రాంతాలు జలమయం కావడం అనేది హైదరాబాద్‌ నగరం నుంచి గ్రామాల వరకూ కొన్ని కాలాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే సమస్యే. అయితే, ఇంకా నిర్మాణం కూడా పూర్తి కాని నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని రెండు జగనన్న కాలనీల్లో ఇటీవల వర్షాలకు నీరు నిలిస్తే–అది తెలుగుదేశం పార్టీకి, మరీ ముఖ్యంగా ఈ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చాలా పెద్ద సమస్యగా కనిపిస్తోంది.

టీడీపీ ఎలాగూ తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం ఐదేళ్లు (2014–19) జనరంజకంగా పరిపాలించలేక చతికలపడింది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో చిత్తశుద్ధితో తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కొత్తగా ఊళ్లను ఆనుకుని ఉన్న పొలాల్లో లేఅవుట్లు వేయించి ఇళ్ల నిర్మాణానికి దోహదపడుతుంటే అందులో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంది టీడీపీ. కొత్త కాలనీలు లేదా లేఅవుట్లలో వర్షాకాలం నీరు నిలుస్తాయనే ఇంగిత జ్ఞానం 72 ఏళ్ల సీనియర్‌ పొలిటీషియన్‌ నేతృత్వంలోని పార్టీకి లేకపోవడం నిజంగా దురదృష్టకరం. అలాగే, ఇళ్ల లేఅవుట్లను సాగు నిలిపివేసిన భూముల్లో వేస్తారనేది కూడా జగమెరిగిన సత్యం. ఇంత తెలిసి కూడా టీడీపీ విమర్శలకు తెగడబడుతోంది. ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్‌ లో తాము అధికారంలోకి వస్తామని కలలుగంటున్న పార్టీకి చూపు మందగించింది. వానాకాలం తర్వాత– నిలిచిన నీళ్లయినా పోతున్నాయిగాని, తెలుగుదేశం నేతల దుష్ట ఆలోచనలు మాత్రం మాయం కావడం లేదు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top