తాడేపల్లి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇస్తుండగా మరోవైపు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నాయకుడు మిథున్‌రెడ్డిలు, పార్టీ ఎంపీలంతా తమ రెండు నెలల వేతనాన్ని సీఎం వైయస్ జగన్ సహాయ నిధికి అందజేశారు. ఇంకోవైపు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తన ఎంపీ నిధుల నుంచి రూ.4 కోట్లు సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇవాళ వైయస్ అవినాష్‌రెడ్డి కూడా రూ.2 కోట్ల నిధులను సీఎం సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. అదే బాటలో ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి కూడా తమ వేతనాలను సీఎం సహాయ నిధికి అందజేశారు. వీరితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు తమ వేతనాలను సీఎం సహాయ నిధికి ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తన సొంత నిధులతో ప్రజలకు శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌస్‌లు అందజేస్తున్నారు. మరి కొంత మంది ఎమ్మెల్యేలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరఫరా చేసి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కూడా తన వంతుగా రూ.1 లక్ష సీఎం సహాయ నిధికి అందజేశారు. ఎక్కడిక్కడ మంత్రులు స్పందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రజలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కూడా శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ నివారణకు ఎలాంటి అవసరాలు ఉన్నా.. వెంటనే తనకు తెలియజేస్తే అందుకు తగిన చర్యలు చేపడతానని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి రోజు ఉన్నతస్థాయి అధికారులు, మంత్రులతో సీఎం వైయస్ జగన్ సమీక్షలు నిర్వహిస్తూ కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కనిపించని పచ్చ నేతలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు విపత్కర పరిస్థితుల్లో దాక్కున్నారు. కరోనా ఎఫెక్ట్ సమయలో కూడా చంద్రబాబు రాజకీయాలకే పరిమితమయ్యారు. ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 50 లక్షల మంది చనిపోతారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అమరావతి తరలిపోతుందని తన బినామీల కోసం చంద్రబాబు ఫెయిడ్ ఆర్టిస్టులతో కృత్రిమ ఉద్యమం నడిపిన చంద్రబాబు..కరోనాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నడూ బయటకు రాని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణి అమరావతి ఉద్యమానికి తమ ప్లాట్లినమ్ గాజులు విరాళంగా ఇచ్చారు. ప్రజలు భయంతో వణికిపోతున్న కరోనా నివారణకు మాత్రం వీరికి దానం చేసేందుకు చేతులు రావడం లేదు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో హాయిగా కాలం వెల్లదీస్తున్న చంద్రబాబు అంతవరకే పరిమితం కాకుండా తన ఎల్లోమీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని జాతీయ మీడియా కోడై కూస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసల జల్లులు కురుస్తుంటే చంద్రబాబు వాలంటీర్ల సేవలను గుర్తించడం లేదు. ప్రతిపక్ష నేత విపత్కర పరిస్థితుల్లో అనుసరిస్తున్న తీరుపై ప్రజలు ఛీకొడుతున్నారు.