వైయస్ జగన్ కు 'శతమానం భవతి' అంటున్న అర్చకులు

 అర్చకుల వంశపారంపర్య హక్కును అమలు చేసేలా జీవో 439 జారీ చేసారు ఏపీ సీఎం వైయస్ జగన్. ఈ నిర్ణయంతో పాదయాత్ర సందర్భంలో పూజారులకు నాడు ఆయనిచ్చిన హామీ నెరవేరినట్టైంది. 
బ్రాహ్మణ ద్వేషిగా టీడీపీ
ఎన్టీఆర్ హయాంలో1987లో వంశపారంపర్య అర్చకత్వాన్ని, మిరాసీ హక్కుల్నీ రద్దు చేసారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కారణంగా చూపారు. మిరాసి వ్యవస్థ మీద చల్లా కొండయ్య కమీషన్ వేసి, చివరికి వారికి అనుగుణమైన నివేదికను ముందస్తుగా తయారు చేయించుకున్నారు. రాష్ట్రంలో 30,000 కు పైగా దేవాలయాలున్నాయి. వాటన్నిటికీ తిరుమల ఆలయంలా కోట్లలో ఆదాయాలు లేవు. తిరుమల సాకుగా చూపిస్తూ అర్చక వ్యవస్థను రద్దు చేసేసారు. దీనిపై అప్పట్లో అర్చకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాడారు. 2004 వరకూ వారి పోరాటాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. చివరకు వైయస్స్ రాజశేఖర్ రెడ్డి తన ఎన్నికల హామీల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేపట్టిన ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే 2007లో 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చారు. దాని ప్రకారం వంశపారంపర్య అర్చకత్వం అర్చకులకు ఇవ్వడమే కాక, వాళ్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పావలా వడ్డీకి రుణాలు అందించాలని, అర్చక శ్రేయోనిధి ఏర్పాటు చేయాలనే సంక్షేమ అంశాలనూ చేర్చారు. కానీ 10 ఏళ్లుగా ఇది అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వ హయాంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ లబ్దికి వాడుకున్నారు. అర్చకులను తొలగించారు. రాష్ట్రంలో దేవాలయాలను కూల్చేసారు. హిందువుల మనోభావాలను ఎన్నోసార్లు అవమానించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు సైతం ఇలాంటి హిందూ వ్యతిరేక విధానాలనే అనుసరించాడు. ఇన్నాళ్లకు మళ్లీ మంచిరోజులొచ్చాయి.  మళ్లీ ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే  అర్చకులకు వంశపారంపర్యహక్కును కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. 
హిందూత్వ సంక్షేమానికి వైయస్ జగన్ నిర్ణయాలు
బాబు హయాంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మించేందుకు యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూనుకుంటున్నారు. 
అర్చకులకు వేతనాలను పెంచారు. 
చిన్న ఆలయాల దీప, ధూప, నైవేద్యాలకు నిధులు ఏర్పాటు చేసారు. 
తిరుమల తిరుపతి ఆలయంలో అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగుల ఏరివేతకు చట్టం తెచ్చారు. 
తిరుపతిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 
తిరుమల కొండపై అతి తక్కువ ఖరీదుకే ఫలహారం, భోజనాలు విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. 
సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. 
ప్రత్యేక దర్శనాలను రద్దు చేసారు. 
శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు వినియోగించాలని నిర్ణయించారు. దీనిద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేయనున్నారు. 
హిందూత్వ పరిరక్షణకు, హిందూ ఆలయాల ఉద్ధరణకు, అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి 'శతమానం భవితి' అని ఆశీర్వచనాలు అందిస్తూ మూడు రోజులు ప్రత్యేక పూజలు జరిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య. 

Read Also: చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top