తాడేపల్లి: వాడుకోవడం.. వదిలేయడం చంద్రబాబు నైజం. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. సొంత తమ్ముడి దగ్గరి నుంచి.. పిల్లనిచ్చిన మామ వరకు. సొంత బావమరిది దగ్గరి నుంచి.. వాళ్ల కొడుకుల వరకు..పార్టీ నాయకుల దగ్గరి నుంచి నమ్ముకున్న వాళ్ల వరకు..ఇలా అందరికీ వెన్నుపోటు పొడిచిన విషయం టీడీపీ నాయకులకు తెలియదా? ప్రజలకు తెలియదా?. అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టింది. చంద్రబాబు నాయుడి చేతిలో వెన్నుపోటుకు గురైన బాధితుల లిస్టు ఒకసారి చూస్తే... 1- సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడికి టిక్కెట్ రానీవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అతన్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఇంటికే పరిమితం చేశాడు. 2- పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని తన చావుకు కారకుడయ్యాడు. 3- నందమూరి లక్ష్మీపార్వతిని ఇంట్లోనుంచి బయటకు నెట్టేశాడు 4- చంద్రబాబు తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చెప్పిన బాబు సీఎం కాగానే ఆయనకు మొండిచేయి చూపించి వెన్నుపోటు పొడిచాడు. 5- ఎన్టీఆర్ కుటుంబం నుంచి నందమూరి హరికృష్ణ తనకు పోటీ వచ్చే అవకాశం ఉందని హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి తర్వాత తన విశ్వరూపం చూపించి పార్టీ నుంచే వెల్లగొట్టాడు. 6- ఆ తర్వాత జూ.ఎన్టీఆర్‌ను, తారకరత్నను కూడా చంద్రబాబు అవసరానికి వాడుకుని వాళ్లకు కూడా వెన్నుపోటు పొడిచాడు. జూ.ఎన్టీఆర్ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉంటే.. కనీసం పరామర్శించలేదు. 7- మొదటి నుంచి పార్టీని నమ్ముకుని చంద్రబాబు వెంటే నడిచిన బొజ్జల గోపాల్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాడు. అలాగే దాడి వీరభద్రరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దు కృష్ణమనాయుడు వంటి నేతలకు తన ప్రభుత్వంలో ఎప్పుడూ మంత్రి పదవి ఇవ్వలేదు. 8- వంగవీటి మోహన రంగా, పింగళి దశరథ రామ్ వంటి వారిని చంద్రబాబు చంపించారనే ఆరోపణలు ఉన్నాయి. 9- హెరిటేజ్ సంస్థను నటుడు మోహన్ బాబు దగ్గరి నుంచి లాక్కొని తనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు చరిత్ర చానా ఉంది..