అణగారిన వర్గాల అండాదండా జగనన్న 

కావలి నియోజకవర్గంలో జైత్రయాత్రలా సామాజిక సాధికారయాత్ర 

 దశాభ్దాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు,బలహీనవర్గాలను ఆదుకునే మనస్సున్న మారాజు జగనన్న-మంత్రి సీదిరి అప్పలరాజు 

 బీసీల సాధికారత,హక్కుల కోసం ఢిల్లీ దాకా నినదించేలా చేశారు సీఎం జగన్-ఎంపీ బీదమస్తాన్ రావు 

కావలి: కావలి నియోజకవర్గంలో సామాజిక సాధికారయాత్ర జైత్రయాత్రలా సాగింది. యాత్రకు వేలాదిగా ప్రజలు కదిలివచ్చారు. మధ్యాహ్నం ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో వివిధ రంగాల నిపుణులతో వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బీదమస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ పోతుల సునీత,  వైయస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నేతలు ఏమన్నారంటే.....

మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ...

– సామాజిక సాధికారయాత్ర.. రెండువారాల నుంచి రాష్ట్రంలో మార్మోగిపోతున్న నినాదం. సాధికార సభలకు జనం పోటెత్తుతున్నారు.
–సామాజిక అసమానతలతో బడుగు బలహీన వర్గాలు ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టనష్టాలు చూశారు. ఆధిపత్యకులాల కింద అణగారిపోతున్న వర్గాలను ఆదుకునే మనసున్న మారాజు లేని రోజులవి. 
– అదృష్టవశాత్తూ ఈనాడు మనకు ఓ మంచి నాయకుడు వచ్చాడు.
– గతంలో బాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు మెల్లమెల్లగా కుదేలైపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రులు క్షీణించిపోయాయి. ఆ పాలనలో అన్నీ దరిద్రాలే. 
– మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలకు అవసరమైనవన్నీ తీసేస్తూ...కార్పొరేట్లకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. పేదవాడిని –పేదవాడిగా చూసిన బాబు హయాంలో, వెనుకబడిన వర్గాలకు జరిగిన మంచి అంటూ ఏమీ లేదు. 
–ఈనాడు పరిస్థితులు ఎంతో మంచిగా మారిపోయాయి. మన పిల్లలు దర్జాగా చదువుకుంటున్నారు. పెద్ద చదువులే బీద కుటుంబాల తలరాతలు మారుస్తాయని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారు. 
–ఆరోగ్యరంగంలో ఎన్నెన్నో గొప్ప పనులు చేసి చూపారు. 17 కొత్తమెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదే.
–పేదలకు సంబంధించిన రేషన్‌కార్డు, ఇళ్లు, పెన్షన్లు కావాలంటే ...నాడు జన్మభూమి కమిటీల దయ మీద ఆధారపడాల్సివచ్చేది. 
–కానీ జగనన్న పాలనలో పేదల ముంగిళ్లకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. పేదవాళ్లు ఈరోజు తమ కాళ్లమీద తాము నిలబడగలుగుతున్నారంటే..అది జగనన్న సామాజిక సాధికారత ఫలితమే.  
–గతంలో మత్స్యకారుల్ని అవమానించి పంపినవారు చంద్రబాబు. మరి ఈనాడు జగన్‌మోహన్‌రెడ్డి ఆ మత్స్యకార సోదరుల్లో ఒకరిని రాజ్యసభకు పంపారు. మరొకరిని పక్కన కూర్చోపెట్టుకుంటున్నారు.
– సువిశాల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక హార్బర్‌గానీ, ఒక పోర్ట్‌గానీ  ప్రారంభించలేని చరిత్రహీనుడు చంద్రబాబు. 
–రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే ఆదాయవనరైన ఈ తీరప్రాంత సంపదను గుర్తించి, అభివృద్ధి చేస్తున్న సమర్థత జగన్‌మోహన్‌రెడ్డిది.
– ఒకనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఎవరైనా ఎస్సీ, ఎస్టీలలో పుట్టాలని కోరుకుంటారా? అని మాట్లాడిన చంద్రబాబు దుర్మార్గాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. 

ఎంపీ బీదమస్తాన్‌రావు మాట్లాడుతూ....

–జగనన్న ఆశీస్సులతోనే నేను ఎంపీనయ్యాను. 
–ఈరోజు భారతదేశంలోనే సామాజిక న్యాయానికి, సంక్షేమానికి రోల్‌మోడల్‌గా ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే.
– సామాజిక సాధికారత అవసరాన్ని గుర్తించి, ఆ దిశలో చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.  
– 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలున్నారంటే అది జగనన్న సామాజిక న్యాయానికి నిదర్శనం. 
– తనతో కలిపి 26మంది కేబినెట్‌లో ఉంటే అందులో 17మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలే ఉన్నారు. 
–బీసీల సాధికారత కోసం, హక్కుల కోసం ఢిల్లీ దాకా నినదించేలా చేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 
– కులగణన ద్వారా బీసీలకు న్యాయం చెయ్యాలని, మన ముఖ్యమంత్రి ఒక కమిషన్‌ వేసి, త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. దీనివల్ల బీసీలకు ఎంతో మేలు జరుగుతుంది. 

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ....

-ఒక్క జగనన్న ఫొటో పెట్టుకుని మాత్రమే వచ్చినా... వేలాదిగా తరలివచ్చిన కావలి ప్రజలు, జగనన్న స్థాయి ఏంటో చెప్పారు. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదల గుండెల్లో జగనన్న కొలువైవుండటం వల్లే ఈ జనసంద్రం కదిలి వచ్చిందనిపిస్తోంది.  
– ఈరోజు అణగారిన ప్రజలు, బీద బిక్కీ వారు తమ పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. మన ఇంటిదగ్గరే ఆ పనులు అయిపోతున్నాయి. గడప గడపచెంతకు ప్రభుత్వపాలన చేరింది.
– దేశంలోనే ఇలాంటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న మినహా మరొకరు లేరు. 
–పేదల విషయంలో వైయస్సార్‌ మనసే జగనన్న మనసు. తండ్రిలానే తనయుడు.  ఇద్దరిదీ ప్రజలతో విడదీయలేని బంధం.
– బీసీలు, ఎస్సీ నాయకులను అవమానించిన, మా మైనార్టీ పిల్లలను దేశద్రోహులని చెప్పి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పిన దుర్మార్గం చంద్రబాబుది అయితే మైనార్టీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలను కల్పించిన మంచితనం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిది.
 

Back to Top