ప్రజల మేనిఫెస్టో...పచ్చ మేనిఫెస్టో

వైయస్ఆర్ సీపీది ప్రజల మేనిఫెస్టో

టీడీపీది మ్యానిఫులేషన్‌ చిట్టా

వైయస్ జగన్ తన దార్శనికతను పట్టిచూపారు. గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు

 

మ్యానిఫెస్టో అంటే పేజీల కొద్దీ వుంటేనే సరిపోతుందా? అది మ్యానిఫులేషన్‌ చిట్టాగా వుంటే మోసం కాదా? ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి. అప్పుడే మళ్లీ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఓట్లడగడానికి వెళ్లాలి. నా సిద్దాంతం అదే అంటూ వైఎస్‌ జగన్‌ తన మ్యానిఫెస్టోను ప్రకటించారు. శ్రద్దగా చదివి వినిపించారు. నాలుగుపేజీల్లోనే తన పథకాల్ని...తన దార్శనికతను పట్టిచూపారు. గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు. చంద్రబాబులా నోటికొచ్చినట్టు చెప్పేసి, చేతికొచ్చినట్టు రాసేసి... ఆ తర్వాత ఏమీ నెరవేర్చకుండా పోవడం...ప్రజలను అన్యాయం చేసినట్టేనని కూడా విమర్శించాడు.

ఇప్పటికే ప్రజల దగ్గరకు చేరిపోయిన సంక్షేమ పథకాల నవరత్నాలకు తోడుగా....పాదయాత్రలోనూ, తర్వాత తను తెలుసుకున్న ప్రజా సమస్యలకు సంబంధించి, పరిష్కారాలు చూపుతూ మరిన్ని హామీలు కూడా ఇచ్చాడు. వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు గన్న రైతురాజ్యానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో విద్యకు పెద్దచోటు కల్పిస్తూ, ఫీజురీయింబర్స్‌మెంటు, అమ్మఒడి పథకాలను ప్రకటించారు. ఇప్పుడు జగన్‌ మ్యానిఫెస్టో ప్రజల చెంతకు చేరింది. 

సంవత్సరం పైగా ఎండనకా, వాననకా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్‌ ...ప్రజల కష్టాల్ని దగ్గరుండి చూశాడు. ఆ కష్టాలకన్నీళ్లను చెరిపేసి, ప్రతి కుటుంబం సంతోషంతో చిరునవ్వులు చిందించాలన్న తాపత్రయంతోనే తన మ్యానిఫెస్టోను తీర్చిదిద్దాడు. ఆ దిశలో అలుపెరుగని రీతిలో శ్రమించేందుకు సిద్దమైపోయాడు. ఓ దార్శనికుడిలా వర్తమానాన్ని, భవిష్యత్‌తరాలను తీర్చిదిద్దేలా తన పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచాడు. 

బుద్ది పోనిచ్చుకున్నాడు కాదు బాబు....అవున్నిజం! తన మ్యానిఫెస్టోను ప్రకటించకముందే జగన్‌పై విమర్శలు గుప్పించాడు. తన సీనియారిటీ, తన పాలనా సామర్ధ్యం అంతా ఇంతా కాదని గొప్పలకు పోయాడు. సంపద సృష్టి తనకే తెలుసన్నాడు. తను తెచ్చిన అప్పుల లెక్కలు మాత్రం చెప్పలేదు. జగన్‌ వస్తే రౌడీరాజ్యం వచ్చినట్టని...భూములు, ఇళ్లు అన్నీ హాంఫట్‌ అనే ఏదేదో...తన ఎదురుగా వున్న పదో, ఇరవై మంది ముందే చెప్పేసి, ఆ తర్వాత మళ్లీ హామీల చిట్టా విప్పారు. ఏంటో బాబు...2014 మ్యానిఫెస్టోకు తీసిపోకుండా...డూప్లికేట్‌ను తలపించేలా 2019 మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇంత చేశా...అంత చేశా..ఇంకెంతో చేశానని చెప్పుకున్నారు. లోకేష్‌ ముందో, తన వందిమాగధ సందోహం ముందో చెప్పుకోవాల్సిన మాటలు ప్రజలందరికీ వినిపించే ప్రయత్నం తీవ్రంగానే చేశారు. బాబు చెప్పిందేమిటో..చేసిందేమిటో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కరికి బతుకు భద్రతకు భరోసా లేకుండా చేసిన బాబు ఇప్పుడు...మీ భవిష్యత్తు–నా బాధ్యత అని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడకపోవడం సిగ్గుచేటు. ఆయన డొల్లపాలన గురించి, ఆయన పాలనలోని ఆకృత్యాలు గురించి ఏపీలోని ఏ వర్గం ప్రజలను కదిలించినా...వాయించేస్తారు. ఇది నిజం కాదా? బాబు అని నిలదీస్తారు. నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు తరహాలో, అధికారంలోకి రావడడమే పరమావధిగా ఎంతకయినా తెగించే చంద్రబాబుకు ...ఏప్రిల్‌ 11, 2019 గండమే! 

   
Back to Top