నా పిల్లలు ఇంత బాగా చదవుతున్నారంటే జ‌గ‌న‌న్నే కార‌ణం

పొదుపు మ‌హిళ రుబీనా బేగం
 

ఏలూరు: ఇవాళ‌ నా పిల్లలు ఇంత బాగా చదవుతున్నారంటే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే కారణమ‌ని పొదుపు మ‌హిళ రుబీనా బేగం అన్నారు. మూడవ ఏడాది వైయ‌స్ఆర్ ఆస‌రా కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడారు.  

జగనన్నా మీరు పాదయాత్రలో మా ఇబ్బందులు గమనించి మాట ఇచ్చారు, ఇప్పుడు మాకు మూడో విడత వైఎస్సార్‌ ఆసరా అందజేస్తున్నారు, ఈ పథకం కింద మా గ్రూప్‌ సభ్యులకు రూ. 2,95,321 వచ్చాయి, అందులో నాకు రూ. 27,400 వచ్చాయి, నేను టైలరింగ్‌ చేస్తుంటాను, ఈ డబ్బుతో కొత్తగా జిగ్‌జాగ్‌ మిషన్‌ తెచ్చుకున్నాను, గతంలో రూ. వంద వచ్చే ఆదాయం ఇప్పుడు రోజుకు రూ. 200 వరకు వస్తున్నాయి, ఈ పథకంలో లబ్ధిపొందిన మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా నిలదొక్కుకుంటున్నారు. ఇదంతా మీ దయ, నేను చదువుకోలేదు, నా తండ్రిని కోల్పోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను కానీ నా బిడ్డలు నాలా కాకూడదని వారికి మంచి చదువులు చెప్పిస్తున్నా, నా పిల్లలు ఇంత బాగా చదవుతున్నారంటే మీరే కారణం అన్నా, నా పెద్ద కొడుకు ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు, చిన్నకొడుకు గవర్నమెంట్‌ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్నాడు, తనకు మంచి భోజనం ఇస్తున్నారు, నా పిల్లల మేనమామలా మీరు అన్నీ చూసుకుంటున్నారు, నవరత్నాల పథకాలన్నీ లబ్ధిపొందుతున్నాం, ఒక చెల్లికి అన్నలా ఇంతకంటే ఏం చేస్తారు, మీరే నాకు అన్నయ్య, అందరికీ సూర్యుడు వెలుగునిస్తే మా మహిళలకు జగనన్న వెలుగునిస్తున్నారు, రంజాన్‌ మాసం సందర్భంగా నేను మీరు ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని దువా చేస్తాను అన్నా, మీరు చల్లగా ఉంటే రాష్ట్రమంతా చల్లగా ఉంటుంది, ధ్యాంక్యూ అన్నా.

ధ్యాంక్యూ జగనన్నా: కలపాల గంగా రత్నకుమారి, దొరమామిడి గ్రామం, పోలవరం నియోజకవర్గం

అన్నా నమస్కారం, అన్నా మీరు ఎంతోమంది పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం, మీ పాదయాత్రలో  మా మహిళల కష్టాలు చూసి చలించిపోయి మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. నాకు రెండు విడతలుగా ఆసరా సాయం అందింది, నాకు చేయూత సాయం కూడా అందింది, నేను ట్రాక్టర్‌ కొనుక్కున్నాను, మీరు మాకు స్వేచ్చనిచ్చారు మా కుటుంబ ఆదాయం పెరిగేలా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా వినియోగించుకున్నాం, నేను రూ. 10 వేలు ప్రతి నెలా సంపాదిస్తున్నాను, మీరు మా అందరి హృదయాలలో నిలిచిపోయారు, నా భర్తకు ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడింది, ప్రమాదం జరిగినప్పుడు పూర్తి చికిత్స పొందడమే కాక తిరిగి సాయం చేశారు, నేను స్త్రీ నిధి లోన్‌ కూడా తీసుకున్నాను, మా మహిళలు ఇంతలా ఎదగడానికి మీరే కారణం, ధ్యాంక్యూ జగనన్నా.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top