ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో..

నేడు ‘జగనన్న చేదోడు’ సాయం 

వరుసగా నాలుగో ఏడాది పథకం అమలు 

అర్హులైన లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున సాయం 

 3,25,020 మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలరింగ్‌లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు అమలు 

సీఎం వైయ‌స్ జగన్‌ చేతుల మీదుగా రూ.325.02 కోట్లు పంపిణీ 

ఎమ్మిగనూరు బహిరంగ సభలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ.. నేటి సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో ఈ పథకానికే రూ.1,252.52 కోట్లు 

అమరావతి: బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. సమాజానికి బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని నిండు మనసుతో నమ్మిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. దానిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తున్నారు కూడా. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు.

వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ గురువారం శ్రీకారం చుడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. 

ఇదీ పథకం 
♦ షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం 
♦ ఇప్ప‌టి వ‌ర‌కు అందించిన సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం. 
♦  ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం లబ్దిదారులకు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు 
♦  1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి 
♦ 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి 
♦ 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి 
♦ లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్‌ ప్లే చేసి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక. 
♦ ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్‌ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం... 
♦  అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్‌ నెలల్లో సాయం అందజేస్తున్న వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం. 

Back to Top