‘కోటి’ సాయంపై సర్వత్రా హర్షం

మృతుల కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారంపై అన్ని వర్గాల ప్రశంసలు

ఇప్పటి వరకూ ఎవరూ, ఎక్కడా ఇలా స్పందించిన చరిత్ర లేదు

బాధితులు, ప్రభావిత గ్రామాల ప్రజలకూ సాయంపై అభినందనలు 

 విశాఖ: విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన బాధితుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరు, ప్రకటించిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు తోంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, స్వల్ప అస్వస్థతతో రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరగానే ఉపశమనం పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించడాన్ని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి. అంతేగాక గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడాన్ని అందరూ కొనియాడుతున్నారు. ‘బాధితులు నయాపైసా కూడా వైద్య ఖర్చులు భరించాల్సిన పనిలేదు. డిశ్చార్జ్‌ అయి వెళ్లేప్పుడు ఈ నష్టపరిహారం కూడా ఇచ్చి పంపాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’ అని సీఎం జగన్‌ ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు, వామపక్షాలతో పాటు అందరూ అభినందిస్తున్నారు.

గంటల వ్యవధిలోనే..
► నష్టపరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వాలు రకరకాల ఆలోచనలతో జాప్యం చేయడం రివాజుగా వస్తోంది.
► ప్రయివేటు కర్మాగారాల్లో జరిగే ప్రమా దాల విషయంలో ఇది మరీ ఎక్కువ.
► సీఎం వైఎస్‌ జగన్‌ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే విశాఖపట్నం చేరుకుని బాధితులను పరామర్శించి, అక్కడే సమీక్ష నిర్వహించి నష్ట పరిహారాన్ని ప్రకటించారు. 
► ఎక్కడైనా ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే అధిక నష్ట పరిహారం ప్రకటించాలని ప్రతిపక్షాలు, వామపక్షాలు డిమాండ్‌ చేయడం రివాజు. 
► విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన బాధితుల విషయంలో అలాంటి డిమాండ్‌ ఏ ఒక్కరి నుంచీ రాకముందే ఊహించనంత భారీ నష్ట పరిహారాన్ని సీఎం  ప్రకటించారు.

ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా..
రాష్ట్రంలో, దేశంలో ఎన్నో భారీ విపత్తులు చూశాం. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ, ఏ ప్రధానమంత్రీ చేయని విధంగా బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిహారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.కోటి, చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లోని వారికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడం ఇంతవరకు ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు అద్భుతం. – విష్ణుకుమార్‌రాజు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే

ఉపశమనం కలిగిస్తుంది 
బాధితులకు సీఎం ప్రకటించిన పరిహారం ఉపశ మనం కలి గిస్తుం ది. అసలు ఇలాం టి ప్రమాదం మరోసారి జరగ కుండా కంపెనీని నివాస ప్రాంతాల మధ్య నుంచి తరలించాలి.
– గణబాబు, ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ నియోజకవర్గం

మేం ఊహించిన దాని కన్నా 4 రెట్లు ఎక్కువ
మేం ఊహించిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ సా యాన్ని ప్రక టించిన సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనీ యులు. బాధితు లను, బాధిత గ్రామాల ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకున్న తీరు ప్రశంసనీయం.

– నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

బాధితులను ఆదుకున్నతీరు ప్రశంసనీయం
బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించి సీఎం వైయస్‌ జగన్‌ వారిని ఆదుకున్న తీరు హర్షణీయం. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలిం చడంతో పాటు.. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి. ఈ ఘటనకు ఎల్జీ కంపెనీ బాధ్యత వహించాలి.

– కె.రామకృష్ణ, పి.మధు, వామపక్ష నేతలు 

Back to Top