ఫెయిలయిన బాబు కావాలా? ఫస్ట్‌క్లాస్‌ స్టూడెంట్‌ జగన్‌ కావాలా?

ఐదేళ్లలో ఒక ప్రాజెక్టును కూడా పూర్తిచేయని చంద్రబాబు

అంచనాలు పెంచుతూ...అవినీతిమయం

పాదయాత్రతో ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకున్న జగన్‌

వైయస్సార్‌ కలలుగన్న జలయజ్ఞం పూర్తిచేస్తామని...మాట ఇచ్చిన జగన్‌

రైతురాజ్యం తెస్తా...ప్రతిఎకరాకు సాగునీరందిస్తానంటున్న జగన్‌

 

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రజల గుండెచప్పుడుకు ప్రతీకలా వై.యస్‌.జగన్‌ తన మేనిఫెస్టోను ప్రకటించారు. అందులో హామీలన్నీ నెరవేర్చాకే, 2024లో ఓట్లడగడానికి ప్రజల ముందుకు వస్తానని చెబుతున్న జగన్‌లోని సంకల్పబలం విషయంలో సంకోచించాల్సిన పనేలేదు. 

మహానేత, ప్రతి ఎకరాకు నీళ్లందించాలని తపించిన వైయస్సార్‌ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తాం. పోలవరం, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుతో సహా, అన్ని నీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తిచేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. జలకళను తీసుకొస్తాం. ఇది ప్రాజెక్టుల విషయంలో జగన్‌ మేనిఫెస్టో సాక్షిగా చెప్పిన విషయాలు.

మరి ఈ ఐదేళ్లకాలంలో చంద్రబాబు ఏం చేశారు.....?

ప్రభుత్వం అనేది అందరి ప్రయోజనాలు, అన్నివర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలి. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. ఆయనకెంత సేపూ తమ వర్గం, తమ కాంట్రాక్టర్లు, తమ రియల్‌ఎస్టేట్‌ వ్యక్తుల ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి పట్టదు. కేంద్రం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును తీసుకుని, నాలుగేళ్లు దానిని ఏరకంగానూ ముందుకు పోనీయకుండా చేశాడు. ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశాడు. కాంట్రాక్టర్లకు భారీ లాభాలు వచ్చేలా చేశారు. ఇష్టమొచ్చినట్లు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చేశాడు. నిజంగా పోలవరంపై దృష్టి పెట్టి, చిత్తశుద్దితో పనులు చేసివుంటే అసలు పట్టిసీమ చేపట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. 

రాష్ట్రంలో మిగతా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిస్థితి ఇదే. వైయస్సార్‌ ఒక దీక్షలా ప్రాజెక్టులను నిర్మిస్తూపోతే, మిగిలిపోయిన అరకొరపనులను కూడా పూర్తిచేయలేని అసమర్ధత బాబుది. ఒకటి రెండు ప్రాజెక్టులకు కేవలం గేట్లపనిచేసి, గేట్లను ఎత్తి, అంతా తన గొప్ప అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇరిగేషన్‌ విధానం పెద్దస్కామ్‌. ప్రతిచోటా ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం, సబ్‌కాంట్రాక్టులు ఇచ్చేయడం, దోచేయడం, అయిదేళ్లుగా సాగుతున్నది ఇదే. ఇదీ వాస్తవపరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు బాగా ఆలోచించుకుని, ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

 

Back to Top