4 వసంతాల నవచరిత

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పగ్గాలు చేపట్టి నేటికి నాలుగేళ్లు  

నాలుగేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం అమలు

కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సంక్షేమాభివృద్ధి పథకాలు

పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యం 

ప్రతి కుటుంబం భవిష్యత్తు బాగుండాలనే ధ్యేయంతో పాలన

కోవిడ్‌ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాల అమలు  

నాలుగేళ్లలో అన్ని వర్గాలకు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాలు.. ఇందుకోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం

సంక్షేమంలోనూ బీసీలకు సామాజిక న్యాయం

ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే

పాలనా సంస్కరణలతో ప్రజల వద్దకే పారదర్శక పాలన

అమ‌రావ‌తి: ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు... ఏకంగా 10,778 ఆర్‌బీకేలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10,592 గ్రామ, పట్టణ హెల్త్‌ క్లినిక్‌లు సేవలందిస్తున్నాయి.  

వీటి ఫలితమేంటో తెలుసా..? 
► కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు ఇష్టంగా వెళుతున్నారు. రుచికరమైన భోజనం.. స్కూళ్లు తెరవకముందే చేతికందే పుస్తకాలు, యూ­నిఫామ్‌.. ఇంగ్లీషు విద్య.. ఎడ్యుటెక్‌ కంటెంట్‌తో అందే ట్యాబ్‌లు... ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేస్తు­న్నాయి. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్డె­క్కాల్సిన అవసరం లేకుండా రైతుల్ని ఆర్‌బీకేలు చేయిపట్టి నడిపిస్తున్నాయి. విత్తు మొదలు పంట విక్రయం దాకా అన్ని సేవలూ అక్కడే. హెల్త్‌ క్లిని­క్‌­లోని ఫ్యామిలీ డాక్టర్‌... ఊళ్లలో మంచానపడ్డ వారికి ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నాడు. గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందుతున్నాయి. అవ్వాతాతలకు వలంటీర్లు ఠంచనుగా పింఛన్‌ను తెచ్చి చేతిలో పెడుతున్నారు.  

► పేదలకు రేషన్‌ సరుకులూ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి. కాకపోతే... ఇవన్నీ సాధ్యమయింది కేవలం నాలుగేళ్లలో. 2019 మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత!!.  

► అందుకే ఇప్పుడు ఏపీ ఒక రోల్‌ మోడల్‌. సీఎంగా వైఎస్‌ జగన్‌ అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్‌బీకే, రేషన్‌ డోర్‌డెలివరీ, వలంటీర్‌ వ్యవస్థ... ఇలా అన్నిటినీ ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కొన్ని అమలు చేస్తున్నాయి కూడా!. 

► ‘నిన్నటికన్నా నేడు బాగుంటే.. అదే అభివృద్ధి. ఊరైనా... మనుషులైనా’ అనేది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విధానం. ఈ సూత్రంతోనే ఆయన ప్రచారానికి విలువివ్వకుండా పని చేస్తూ పోతున్నారు. సొంతింటికి నోచుకోని 31 లక్షల కుటుంబాల్లో... మహిళలకు ‘పట్టా’భిషేకం చేశారాయన. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణమూ భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయింది కూడా. ఇక నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి... అమలు చేశారు. తన కేబినెట్లో, ప్రభుత్వ పథవుల్లో మహిళలకు సగభాగమిచ్చి... చేతల మనిషిగా చరిత్ర సృష్టించారు.  

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు (56 శాతం) అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్‌ 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. సామాజిక న్యాయానికి చుక్కానిగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీనీ పంపకున్నా... జగన్‌ మాత్రం 8 సీట్లలో సగం బీసీలకే ఇచ్చారు. ఇక స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల సమగ్ర సర్వేని చేపట్టడమే కాక... రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన... నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. 

ఇవన్నీ ఒకెత్తయితే పారిశ్రామికంగా వేసిన అడుగులు మరో ఎత్తు. ఏపీకి సువిశాల తీరప్రాంతం ఉందంటూ గత పాలకుల్లా మాటలకే పరిమితం కాకుండా... కొత్తగా నాలుగు పోర్టులు,  10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిషింగ్‌ ల్యాండ్‌లు, మూడు ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మునుపెన్నడూ ఈ రాష్ట్రంవైపు చూడని... అంబానీ, అదానీ, జిందాల్, బంగూర్, భజాంకా తదితర దిగ్గజాలంతా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ వేదికగా విశ్వాసం వ్యక్తంచేయటమే కాక పెట్టుబడులూ పెడుతున్నారంటే... అది ముఖ్యమంత్రి దార్శనికతపై భరోసాతోనే. అందుకే... గడిచిన నాలుగేళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త చరిత్ర.     

అట్టడుగు వర్గాల ముందడుగు
 ఏపీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత నిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. నామినేటెడ్‌ నుంచి కేబినెట్‌ వరకు సింహ భాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సీఎం జగన్‌ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు.

దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రు లు నాటి మాయావతి నుంచి నేటి సిద్ధరామయ్య వరకు ఎవరూ చేయని రీతిలో ఆ వర్గాలకు సీఎం జగన్‌ సమున్నత గౌరవం ఇచ్చి సామాజిక సాధికారత సాధన దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయ సాధనలో దేశానికే టార్చ్‌బే రర్‌ (మార్గ దర్శకుడు)గా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.   

దేశానికే ఆదర్శం  
నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్‌ రూ.2.11 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖా తాల్లో (డీబీటీ) జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లోకే రూ. 1,56,987.64 కోట్లు వేశారు. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం జగన్‌ బాటలు వేశారు.  

చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవులు  
♦ నామినేటెడ్‌ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్‌ పదవులిచ్చారు. ఇలా చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.  

♦ 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. 

♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ ప దవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇ చ్చా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వ ర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి.. 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పద వులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.  

♦ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే చైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్‌ పదవులుంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ చైర్మన్‌ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో సగభాగం 3,503 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు. 
చేతల్లో సామాజిక న్యాయం  

♦ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌.. 2019 జూన్‌ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. 

♦ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురి(80 శాతం)ని ఆ వర్గాల నుంచే నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు.  

♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70%) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 

స్థానిక సంస్థల్లో..
♦ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్‌ ఉత్తర్వులు జారీ చేస్తే.. వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు. 

♦ 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.  ఇందులో 237 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. 

♦ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్‌ పదవులు (69 శాతం) ఇచ్చారు. 

♦ రాష్ట్రంలో 14 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. సీఎం వైఎస్‌ జగన్‌ 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవులకుగాను 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. 

ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన 
 రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల­కిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలు­గేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివ­రికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొన­సాగి­స్తున్నారు.
పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్ప­ని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్‌ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగ­మించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయ­తకు మారు పేరుగా పాలన సాగుతోంది.

గత ప్రభు­త్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్,  ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్ని­కలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని 

ఎమ్మెల్యేలు స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్‌ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

రూ.3.02 లక్షల కోట్లు సాయం
గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్‌ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాల వారు ఇన్నాళ్లు వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు.

ఆఖరుకు దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా గత ప్రభుత్వంలో నోచుకోలేదు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. దేశానికే బ్యాక్‌ బోన్‌ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వారికి తగిన వాటా ఇచ్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే కావడం గమనార్హం. 
 
ఆయా వర్గాలకు లబ్ధి ఇలా
♦ నాలుగేళ్లలో నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1,48,597 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.99,681 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.48,916 కోట్లు వ్యయం చేశారు. 
♦ నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఎస్సీలకు రూ.53,929 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.34,963 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.18,966 కోట్లు వ్యయం చేశారు. 
♦ నవరత్నాలు డీబీటీ నాన్‌ డీబీటీ ద్వారా ఎస్టీలకు రూ.15,114 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.10,395 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4,719 కోట్లు ఖర్చు చేశారు. 
♦ నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మైనారిటీలకు రూ.18,960 కోట్లు వ్యయం  చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.11,948 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.7,012 కోట్లు వ్యయం చేశారు. 
♦  నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా కాపులకు రూ.26,634 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.20,550 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.6,084 కోట్లు ఖర్చు చేశారు.
♦  నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఇతరులకు రూ.38,871 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.33,531 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.5340 కోట్లు వ్యయం చేశారు. 

మహిళలకు జగన్‌ ‘ఆసరా’ 
  చంద్రబాబు నయవంచనతో రాష్ట్రంలో కుదేలైన పొదుపు సంఘాల వ్యవస్థకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి జీవంపోసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 11 నాటికి వాటి పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వారికి చెల్లించేలా ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని అమలుచేయడంతో తిరిగి ఆ వ్యవస్థ గాడిలో పడింది. మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో దాదాపు ప్రతి పేదింటి మహిళ ఈ పొదుపు సంఘాల్లో సభ్యురాలైంది. రాష్ట్రంలో ఈ పురోగతిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికీ శ్రీకారం చుట్టింది. మరోవైపు.. వైఎస్‌ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవడం.. కుటుంబ అవసరాలకు సంఘం సభ్యులు ఉమ్మడిగా బ్యాంకుల నుంచి లోను తీసుకోవడం.. తిరిగి సకాలంలో అవి చెల్లించేవారు.

ఈ సమయంలో 2014 ఎన్నికల ముందు, మహిళలెవరూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఈ వి షయాన్ని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ప్రకటించారు.

దీంతో అప్పటివరకు దేశా నికి ఆదర్శంగా నిలిచిన ఏపీలో పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని మహిళలు ఆ రుణాలపై వడ్డీ, చక్రవడ్డీలు పెరిగి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారు. చివరకు.. ఒక దశలో వారు తమ రోజువారీ పొదుపు సంఘాల కార్యక్రమాలను దూరంపెట్టారు.   

సంఘాలకు జగన్‌ పూర్వవైభవం.. 
కానీ, వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ‘పొదుపు’ మహిళల పేరిట అప్పటివరకు ఉన్న రూ.25,517 కోట్ల అప్పును వారికే నేరుగా నాలుగు విడతల్లో చెల్లించేందుకు సీఎం హోదాలో ఆయన వైఎస్సార్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో ఆయన జమచేశారు.

మరోవైపు.. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించే పొ­దుపు మహిళలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే విధానానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దానికి మంగళం పాడింది. కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు తిరిగి పొదుపు సంఘాల కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకున్నారు.

అలాగే, చంద్రబాబు తీరుతో అప్పట్లో 60 శాతం పైబడి సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోతే.. ఇప్పుడు రాష్ట్రంలో 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు 99.5 శాతం మేర తమ రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. 

 
రైతన్నకు చేదోడుగా వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం 
 వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం వైయ‌స్ జగన్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.

వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్‌ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ, ఆయిల్‌పామ్‌ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్‌ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. 

ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు 
పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి.

ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది.  

మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు 
టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది.

కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది.  

సున్నా వడ్డీ.. ఉచిత బీమా 
సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది.

విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది.  

పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు 
గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్‌ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు  ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్త­నం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసి­రకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసే­­­వారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు  తొలగిపోయాయి.

ఇప్పుడు సీజన్‌కు ముందే రెడీ 
సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్‌ పడింది. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల్లో బుక్‌ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు.

వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్‌ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్‌లో టెస్ట్‌ చేసి మరీ నాణ్యమైన సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు.

మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్‌ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు.

గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్‌ చేయగానే క్షణాల్లో వీహెచ్‌ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ను అందజేస్తున్నారు.  

అగ్రి ల్యాబ్‌లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు 
అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్‌ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 

దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’ 

రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు,  మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి.
ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్,  జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి  తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి

ఐటీలోనూ మేటి.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, టెక్‌ మహీంద్రా, డబ్ల్యూఎన్‌ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్‌ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్య­కలా­పాలు ప్రారంభిస్తున్నాయి.

వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్‌ బిజి­నెస్‌ పార్క్‌­ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చి­లో విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు
రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత­్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్‌ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్‌ ల్యాండ్‌లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారి­డార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభు­త్వం అభివృద్ధి చేస్తోంది.

కోవిడ్‌ సంక్షోభంలోనూ కొ­ప్ప­­ర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రి­­యల్‌ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజి­స్టిక్‌ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వ­క­ల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభు­త్వ­ం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. 

లక్షలాది మందికి ఉపాధి..
సీఎం జగన్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది.

ఇందులో సీఎం జగన్‌ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్‌ 2019 డిసెంబర్‌ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి.

వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది.  

మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి.
  
‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్‌ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది.

ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి.     
 
నాలుగేళ్లలోఎంత తేడా! 
నాడు 

విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు..  పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. 

నేడు 
ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్‌ డెస్క్‌ బెంచీలు.. డిజిటల్‌ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. 

విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి 
ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి  వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో  రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్‌ మరమ్మతులు, విద్యుత్‌ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్‌ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం వంటి వసతులు కల్పించారు.

ఆ తర్వాత కిచెన్‌షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్‌)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు.  

అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక 
పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రో­జులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు.

ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సా­మగ్రిని  సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్‌ చార్జీతో సహా 3 జతల యూ­నిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది  విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది.   

బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు  
వైఎస్సార్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్‌ సంస్కరణలు చేపట్టింది.

విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్‌ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్‌ కళాశాల ఉంది.

కోవిడ్‌ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్‌ లెర్నింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్‌ పీడీఎఫ్‌ రూపంలో ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్‌ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్‌ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. 

రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు 

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా విజయోత్సవాలు జరుపుకొంటున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ముగ్ధులైన ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నగరం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరిలో బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలతో సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో జరగిన బైక్‌ ర్యాలీల్లో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో హోం మంత్రి తానేటి వనిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల బైక్‌లతో 25 కిలోమీటర్ల భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ట్రాక్టర్‌ తోలుతూ ర్యాలీలో పాల్గొన్నారు. కడప నగరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమ బాబు, అఫ్జల్‌ఖాన్, ఏపీ సోషల్‌వెల్ఫేర్‌ బోర్డు ఛైర్మెన్‌ పులి సునీల్‌ కుమార్‌ ర్యాలీని నిర్వహించారు.

బాపట్ల జిల్లా  అమర్తలూరు మండలంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి కూడలి నుంచి సామవాయి మార్గం, అన్నమయ్య మార్గం మీదుగా ర్యాలీ విజయవంతంగా సాగింది. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమే ష్ బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నుంచి లక్ష్మీపురం వరకు 16 కిలోమీటర్ల భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి,  ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కె.రక్షణనిధి ఆధ్వర్యంలో, విజయవాడ నగరంలో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. 

తాజా వీడియోలు

Back to Top