కాపు సామాజిక వర్గానికి అండగా..

నేడు ‘కాపు నేస్తం’ నాలుగో విడత

నిడదవోలు సభలో బటన్‌ నొక్కి జమ చేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,57,844 మందికి లబ్ధి

నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు అందించిన ఆర్థిక సాయం రూ.2,029 కోట్లు

 అమరావతి: పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరు­సగా నాలుగో ఏడాదీ ‘వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు  వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధి­దారుల ఖాతాలకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా నగదు జమ చేయనున్నారు.

అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. 

కాపులను దగా చేసిన టీడీపీ సర్కారు
టీడీపీ సర్కారు కాపులను అన్ని రకాలుగా దగా చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొ­ప్పు­న ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు కేటాయి­స్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా వంచించింది. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలి­జ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్‌–డీబీటీతో రూ.39,247 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం గమ­నార్హం. కాపు కార్పొ­రేషన్‌ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొ­ప్పున ఐ­దేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేని­ఫెస్టోలో పేర్కొనగా అంతకంటే మిన్నగా మేలు చేయడం గమనార్హం. 

నేడు నిడదవోలుకు  సీఎం వైయ‌స్‌ జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుంటారు. అక్కడ సెయింట్‌ ఆంబ్రోస్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

తాజా వీడియోలు

Back to Top