బాబు మోసాలు చూసి గుండె మండుతోంది

పిల్లలను అవిటివారిని చేసి అడుక్కునేవారికి, బాబుకు తేడా లేదు

ప్రజల అభిమానమే నన్ను నడిపించింది

3648 కిలోమీటర్లు నడిపించింది ప్రజల ఆప్యాయతే

ఎంత నడిచామో ముఖ్యం కాదు.. ఎంత మందికి భరోసా ఇచ్చామో అదే ముఖ్యం

ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీకాకుళం: నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటి వారిగా మార్చి అడుక్కునే వారికి.. రాష్ట్రం కష్టాల్లో ఉందని దోచుకునే చంద్రబాబుకు ఏమైనా తేడా ఉందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో వైయస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు. ఈ ప్రజా సంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. ఇడుపులపాయలో తొలి అడుగు వేసినప్పుడు నేనే ఊహించలేదు. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఇన్ని కోట్ల ప్రజల జ్ఞాపకాలు, అభిమానం మధ్య సాగుతుందని ఊహించలేదు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడవగలిగానంటే.. నడిచింది నేను అయినా నడిపించింది మాత్రం ప్రజలు, పైనున్న దేవుడు. పైనుంచి చల్లటి దీవెనలు నాన్నగారు అందించారు. 3648 కిలోమీటర్లు నడిచామనే ప్రస్తావన వస్తున్నప్పుడు ఒక వ్యక్తి అన్నా హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ ఎంత దూరమో మీకు తెలుసా అన్నాడు. హైదరాబాద్‌ నుంచి దుబాయి విమానం ఎక్కితే 3 వేల కిలోమీటర్లు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఎంత దూరమో తెలుసా అన్నాడు. అక్షరాల 3440 కిలోమీటర్లు అని చెప్పాడు. పాదయాత్ర వీటి రికార్డులను దాటేసింది. ఇది ప్రజల ఆప్యాయత, అభిమానం, పైనుంచి దేవుడి దీవెనలు ఉన్నాయి. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు. ఎంత మందిని కలిసి వారికి భరోసా ఇచ్చిమన్నదే ముఖ్యం. 

చంద్రబాబు పాలనలో నాలుగున్నరేళ్ల పాలనలో ఎలాంటి పనులు చూశామన్నా.. ఆయన చేసిన పాలనను ప్రజలు చెబుతుంటే జరుగుతున్న అన్యాయాలను చెబుతుంటే ఆందోళన కలుగుతుంది. ఒక పక్క రాష్ట్రంలో కరువు, ఇంకోపక్క తుపాన్లు, ఒక పక్క రాష్ట్ర విభజన నష్టం. ఇంకో పక్క చంద్రబాబు దోపిడీ. మరోపక్క వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్న దుస్థితి. ఇంకోపక్క రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం. మరోపక్క నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ప్రతి నెల అని మోసగించిన చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్ధానాలు, మరోపక్క 650 వాగ్ధానాలు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి పేజీ ఒక కులానికి పెట్టి. వారిని ఎలా మోసం చేయాలని పీహెచ్‌డీ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే గుండె మండుతోంది.  

 

తాజా వీడియోలు

Back to Top