ఇద్ద‌రితో మొద‌లై

ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో ఏర్పాటైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు మ‌హా సైన్యంలా రూపుదిద్దుకుంది. పోరాటాల నుంచి ఉద్భ‌వించి, ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌లు, కుతంత్రాలను ఛేదించుకుంటూ పార్టీ పురోగ‌మిస్తున్న తీరు అధికార పార్టీ వెన్నులో ద‌డ పుట్టిస్తోంది. 

మ‌హానేత‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. అయితే ఆయ‌న‌పై కాంగ్రెస్‌ పార్టీ నేత‌లే కుట్ర‌ల చేశారు. దీంతో ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హానేత త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మార్చి 12, 2011న  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత రెండు నెల‌ల‌కే ఉప ఎన్నిక‌లు రాగా వైయ‌స్ఆర్ జిల్లా క‌డ‌ప ఎంపీగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా వైయ‌స్ విజ‌య‌మ్మ పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుపొందారు. మొదట ఒక్కరితో ఉమ్మ‌డి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వైయస్‌ఆర్‌ సీపీ అంచెలంచెలుగా 15 స్థానాలను సంపాదించుకొంది.  ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో67 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందింది. అంతేకాకుండా ఏపీలో 8 ఎంపీ స్థానాలు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో విజ‌యం సాధించి ఎన్నో ఏళ్ల అనుభ‌వం ఉన్న పార్టీల‌కు ద‌డ పుట్టించింది.

ప్ర‌జ‌ల కోస‌మే పోరాటం
తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు 120 ఏళ్ల అనుభవం ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు ఎదురుతిరిగిన ధీరుడు వైయస్‌ జగన్‌. తెలుగు ప్రజల కోసం నిలబడేందుకు ఎందాకైనా అంటూ..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన జనం మెచ్చిన జగన్మోహనుడు ఆయన. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న అప్పటి నాయకుల పాలనకు బుద్ధి చెప్పేందుకు, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లుగా భావించి రూపుదిద్దుకున్న పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైయస్‌ఆర్‌ సీపీ).  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని చక్కదిద్దుతూ, ప్రతిపక్షనేతగా చ‌ట్ట స‌భ‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుపెర‌గ‌ని పోరాటాలు చేస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలను నిల‌దీస్తునే ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత దీక్షలు, ఆమరణ దీక్షలు, నిరసనలు చేపడుతున్నారు. తన తల్లి విజయమ్మ, వైయస్‌ జగన్‌ ఇద్దరితో మొదలైన పార్టీ నేడు విభజిత ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించుకుంది. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఒక్క శాతం ఓట్ల‌తో అధికారానికి దూర‌మైంది.  

ప్రజలే బలం, ప్రజా శ్రేయస్సుకే గళం
టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై దాడులకు, ఆరోపణలకు దిగుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు బ్రిటీష్‌వారి కంటే ఘోరంగా ప్రజలను ఇబ్బందులను గురిచేస్తుండడంతో... ప్రజా శ్రేయస్సు కోసం వైయస్‌ఆర్‌ సీపీ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం సాగిస్తుంది. ప్రజల స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి ఎందరో మహానుభావులు స్వాతంత్య్రం తీసుకువస్తే, నేడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు ప్రజల స్వేచ్చను కాలరాస్తున్నాడు. పరిపాలనను గాలికి వదిలేసి సొంత లాభం కోసం 5 కోట్లు మంది ప్రజలు మనోభావాలను తాకట్టుపెట్టి అభివృద్ధి ముసుగులో రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేస్తున్నారు. బాబు తన పరిపాలనతో ఇంకా మనం బ్రిటీష్‌ పరిపాలనలోనే ఉన్నామా అనే స్థితికి ప్రజలను తీసుకువచ్చారు. అధికార ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను పట్టించుకోకపోవడంతో అసెంబ్లీలో, బయట వైయ‌స్ఆర్ సీపీ త‌న‌ గళాన్ని వినిపిస్తుంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశపెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను టీడీపీ స‌ర్కార్ తూట్లు పొడుస్తోంది. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ, 108, 104  వంటి ఎన్నో  ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించ‌కుండా ల‌క్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఇలాంటి ప‌థ‌కాల‌ను కొన‌సాగించాల‌ని, ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తి చూపుతూ, రాష్ట్రంలో ఎక్క‌డ‌, ఏ మూల‌న చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా క్ష‌ణాల్లో అక్క‌డ వాలిపోయి వైయ‌స్ జ‌గ‌న్ బాధితుల క‌న్నీళ్లు తుడుస్తున్నారు. అంతేకాకుండా చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు, మోసాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు గ‌త ఏడాది జూలై 8 నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టి ఈ ర‌కంగా ప్ర‌తి ఇంటికి వైయ‌స్ఆర్సీపీ నాయ‌కులు వెళ్లి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని వారికి తోడుగా నిల‌బ‌డేలా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నారు. జ‌న‌నేత ఎక్క‌డికి వెళ్లినా త్వ‌ర‌లోనే ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ తెచ్చుకుందామ‌ని ధైర్యం చెబుతున్నారు. ఆ రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి..ప్ర‌జ‌ల‌కు స్వ‌ర్ణ యుగం తెచ్చేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు బాస‌ట‌గా నిలుస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top