రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహానేత హయాంలో లబ్ధి పొందిన పేదలు షర్మిలతో నడుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇడుపులపాయనుంచి ఆమె వెంటే నడుస్తున్నారు. ఇచ్చాపురం వరకూ నడుస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.

పొందిన లబ్ధికి.. రుణం తీర్చుకుంటున్నాం:సుజాత

అలా నడుస్తున్న వారిలో ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సుజాత ఒకరు. పేదరికం కారణంగా ఆమె నర్సుగా పనిచేసేందుకు 1999లో సౌదీ వెళ్లారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేస్తున్న మంచి పనులను టీవీలో చూసి అభిమానిగా మారారు. అదే ఏడాది ఆమె కూతురు నారాయణమ్మకు ఇంజినీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ఆసరాతో పైసా ఖర్చు లేకుండా చదువు పూర్తిచేసి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి వెళ్లింది. సుజాత తండ్రి ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.4 ల క్షల విలువైన ఆపరేషన్ ఉచితంగా చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌కు వచ్చిన ఈమె అక్టోబర్ 25న మళ్లీ సౌదీ వెళ్లాల్సి ఉంది. వైయస్ మరణానంతరం ఆయన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ దాడి, జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించడం, షర్మిల పాదయాత్ర చేయడం చూసి చలించిపోయారు. తన కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన వైయస్ కుటుంబం కోసం తానూ అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. గత నెల 18 నుంచి షర్మిలతో పాటు యాత్రలో పాల్గొంటున్నారు.

విదేశంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి..

మరో వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధవళ గిరిబాబు. లండన్‌లో పన్నెండేళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. వైయస్ అమలు చేసిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకం రాష్ట్రాన్ని మార్చేస్తుందని నమ్మారు. వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేక 2010లో భారత్‌కు తిరిగి వచ్చిన ఈయన జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల వెంట ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడవాలని భావించారు. లండన్‌లో ఉద్యోగం కన్నా రాష్టంలో వైయస్ అందించిన సువర్ణపాలన జగన్ ద్వారా మళ్లీ వస్తే అంతే చాలని, జగన్‌ను సీఎంగా చూడడమే తన లక్ష్యమని చెబుతున్నారు.

మరొకరు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం వైదిన గ్రామం నుంచి వచ్చిన దయామణి. జబ్బు చేయడంతో వెన్ను వంగిపోయింది. వైయస్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయలతో ఆపరేషన్ అయింది. లేచి నిలబడలేని పరిస్థితి నుంచి నడిచేలా చేసిన వైయస్ రుణాన్ని.. షర్మిలతో కలిసి పాదయాత్ర చేస్తూ కొంతైనా తీర్చుకుంటానని ఈమె చెబుతున్నారు.

ఇలా ఒకరో... ఇద్దరో కాదు... దాదాపు 70 మంది షర్మిల వెంట సాగుతున్నారు. అందులో 40 మంది వరకు వైయస్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఏదోరకంగా లబ్ధి పొందిన వారే! వీరంతా మంగళవారం నాటికి షర్మిలతో కలిసి 451.1 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొంది... ఆయన మీద అభిమానాన్ని పాదయాత్ర ద్వారా చాటుకుంటున్నారు. తమ కుటుంబాలను వదిలి వందల కిలోమీటర్ల మేర రాజన్న కుమార్తెతో కదం కదిపారు. మహిళలు, వృద్ధులు, యువకులు, ఉద్యోగాలకు సెలవు పెట్టి వచ్చిన వారు సైతం ఎందరో ఈ పాదయాత్రలో కనిపిస్తున్నారు.