పుష్కరాలు అంటే తెలుగు తమ్ముళ్లకు పండగే పండగ..!


() గోదావరి పుష్కరాల కథే మళ్లీ రిపీట్

()క్రిష్ణా పుష్కరాలకు ఇప్పటికీ టెండర్లు నిల్

() నామినేషన్ పద్దతిలో పనులు దక్కించుకొనేందుకు రింగ్

విజయవాడ) మైక్ దొరికితే చాలు చంద్రబాబు చెప్పే మాట... తాను నిప్పు అని,
అవినీతిని ఏమాత్రం సహించను అని ఊదర గొడుతుంటారు. విజయవాడ నడిబొడ్డున జరుగుతున్న
వెయ్యికోట్ల అవినీతి బాగోతం చంద్రబాబుకి తెలియదు అని అనుకోవటానికి వీల్లేదు. అయితే
ఎప్పటిలాగే దాన్ని కప్పి పుచ్చటానికి ఆయన మార్కు హంగామా ఎలాగూ ఉంటుంది. దీనికి
ఇప్పుడు క్రిష్ణా పుష్కరాలు వేదిక కాబోతున్నాయి.

       ఆగస్టు 12 నుంచి క్రిష్నా
ఫుష్కరాలు మొదలు కాబోతున్నాయి. అంటే గట్టిగా చూస్తే మూడు నెలల సమయం కూడా లేదు.
వీటికి దాదాపు 1250 కోట్ల రూపాయిలు కేటాయించారు. బ్రహ్మాండంగా పుష్కరాలు నిర్వహణ
చేస్తామని ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, నాయకులు ఊదర గొట్టేస్తున్నారు. అయితే
ఇప్పటిదాకా ఇంతటి మహాకార్యానికి సంబంధించి టెండర్లు పూర్తిగా దాఖలు కాలేదు. దాదాపు
15వందల పనుల్ని ఈ వందల కోట్ల రూపాయిలతో పూర్తి చేయాల్సి ఉంది.

       వాస్తవానికి ఇంతటి భారీ
కార్యక్రమానికి ముందుగానే టెండర్లు రావలసి ఉంటుంది. వాటిలో మెరుగైన సంస్థలు,
కాంట్రాక్టర్లను ఎంపిక చేసి అధికారులు పనులు అప్పగిస్తారు. అప్పుడు వాటిని అమలు
చేస్తూ అధికారులు లేదా ప్రజా ప్రతినిధులు నాణ్యతను తనిఖీ చేసేవారు. లోపం ఉంటే
మార్పు చేసుకొనే వీలు ఉంటుంది. అయితే ఇదంతా తెలుగుదేశం నాయకులకు ఇష్టం లేదు.
ఎందుకంటే హోల్ సేల్ గా నిధుల్ని భోం చేసేయటానికి ముందుగానే రంగం సిద్ధం చేసుకొన్నారు.
అందుకే టెండర్లు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. టీడీపీ నాయకులు పక్కాగా అమలు చేస్తున్న
స్కెచ్ ఇది. టెండర్లు లేకుండా ఉండటంతో అధికారులు వేచి చూసినట్లు నటించి
చివరకు..నామినేషన్ పద్దతిలో పనుల్ని చివరి నిముషంలో అప్పగించేస్తారు. అప్పుడు
హడావుడిగా పనులు  పై పైన పూర్తి చేసి
కోట్లు రూపాయిలు కొట్టేస్తారు.

       ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు పాత్ర
కూడా ప్రవేశిస్తుంది. అంటే ఒక నెల తర్వాత చంద్రబాబు పుష్కరాల పనుల తనిఖీ కి
వెళతారన్న మాట. అప్పుడు పనులు ఎక్కడివి అక్కడే ఉండటం చూసి అధికారులు మీద
అరిచినట్లు, కోప్పడినట్లు హడావుడి చేస్తారు. దీంతో కంగారు పడినట్లుగా అధికార
యంత్రాంగం నటించేసి టెండర్ల విధానాన్ని పక్కన పెట్టేసి నామినేషణ్ పద్దతిలో పనులు
మొదలు పెడతారు. వారం రోజుల తర్వాత  పచ్చ
మీడియాలో వార్తలువ చ్చేస్తాయి. చంద్రబాబు తనిఖీలతో అధికారుల్లో కదలిక, పరుగులు
పెడుతున్న పనులు అని బ్యానర్లు కడతారు. దీంతో పూనకం వచ్చినట్లుగా కాంట్రాక్టర్ల
దోపిడీ సాగుతుంది. పుష్కరాల తర్వాత పది, పదిహేను రోజులకే పనుల రంగు బయట పడుతుంది.

       ఇదంతా గోదావరి పుష్కరాల సమయంలో
జరిగిన ఎపిసోడ్. త్వరలో క్రిష్ణా నది పుష్కరాల్లో ఇదే జరిగే వాతావరణం
కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబే కాబట్టి సూపర్ హిట్
స్కెచ్ అనుకోవటం లో తప్పు లేదు కదా..

 

Back to Top