- స్వాతంత్య్ర సమరం స్ఫూర్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యమాలు
- తెలుగు ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సీపీ ఏర్పాటు
- హక్కుల సాధనకు ప్రభుత్వాలపై అలుపెరగని పోరాటాలు
తెల్లదొరలను గుర్తు చేస్తున్న చంద్రబాబు పాలన
ప్రజల పక్షాన ఏపీ ప్రతిపక్ష నేత
పోరాడితే పోయేది ఏముంది..బానిస సంకేళ్లు తప్ప అన్న స్ఫూర్తితో నాడు స్వాతంత్య్ర పోరాటం చేశారు. అదే స్ఫూర్తితో అధికారాన్ని సైతం తృణప్రాయంగా వదిలి ప్రజల పక్షాన నిలిచాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు 120 ఏళ్ల అనుభవం ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు ఎదురుతిరిగిన ధీరుడు వైయస్ జగన్. తెలుగు ప్రజల కోసం నిలబడేందుకు ఎందాకైనా అంటూ..వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జనం మెచ్చిన జగన్మోహనుడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న అప్పటి నాయకుల పాలనకు బుద్ధి చెప్పేందుకు, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లుగా భావించి రూపుదిద్దుకున్న పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్ సీపీ).
దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాష్ట్రంలో ప్రజా శ్రేయస్సును మరిచి సోనియాగాంధీ రిమోట్ కంట్రోల్ తో పాలన కొనసాగుతుండడంతో ప్రజల గళమే మా గళం అంటూ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్ సీపీని ఏర్పాటు చేశారు. తన తల్లి విజయమ్మ, వైయస్ జగన్ ఇద్దరితో మొదలైన పార్టీ నేడు విభజిత ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించుకుంది. వైయస్‌ఆర్ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించకుండా ప్రజాస్వామ్యయుతంగా వారితో రాజీనామా చేయించి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లారు వైయస్ జగన్.
మొదట ఒక్కరితో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వైయస్‌ఆర్ సీపీ అంచెలంచెలుగా 17 స్థానాలను సంపాదించుకొని, ఆ తరువాత 2014 ఎన్నికల్లో 67 స్థానాలల్లో గెలుపొందింది. అధ్యక్షుడిగా పార్టీని చక్కదిద్దుతూ, ప్రతిపక్షనేతగా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలపై అలుపెరగని పోరాటాలు చేశారు. నాటి స్వతంత్ర సమరయోధులను స్పూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత దీక్షలు, ఆమరణ దీక్షలు, నిరసనలు చేపట్టారు.
ప్రజలే బలం, ప్రజా శ్రేయస్సుకే గళం
టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైయస్‌ఆర్ సీపీ నేతలపై దాడులకు, ఆరోపణలకు దిగుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. బ్రిటీష్‌వారు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో దేశ స్వాతంత్య్రం కోసం శాంతి, అహింసను ఆయుధాలుగా చేసుకొని పోరాడిన సమరయోధులను వైయస్‌ఆర్ సీపీ స్ఫూర్తిగా తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు బ్రిటీష్‌వారి కంటే ఘోరంగా ప్రజలను ఇబ్బందులను గురిచేస్తుండడంతో... ప్రజా శ్రేయస్సు కోసం వైయస్‌ఆర్ సీపీ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం సాగిస్తుంది. ప్రజల స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి ఎందరో మహానుభావులు స్వాతంత్య్రం తీసుకువస్తే, నేడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు ప్రజల స్వేచ్చను కాలరాస్తున్నాడు. పరిపాలనను గాలికి వదిలేసి సొంత లాభం కోసం 5 కోట్లు మంది ప్రజలు మనోభావాలను తాకట్టుపెట్టి అభివృద్ధి ముసుగులో రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేస్తున్నారు. బాబు తన పరిపాలనతో ఇంకా మనం బ్రిటీష్ పరిపాలనలోనే ఉన్నామా అనే స్థితికి ప్రజలను తీసుకువచ్చారు. అధికార ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను పట్టించుకోకపోవడంతో అసెంబ్లీలో, బయట తన గళాన్ని వినిపిస్తుంది.