వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రొఫైల్స్‌

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. తొలి, మలి విడతల్లో ఎంపీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆదివారం వైయ‌స్ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో  అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోయారు.  అభ్య‌ర్థుల ఫ్రోఫైల్ ఇలా..

  1.పులివెందుల:  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


పేరు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
పుట్టిన తేదీ : 21.12.1972 
విద్యార్హత : ఎంబీఏ 
స్వస్థలం : పులివెందుల 
తల్లిదండ్రులు : వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ విజయమ్మ
భార్య: వైఎస్‌ భారతిరెడ్డి
సంతానం: హర్ష, వర్ష 
రాజకీయ ప్రవేశం
2009లో కాంగ్రెస్‌పార్టీ తరపున కడప ఎంపీగా విజయం. ఆ తర్వాత తన తండ్రి వైఎస్సార్‌ మరణించడంతో కాంగ్రెస్‌పార్టీ అధిష్టానంతో విభేదాల కారణంగా తన ఎంపీ పదవికి, కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వానికి 2010 నవంబర్‌ 10న రాజీనామా చేశారు. 2011 మార్చి 12న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మే నెలలో జరిగిన ఉప ఎన్నికలలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి 5,45,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్షనేతగా కొనసాగుతున్నారు.    

2.ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాదరెడ్డి

పేరు :  రాచమల్లు శివప్రసాదరెడ్డి
పుట్టిన తేదీ  : 2–12–1966
తల్లిదండ్రులు: 
రాచమల్లు శివశంకర్‌రెడ్డి,
మునిరత్నమ్మ
విద్యార్హత: బి.ఏ    
నివాసం: ప్రొద్దుటూరు
భార్య: రాచమల్లు రమాదేవి  
సంతానం: పల్లవి 
(పీజీ జర్నలిజం), కృష్ణ కావ్య 
(ఆస్ట్రేలియాలో ఎంబీఏ)
రాజకీయ ప్రవేశం
1998లో మున్సిపల్‌ కౌన్సిలర్, 2003లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్, 2004 సెప్టెంబర్‌ నుంచి 2005 మార్చి 5వ తేదీ వరకు మున్సిపల్‌ ఇన్‌చార్జి చైర్మన్, 2014 ఎన్నికల్లో తొలిమారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 

3.జమ్మలమడుగు: డాక్టర్‌ మూలే సుధీర్‌రెడ్డి

పేరు : డాక్టర్‌ మూలే సుధీర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 12–3–1981
విద్యార్హత : ఎంబీబీఎస్, డీఏ(అనస్థీషియా) 
తల్లిదండ్రులు : వెంకటసుబ్బారెడ్డి, 
లక్ష్మీదేవమ్మ
స్వస్థలం : నిడుజివ్వి, ఎర్రగుంట్ల మండలం 
భార్య : క్రాంతి ప్రియ
సంతానం : దిహాంతిక రెడ్డి(కుమార్తె)
రాజకీయ ప్రవేశం: 2019 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

4.రైల్వేకోడూరు : కొరముట్ల శ్రీనివాసులు

పేరు : కొరముట్ల శ్రీనివాసులు
పుట్టిన తేదీ : 06–07– 1971
విద్యార్హత : ఎంఏ, ఎంఎల్‌  
తల్లిదండ్రులు: గంగయ్య, తులశమ్మ
స్వస్థలం : రెడ్డివారిపల్లె, రైల్వేకోడూరు మండలం
భార్య : స్వర్ణకుమారి
సంతానం : పునీత్‌రాయ్, రాజశేఖర్‌.
రాజకీయ ప్రవేశం: 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా, 2012 ఉప
ఎన్నికలు,  2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 
తరపున గెలుపొందారు.  

5.మైదుకూరు : శెట్టిపల్లె రఘురామిరెడ్డి

పేరు : శెట్టిపల్లె రఘురామిరెడ్డి
పుట్టిన తేదీ : 20–06–1946
విద్యార్హత     : పీయూసీ
తల్లిదండ్రులు : శెట్టిపల్లె సుబ్బమ్మ,
చిన్న నాగిరెడ్డి 
జన్మస్థలం     : నక్కలదిన్నె గ్రామం, చాపాడు మండలం.
భార్య : ప్రభావతమ్మ 
సంతానం : ముగ్గురు కుమారులు నాగిరెడ్డి, అశోక్‌రెడ్డి, దుశ్యంత్‌రెడ్డి, కుమార్తె సుధా 
రాజకీయ ప్రవేశం:
1982లో ప్రొద్దుటూరు సమితి అధ్యక్షునిగా, 1985లో శాసనసభ మధ్యంతర ఎన్నికలో మైదుకూరు ఎమ్మెల్యేగా (టీడీపీ) గెలుపొందారు. తిరిగి 1999లో  ఎమ్మెల్యేగా (టీడీపీ),  2014లో ఎమ్మెల్యేగా (వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు. 

6.రాయచోటి:  గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

పేరు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
పుట్టిన తేదీ : 15–06–1973 
తల్లిదండ్రులు: శ్రీమతి కృష్ణమ్మ, గడికోట మోహన్‌రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) 
విద్యార్హత : బి.టెక్‌ 
భార్య:  శివలలిత
సంతానం: కుమారుడు: రిత్విక్‌రెడ్డి, కుమార్తె: షాహనారెడ్డి
స్వస్థలం : యర్రంరెడ్డిగారిపల్లె, సుద్దమల గ్రామం, రామాపురం మండలం 
రాజకీయ ప్రవేశం: 
2009లో తొలిసారి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
రెండోసారి 2012 ఉప ఎన్నికల్లో, మూడోసారి 2014 ఎన్నికల్లో గెలుపొందారు.  

7.బద్వేలు: డాక్టర్‌ గుంతోటి 

 
పేరు: డాక్టర్‌ గుంతోటి 
వెంకట సుబ్బయ్య
పుట్టిన తేదీ: 10–01–1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య,
పెంచలకొండమ్మ
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎంఎస్‌ (ఆర్థో)
స్వస్థలం: వల్లెలవారిపల్లె, గోపవరం మండలం
భార్య: సంధ్య, ఎంబీబీఎస్, డీజీఓ
సంతానం: కుమార్తె: హేమలత, ఎంబీబీఎస్‌ ద్వితీయ
సంవత్సరం, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల,
కుమారుడు: తనయ్‌ పదో తరగతి
రాజకీయ ప్రవేశం: 2014 నుంచి వైఎస్సార్‌సీపీలో
క్రియాశీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.   

8.కడప:  షేక్‌. బేపారి 

పేరు: షేక్‌. బేపారి 
అంజద్‌ బాషా
పుట్టిన తేదీ: 12–08–1971
విదార్హత: బి.ఏ
స్వస్థలం: కడప
తల్లిదండ్రులు: షేక్‌. బేపారి అబ్దుల్‌ ఖాదర్, ఎస్‌బి 
నూర్జహాన్‌ బేగం
భార్య: ఎస్‌బి నౌరిన్‌ ఫాతిమా
సంతానం: జైబా జువేరియా (కుమార్తె) 
రాజకీయ ప్రవేశం:
2005లో మున్సిపల్‌ కార్పొరేటర్, 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

9.కమలాపురం:పోచిమరెడ్డి 

పేరు: పోచిమరెడ్డి 
రవీంద్రనాథ్‌ రెడ్డి
పుట్టిన తేదీ:  20–08–1958
విద్యార్హత: బి.కాం 
తల్లిదండ్రులు: పి.రామాంజులరెడ్డి, తులసమ్మ 
స్వస్థలం: పోచిమరెడ్డిపల్లె, 
వీరపునాయునిపల్లె మండలం 
భార్య: అరుణమ్మ
సంతానం: రమ్యతారెడ్డి( కుమార్తె), నరేన్‌రెడ్డి (కుమారుడు)
రాజకీయ ప్రవేశం: 1999లో చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా, 2004లో కడప నగర తొలి మేయర్‌గా, 2014లో కమలాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.    

10.రాజంపేట: మేడా వెంకట మల్లికార్జునరెడ్డి

పేరు : మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
పుట్టిన తేదీ: 26.01.1963
తల్లిదండ్రులు: మేడా రామకృష్ణారెడ్డి, 
లక్ష్మినరసమ్మ
స్వస్థలం: చెన్నయ్యగారిపల్లె, 
నందలూరు మండలం
విద్యార్హత: బీఎస్సీ
భార్య: మేడా సుచరిత
సంతానం: మేడా వెంకటరామిరెడ్డి, మేడా కృష్ణతేజారెడ్డి
రాజకీయ ప్రవేశం: 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు.      

 

----------------------------------

అనంతపురం జిల్లా-

1.ధర్మవరం నియోజకవర్గం : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 


పేరు: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 
తండ్రి: కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
తల్లి           : కేతిరెడ్డి కళావతమ్మ
పుట్టిన తేది  : 13–10–1980
భార్య          : కేతిరెడ్డి సుప్రియ
కుమారుడు  : కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి
విద్యార్హత      : బీటెక్‌
రాజకీయ అనుభవం: 2006లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురికావడంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ(16,000) సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ డీఆర్‌యుసీసీ, అటవీ అభివృద్ధి శాఖ, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత  2014 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ధర్మవరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 

2.పెనుకొండ నియోజకవర్గంమాలగుండ్ల శంకరనారాయణ

పూర్తి పేరు : మాలగుండ్ల శంకరనారాయణ
తండ్రి: కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
తల్లి     : కేతిరెడ్డి కళావతమ్మ
పుట్టిన తేది    : 13–10–1980
భార్య    : కేతిరెడ్డి సుప్రియ
కుమారుడు    : కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి
విద్యార్హత    : బీటెక్‌
రాజకీయ అనుభవం: 2006లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురికావడంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ(16,000) సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ డీఆర్‌యుసీసీ, అటవీ అభివృద్ధి శాఖ, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత  2014 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ధర్మవరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

 

3.మడకశిర నియోజకవర్గం: డాక్టర్‌ ఎం తిప్పేస్వామి

పేరు: డాక్టర్‌ ఎం తిప్పేస్వామి
గ్రామం    : ఉదుగూరు
మండలం    : అమరాపురం
తండ్రిపేరు    : ఎం. హనుమప్ప
భార్య పేరు    : ఏ.ఎస్‌.సత్యవాణి
పుట్టిన తేది    : 01–06–1953
వృత్తి    : వైద్యం
విద్యార్హత    : ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ
కుమారులు    : డాక్టర్‌ స్వామి దినేష్, స్వామి మహేష్, స్వామి రాజేష్‌
రాజకీయ అనుభవం: 1994లో పలమనేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపో యారు. 1999లో అక్కడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున మడకశిరలో పోటీ చేసి ఓటమి చెందినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2018లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

4.శింగనమల నియోజకవర్గంజొన్నలగడ్డ పద్మావతి

పేరు: జొన్నలగడ్డ పద్మావతి
తండ్రి : దివంగత జె. చెన్నకేశవులు 
తల్లి     : జె. నిర్మలాదేవి 
పుట్టిన తేదీ    : 18–06–1979
స్వగ్రామం     : నెల్లూరు
చదువు       : ఎంటెక్‌.,
భర్త     :  అలూరి సాంబశివారెడ్డి  (శింగనమల మండలం ఈస్ట్‌ నరసాపురం)
వృత్తి     :  లెక్చరర్‌ 
పెద్ద నాన్న    : వెంకయ్య రిటైర్డు ఐజీ 
సంతానం    : కుమారుడు విరాట్‌
రాజకీయ ప్రవేశం: 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సాగునీటి  సాధనకు నియోజకవర్గంలో పాదయాత్ర, పింఛన్‌దారులకు న్యాయం చేయాలని తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేశారు.   

5.పుట్టపర్తి నియోజకవర్గం: దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

పేరు: దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
తండ్రి పేరు: వెంకట్రామిరెడ్డి
గ్రామం    : నల్లసింగయ్యగారిపల్లి, నల్లమాడ మండలం
భార్య     : అపర్ణారెడ్డి
పుట్టిన తేది    : 27–5–1971
వృత్తి     : కాంట్రాక్టర్‌  (2001 దాకా కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగి)
విద్యార్హత     : ఎంఎస్సీ., 
సంతానం     :  కిషన్‌రెడ్డి, కుమార్తె ఈషారెడ్డి
రాజకీయ అనుభవం : 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త కర్తగా కొనసాగుతున్నారు. 

6.ఉరవకొండ నియోజకవర్గం:  యల్లారెడ్డి గారి విశ్వేశ్వరరెడ్డి

పేరు: యల్లారెడ్డి గారి విశ్వేశ్వరరెడ్డి
పుట్టినతేది    : 25.02.1960
స్వగ్రామం    : రాకెట్ల, ఉరవకొండ మండలం 
తల్లిదండ్రులు: లలితమ్మ, నారాయణరెడ్డి
భార్య     : భువనేశ్వరి
సంతానం    : ప్రణయ్‌కుమార్‌రెడ్డి
విద్యాభ్యాసం:  ఎంఏ.,    
కుటుంబ సభ్యులు: ఒక అన్న, ఒక అక్క, ముగ్గురు తమ్ముళ్లు  
రాజకీయ అనుభవం : ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, సీపీఐ, సీపీఎం పార్టీల్లో పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం తరఫున ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో మరోసారి ఓటమిపాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందారు. 

7.గుంతకల్లు నియోజకవర్గం: యల్లారెడ్డి వెంకటరామిరెడ్డి

పేరు: యల్లారెడ్డి వెంకటరామిరెడ్డి
తల్లిదండ్రులు    : వై. భీమిరెడ్డి, వై. లలితమ్మ
పుట్టిన తేదీ    : 01–06–1959
పుట్టిన ఊరు    : ఆదోని 
భార్య    : వై.శారద (గృహిణి)
కుమారులు    : లేరు
కుమార్తెలు    : నైరుతి, నిషిత 
విద్యార్హత     : బీఏ.,  
రాజకీయ నేపథ్యం: వై.వెంకటరామిరెడ్డి తండ్రి వై.భీమిరెడ్డి రైతు కుటుంబం. భీమిరెడ్డి  ఉరవకొండ ఎమ్మెల్యేగా పని చేసిన రాజకీయ అనుభవం ఉంది. సోదరులు శివరామిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఇక వై.వెంకటరామిరెడ్డి 2006లో కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా పని చేశారు. 2014 గుంతకల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

8.తాడిపత్రి నియోజకవర్గం: కేతిరెడ్డి పెద్దారెడ్డి

పేరు: కేతిరెడ్డి పెద్దారెడ్డి
పుట్టిన తేది    :   01–06–1965
జన్మస్థలం    : తిమ్మంపల్లి, యల్లనూరు మండలం
తల్లిదండ్రులు :  కేతిరెడ్డి రామిరెడ్డి, చిన్ననాగమ్మ 
భార్య    : రమాదేవి
సంతానం    : హర్షవర్దన్‌రెడ్డి, సాయిప్రతాప్‌రెడ్డి
వృత్తి    : వ్యవసాయం
రాజకీయ అనుభవం : గతంలో యల్లనూరు ఎంపీపీగా పని చేశారు. 2016 నుంచి తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 

9.రాయదుర్గం నియోజకవర్గంకాపు రామచంద్రారెడ్డి

పేరు: కాపు రామచంద్రారెడ్డి
తల్లిదండ్రులు :  కాపు గంగమ్మ, కాపు చిన్న తిమ్మప్ప 
విద్యార్హత       : ఎంకాం., (కర్ణాటక యూనివర్సిటీ) బీఎల్‌., ఐఎస్‌సీ (గుల్బర్గా యూనివర్సిటీ)  
పుట్టిన తేదీ : 06–10–1964 
వృత్తి             : న్యాయవాది 
భార్య     :  కాపు భారతి  
సంతానం:    ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, స్రవంతి 
రాజకీయ అనుభవం: వృత్తి రీత్యా న్యాయవాది. 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే ఏడాది రాయదుర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2012 జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. పలు సేవా కార్యక్రమాలకు తన సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్నారు.

10.రాప్తాడు నియోజకవర్గం: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

పేరు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
తల్లిదండ్రులు    :  ప్రేమకుమారి, ఆత్మారామిరెడ్డి 
భార్య    : మనోరమ
సంతానం    : సాయిసిద్ధార్థరెడ్డి,  ఇందిరాప్రియదర్శిని
పుట్టిన తేదీ    : 06–06–1973 
స్వస్థలం    : తోపుదుర్తి గ్రామం, ఆత్మకూరు మండలం 
విద్యార్హత    : బీఈ ( బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)  
రాజకీయ అనుభవం: 2009లో కాంగ్రెస్‌ తరఫున రాప్తాడు అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థి పరిటాల సునీతపై తక్కువ ఓట్ల(1950)తో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో రాప్తాడు నుంచే పోటీపడగా పరిటాల సునీత చేతిలో 7774 ఓట్ల తేడాతో ఓటమిచెందారు. రెండు సార్లు ఓడిపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతోపాటు పార్టీలో చురుకైన నాయకుడిగా పేరుపొందారు.   

11.అనంతపురం నియోజకవర్గం: అనంత వెంకట్రామిరెడ్డి

పేరు: అనంత వెంకట్రామిరెడ్డి
తల్లిదండ్రులు : అనంత వెంకటసుబ్బమ్మ, అనంత వెంకటరెడ్డి 
పుట్టినతేది      : 01–08–1956 
విద్యార్హత      : ఎంఏ, బీఎల్‌ 
భార్య      : ఎ.రమా 
కూతుళ్లు      :  నందిత, నవ్యత 
సోదరులు     : అనంత సుబ్బారెడ్డి, అనంత చంద్రారెడ్డి 
వృత్తి     : న్యాయవాది
రాజకీయ అనుభవం: 1987 నుంచి 1996 వరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) ప్రధానకార్యదర్శిగా పని చేశారు. 1996, 1998, 2004, 2009లలో అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ తరఫున 2014లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా, అనంతపురం అర్బన్‌ సమన్యయకర్తగా కొనసాగతున్నారు.  

12.కళ్యాణదుర్గం నియోజకవర్గం: ఉషశ్రీచరణ్‌ 

పేరు: ఉషశ్రీచరణ్‌ 
తల్లిదండ్రులు : రత్నమ్మ, కె.విరూపాక్షప్ప 
భర్త పేరు     : శ్రీచరణ్‌ 
పుట్టిన తేదీ    : 16–07–1976 
సంతానం     : కుమారుడు దివిజిత్‌ శ్రీచరణ్, కుమార్తె జయనా శ్రీచరణ్‌ 
విద్యార్హత     : ఎమ్మెస్సీ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌   
వృత్తి     : వ్యాపారం 
రాజకీయ అనుభవం: 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి లెక్కకు మించి ఉద్యమాలు చేపట్టారు. స్థానిక పార్టీ నాయకులతో పరిచయాలు పెంచుకుని, నియోజకవర్గ స్థితిగతులు, రాజకీయ పరిస్థితులతపై అవగాహన పొందారు.   

13.హిందూపురం నియోజకవర్గం: మహ్మద్‌ ఇక్బాల్‌

పేరు: మహ్మద్‌ ఇక్బాల్‌
తల్లిదండ్రులు: గౌస్‌సాహెబ్‌ , నిషాద్‌ జహాన్‌
సంతానం    : నిఖాద్‌ జహాన్‌
పుట్టినతేది    : 26.04.1958
విద్యార్హత     : ఎంఏ, పొలికటిల్‌ సైన్సు హిందూపురంలో ఎస్‌డీజీఎస్‌ కళాశాలలో  ఇంటర్‌(బైపీసీ) చదివారు.
ఉద్యోగం     : పోలీస్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు
రాజకీయ రంగప్రవేశం : 2018 మే 16న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక. పోలీసు అధికారిగా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.    

14.కదిరి నియోజకవర్గం:  డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి

పేరు: డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి
తల్లిదండ్రులు: కమలమ్మ, చిన్న గంగిరెడ్డి
పుట్టిన తేదీ    : 04–08–1968
వయసు    : 51
భార్య    : డా.ఉషారాణి
పిల్లలు    : ఇద్దరు 1. ద్యుతి (యుఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)  2. ప్రణతి (మెడిసిన్‌ చదువుతోంది)
రాజకీయ అనుభవం: 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేశారు.  తర్వాత వైఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చాంద్‌బాషాను గెలిపించుకోవడంలో ఈయన కీలక భూమికను పోషించారు. 2016 నుంచి∙వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తున్నారు.  

-------------------

చిత్తూరు జిల్లా

అసెంబ్లీ
నగరి  
పేరు     : ఆర్‌కే రోజా (శ్రీలత)
భర్త      : ఆర్‌కే సెల్వమణి,
పిల్లలు    : ఇద్దరు
స్వగ్రామం    : నగరి
పుట్టిన తేదీ     : 17.11.1972
విద్యార్హత     : బీఎస్సీ (హోం సైన్స్‌),పద్మావతి డిగ్రీ కళాశాల, తిరుపతి
పదవులు     : వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాసనసభ కమిటీ సభ్యురాలు.

గంగాధరనెల్లూరు 
పేరు    : కళత్తూరు నారాయణస్వామి
పుట్టిన తేదీ    : 01–06–1949
జన్మస్థలం    : పాదిరికుప్పం
భార్య    :  పరంజ్యోతి
చదువు    : బీఎస్సీ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

మదనపల్లె  
అభ్యర్థి పేరు    : మహమ్మద్‌ నవాజ్‌ బాషా
స్వగ్రామం    : మదనపల్లె
పుట్టిన తేదీ    : 02–10–1973
భార్య    : ఎం.ఫర్మీనా యాస్మీన్‌
చదువు    : పదో తరగతి
వృత్తి     : పారిశ్రామిక వేత్త
రాజకీయ నేపథ్యం  : మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి.

 చిత్తూరు  
పేరు     : ఆరణి శ్రీనివాసులు (జంగాపల్లె శ్రీనివాసులు)
పుట్టిన తేదీ : 15.05.1952
చదువు     : బీఏ
స్వస్థలం     : జంగాలపల్లి
సామాజికవర్గం : బలిజ (కాపు)
సతీమణి      : ఆరణి సత్యవతి
పిల్లలు     : ఇద్దరు
రాజకీయ నేపథ్యం: ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

శ్రీకాళహస్తి  
పేరు    : బియ్యపు మధుసూదన్‌రెడ్డి
జననం    : 15.05.1971
పుట్టిన గ్రామం    : అమ్మపాళెం, శ్రీకాళహస్తి మండలం
భార్య    : బియ్యపు శ్రీవాణిరెడ్డి
పిల్లలు    : ఇద్దరు
విద్యార్హత    : బీఏ
రాజకీయ అనుభవం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. జగన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించి సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు.

పుంగనూరు
పేరు    : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుట్టిన తేదీ    : 01–07–1952
భార్య    : స్వర్ణలత
పిల్లలు    : ఇద్దరు
విద్యార్హత    : ఎంఏపీహెచ్‌డీ(సోషియాలజీ)
రాజకీయ నేపథ్యం:  2008లో పీసీసీ ఉపాధ్యక్షుడుగా, 2009లో పుంగనూరు ఎమ్మెల్యేగా, వైఎస్సార్, రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు

తిరుపతి
అభ్యర్థి: భూమన కరుణాకరరెడ్డి
చదువు: బీఏ
పుట్టిన తేదీ: 05–04–1958
పుట్టిన ఊరు: రేణిగుంట
వృత్తి: రాజకీయం
భార్య పేరు:  రేవతి
పిల్లలు: ఇద్దరు
రాజకీయానుభవం: తుడా చైర్మన్, టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2012లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

చంద్రగిరి   
పేరు: డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
పుట్టిన తేదీ     : 04–06–1973
చదువు: ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ
భార్య: లక్ష్మి
పిల్లలు: ఇద్దరు
స్వగ్రామం: తుమ్మలగుంట, తిరుపతి రూరల్, చిత్తూరు జిల్లా
పదవులు: తుడా చైర్మన్‌ (2007–2010)
టీటీడీ బోర్డు సభ్యుడు (2007–2010)
చంద్రగిరి శాసనసభ్యుడు ( 2014–2019)

సత్యవేడు  
పేరు    : కోనేటి ఆదిమూలం
స్వగ్రామం    : నారాయణవనం మండలం భీముని చెరువు గ్రామం
పుట్టిన తేదీ     : 03–04–1952
భార్య    : కె.గోవిందమ్మ
పిల్లలు    : నలుగురు
విద్యార్హత    : బీఏ
రాజకీయ అనుభవం:  వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీల హక్కుల కోసం పోరాడుతున్నారు.

పలమనేరు  
పేరు    : నల్లప్పగారి వెంకటేగౌడ
భార్య    : పావని
పిల్లలు    : ఇద్దరు
స్వగ్రామం    : తోటకనుమ,

వీకోట మండలం
విద్యార్హత    : బీఏ
యాక్టివిటీస్‌    : ఐదేళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వృత్తి    : వ్యాపార వేత్త

తంబళ్లపల్లె  
పేరు: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
పుట్టిన తేదీ: 1–6–1967
జన్మస్థలం: సదుం
భార్య: పెద్దిరెడ్డి కవిత
పిల్లలు: ఒక కుమారుడు
రాజకీయ అనుభవం: సదుం సింగిల్‌విండో చైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్‌ సోసైటీ చైర్మన్‌గా పనిచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు.

పీలేరు
అభ్యర్థిపేరు: చింతల రామచంద్రారెడ్డి
పుట్టిన తేదీ: 13.09.1962
విద్యార్హత: బీఏ
భార్య: నీరజమ్మ,
కొడుకు: సాయికృష్ణారెడ్డి చింతల
జన్మస్థలం: వాయల్పాడు
రాజకీయ అనుభవం: మూడు పర్యాయాలు ఎమ్మెల్యే(1987,1994,2014)

కుప్పం  
పేరు :  చంద్రమౌళి
భార్య:  పద్మజ
పిల్లలు: ఇద్దరు
స్వగ్రామం:  చిత్తూరు
పుట్టిన తేదీ     : 01–07–1953
విద్యార్హత : ఎం.ఏ, ఎస్వీయూనివర్సిటీ
వృత్తి :  రిటైర్డు ఐఏఎస్‌ ఆఫీసర్‌
రాజకీయానుభవం: 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై పోటీ చేశారు. దాదాపు 10 వేల ఓట్ల వరకు చీల్చగలిగారు.
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా         పనిచేస్తున్నారు.

పూతలపట్టు  
నియోజకవర్గం :పూతలపట్టు
పేరు: ఎంఎస్‌.బాబు
పుట్టిన తేదీ     : 04–03–1971
భార్య పేరు: ఎం.బీల
పిల్లలు : ఇద్దరు
స్వగ్రామం: 5 వెంకటాపురం, పిళ్లారిమిట్ట
చదువు: ఇంటర్మీడియెట్‌
వృతి : వ్యాపారం
రాజకీయ అనుభవం  :
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు 

------------------------------

krishna district

పెడన : జోగి రమేష్‌  

పేరు: జోగి రమేష్‌  
తల్లిదండ్రులు : జోగి మోహనరావు, పుష్పవతి 
భార్య : శకుంతల దేవి
సంతానం: జోగి రాజీవ్, జోగి రోహిత్‌కుమార్, జోగి రేష్మాప్రియాంక 
విద్యార్హతలు: బీఎస్సీ
నేపథ్యం:
 యూత్‌కాంగ్రెస్‌ కార్యకర్తగా, నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కృష్ణాజిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పెడన అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్‌ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ నుంచి పెడన అసెంబ్లీ  బరిలో ఉన్నారు.

తిరువూరు (ఎస్సీ): కొక్కిలిగడ్డ రక్షణనిధి

పేరు: కొక్కిలిగడ్డ రక్షణనిధి
తల్లిదండ్రులు : ప్రసాదు, సూర్యకాంతమ్మ
భార్య పేరు    :మరియమ్మ
పుట్టినతేదీ    :    1.10.1968
నేపథ్యం:
 2001–2006 తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం సర్పంచిగా, 2006–2011లో పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి విశేష కృషి చేశారు. మరోసారి తిరువూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ప్రజా సమస్యలును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

గుడివాడ:  కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)

పేరు : కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
తండ్రిపేరు : కొడాలి అర్జునరావు 
తల్లి : వింధ్యారాణి  
భార్యా : అనుపమ
సంతానం : ఇద్దరు అమ్మాయిలు
పుట్టిన తేదీ: 22–10–1971
నేపథ్యం : 
1998లో తెలుగు యువత కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. గుడివాడ నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014లలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కఠారి ఈశ్వర్‌కుమార్‌పై, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై, 2014లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.
ప్రస్తుత హోదా : అసెంబ్లీలో వైఎస్సార్‌ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ 

జగ్గయ్యపేట : సామినేని ఉదయభాను

పేరు : సామినేని ఉదయభాను
తల్లిదండ్రులు : సామినేని విశ్వనాథం, పద్మావతి
భార్య: సామినేని విమలా
సంతానం: సామినేని వెంకట కృష్ణప్రసాద్‌
సామినేని ప్రశాంత్‌ బాబు
సామినేని ప్రియాంక
వయస్సు: 63
చదువు: బీకాం
నేపథ్యం: 
 1975 నుంచి 1977 వరకు ఎస్‌జీఎస్‌ ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989 నుంచి 96 వరకు యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా, 1997లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, 1998 లో పీసీసీ కార్యదర్శిగా నియమితులైనారు. 1999, 2004లో పోటీ చేసి రెండవసారి గెలుపొందిప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు.

నూజివీడు  : మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 

పేరు : మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 
తల్లిదండ్రులు: వేణుగోపాల అప్పారావు, రమణాయమ్మ
భార్య:సుజాత(లేటు)
 పుట్టిన తేదీ:11–8–1953
విద్యార్హతలు: బీకాం
స్వగ్రామం: నూజివీడు
నేపథ్యం: 
మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 1983లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో టీడీపీలో చేరారు. అరు పదవులు చేశారు. 1999లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి 40వేల ఓట్లతో గెలుపొంది సంచలనం సృష్టించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి నూజివీడు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో మరలా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి 10,500 మెజారిటీతో గెలుపొంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 

కైకలూరు  : దూలం నాగేశ్వరరావు

పేరు : దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌)
తల్లిదండ్రులు : దూలం వీరన్న,  బూసమ్మ
భార్య : వీరకుమారి 
కుమారులు : వీర ఆది వినయ్‌కుమార్, వీర శ్యామ్‌ ఫణికుమార్‌
కోడళ్లు : అనుపమా, స్వాతి 
జననం : 09–06–1957 
వయస్సు  : 62
విద్యార్హత :  హైస్కూల్‌ చదువు
వృత్తి : ఆక్వా రైతు,   ఫ్యాక్టరీల యజమాని
నేపథ్యం:
2006–2011 వరకు కైకలూరు సర్పంచ్‌గా పనిచేశారు. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘ ఉపా«ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 
1987–88 వరకు కైకలూరులోని వేంకటేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్‌గా పనిచేశారు. 

అవనిగడ్డ : సింహాద్రి రమేష్‌బాబు

పేరు: సింహాద్రి రమేష్‌బాబు
తల్లిదండ్రులు: వెంకటేశ్వరరావు, భారతి
భార్య: కెప్టెన్‌ లక్ష్మి
పిల్లలు: కుమార్తెలు (ఉజ్వల, సహజ, నిశ్చల), 
కుమారుడు :      వికాస్‌ 
పుట్టినతేదీ: 22–07–1956
విద్యార్హత: బీఏ
రాజకీయ పదవులు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి
నేపథ్యం:
కమ్యూనిస్టు నేత సనకా బుచ్చికోటయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు.పులిగడ్డ–పెనుమూడి వారధి నిర్మించాలంటూ  సాధన కమిటీ కన్వీనర్‌గా 63 రోజులు రిలే నిరాహార దీక్ష చేశారు. 2009 ఎన్నికల్లో  అవనిగడ్డ నుంచి ప్రజారాజ్యం తరఫున , 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి చెందారు. 

మైలవరం : వసంత వెంకట కృష్ణప్రసాద్‌

పేరు: వసంత వెంకట కృష్ణప్రసాద్‌
తల్లిదండ్రులు : వసంత నాగేశ్వరరావు, హైమావతి
భార్య :   వసంత శిరీష
పిల్లలు : ఇద్దరు పిల్లలు
పుట్టిన తేదీ: ఏప్రిల్‌ 8, 1970
గ్రామం: ఐతవరం, నందిగామ మండలం, కృష్ణా జిల్లా 
వృత్తి: పారిశ్రామికవేత్త. చిలుకలూరిపేటలో స్పిన్నింగ్‌ మిల్, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నారు.
నేపథ్యం: 
తండ్రి వసంత నాగేశ్వరరావు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసి నందిగామ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం వ్యాపారంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం మైలవరం నుంచి అవకాశం లభించడంతో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై వసంత పోటీ చేస్తున్నారు.

మచిలీపట్నం : పేర్ని వెంకట్రామయ్య (నాని)

పేరు : పేర్ని వెంకట్రామయ్య (నాని)
తల్లిదండ్రులు : పేర్ని కృష్ణమూర్తి, నాగేశ్వరమ్మ
భార్య : జయసుధ
కుమారుడు :    కృష్ణమూర్తి
పుట్టిన తేది : 21–12–1965
విద్యార్హత : బికాం
నేపథ్యం : 
పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికి పుచ్చుకున్న ఆయన 1999లో కాంగ్రెస్‌ పార్టీ తరçఫున బందరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2014 నుంచి వైఎస్సార్‌ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

పామర్రు (ఎస్సీ)  : కైలే అనిల్‌కుమార్‌ 

పేరు : కైలే అనిల్‌కుమార్‌ 
తల్లిదండ్రులు : కైలే సంజీవరావు, జ్ఞానమణి
భార్య : హేమలీన
కుమార్తె :  ఆరాధ్య
పుట్టిన తేదీ : 13–02–1977
విద్యార్హత : ఎంసీఏ
నేపథ్యం:  
చిన్న నాటి నుంచే తన తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత ఈయనను  వైఎస్సార్‌ సీపీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. 
అనిల్‌ తల్లి కైలే జ్ఞానమణి వైఎస్సార్‌సీపీ తరపున బాపులపాడు మండలం జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలుగా, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. 

విజయవాడ పశ్చిమ : వెలంపల్లి శ్రీనివాసరావు

పేరు : వెలంపల్లి శ్రీనివాసరావు
తల్లిదండ్రులు: వెలంపల్లి సూర్యనారాయణ, మహాలక్ష్మి
భార్య పేరు : వెలంపల్లి శ్రీవాణి
పిల్లలు: ఒక కుమారుడు, కుమార్తె (కుమారుడు మరణించాడు)
పుట్టిన తేదీ: 15–08–1971
విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణత
వృత్తి : వస్త్ర వ్యాపారంతోపాటు మరికొన్ని వ్యాపారాలు
రాజకీయ నేపథ్యం:
 2009లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాగా ఆ పార్టీలో కొనసాగారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు.

నందిగామ (ఎస్సీ) : డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు

పేరు: డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు
తల్లిదండ్రులు : మొండితోక కృష్ణ, కస్థాల మరియమ్మ
భార్య: డాక్టర్‌ రమాదేవి
సంతానం: శివసాయి కృష్ణ, సమీరకృష్ణ
స్వగ్రామం : చందర్లపాడు, కృష్ణా జిల్లా
విద్యార్హత : ఎండీ (చెస్ట్‌ ఫిజీషియన్‌)
వృత్తి : వైద్యుడు
నేపథ్యం:
 మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షితులై 2013లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఆస్పత్రి ఏర్పాటు చేసి  వైద్యడిగా సేవలందిస్తున్నారు.

గన్నవరం : యార్లగడ్డ వెంకట్రావు

పేరు: యార్లగడ్డ వెంకట్రావు
తల్లిదండ్రులు: యార్లగడ్డ రామశేషగిరిరావు, లక్ష్మీసామ్రాజ్యం
భార్య: జ్ఞానేశ్వరి
కుమారై: శ్రీసహస్ర
కుమారుడు: సహర్హరామ్‌
చదవు: బీఎస్సీ (ఐటీ ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ)
కుటుంబ నేపథ్యం: వ్యవసాయం
వ్యాపారం: ఐటీ రంగం
నేపథ్యం:
యార్లగడ్డ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
హాబీలు: క్రికెట్, పుస్తకాలు చదవడం, విశ్లేషణలు రాయడం, ఒంగోలు జాతి ఎడ్ల పోషణ

విజయవాడ తూర్పు :  బొప్పన భవకుమార్‌
 

అభ్యర్థి:  బొప్పన భవకుమార్‌ 
తండ్రి: బొప్పన రామమోహనరావు
తల్లి: బొప్పన స్వర్ణలతాదేవి
భార్య: బొప్పన రత్నకుమారి
పిల్లలు: ఒక కుమార్తె(అమృత)
విద్యార్హత: బీ కాం
స్వస్థలం: పటమట 
పుట్టినతేది : 24–01–1963
పదవులు :
 1982లో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  తరఫున 3వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 

విజయవాడ సెంట్రల్‌ : మల్లాది విష్ణువర్థన్‌

పేరు : మల్లాది విష్ణువర్థన్‌
తల్లిదండ్రులు : సుబ్బారావు, సుందరమ్మ
భార్య : కిరణ్మయి
ఇద్దరు కుమార్తెలు : లక్ష్మీచంద్రిక, లలితా నాగదుర్గ
పుట్టిన తేదీ: 20–6–1963
విద్యార్హతలు : బీకాం  
రాజకీయ నేపథ్యం: 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. 2004నుంచి 2008 వరకు చైర్మన్‌గా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 నుంచి 17 వరకు కాంగ్రెస్‌పార్టీ విజయవాడ నగర అ««ధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

పెనమలూరు : కొలుసు పార్థసారథి

పేరు : కొలుసు పార్థసారథి
తండ్రి పేరు : కొలుసు పెద రెడ్డయ్య
తల్లి పేరు : సామ్రాజ్యం
భార్య : కె.కమల లక్ష్మి
కుమారుడు : నితిన్‌ కృష్ణ
పుట్టిన తేదీ : 18–04–1965
స్వగ్రామం : కారకంపాడు, మొవ్వ మండలం, కృష్ణాజిల్లా
విద్యాభ్యాసం : బీటెక్‌ 
నేపథ్యం :
 మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కొలుసు పెద రెడ్డియ్య కుమారుడైన పార్థసారథి తొలుత ఉయ్యూరు నుంచి 2001 సెప్టెంబరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. 2004లో  ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన కారణంగా 2009లో పెనమలూరు నుంచి విజయం సాధించారు. వైఎస్‌ శిష్యుడైన పార్థసారథి పెద్దాయన హయాంలో తొలుత పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో మాథ్యమిక శాఖ మంత్రిగా, 2012లో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

------------------------

East godavari district

రాజమహేంద్రవరం రూరల్‌ - ఆకుల వీర్రాజు


అభ్యర్థి: ఆకుల వీర్రాజు
వయస్సు: 68 విద్యార్హత:  సెవెన్త్‌ ఫారమ్‌
నేపథ్యం : పండ్ల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచారు.
రాజమహేంద్రవరం ఛాంబర్‌ఆఫ్‌కామర్స్‌ అధ్యక్షునిగా రెండుసార్లు వ్యవహరించారు.  రాజమహేంద్రవరం నగరంతో పాటు, పరిసర ప్రాంతాలలో పలు యూనియన్లకు గౌరవాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు సన్నిహితునిగా ఉంటూ, నగర కాంగ్రెస్‌ బ్లాక్‌ –1 కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో వై ఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 18,282 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ప్రజాసమస్యలపై ఉద్యమించారు. 

రాజమహేంద్రవరం సిటీ - రౌతు సూర్యప్రకాశరావు


అభ్యర్థి :  రౌతు సూర్యప్రకాశరావు  
జననం: 18.06.1958 విద్యార్హతలు : బీకాం, బీఎల్‌
తల్లిదండ్రులు : రౌతు తాతాలు, పార్వతమ్మ
కుటుంబం: భార్య సౌభాగ్యలక్ష్మి, కుమారుడు వరుణ్‌బాబు, కుమార్తె సౌజన్య
రాజకీయ నేపథ్యం: స్డూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా, కాంగ్రెస్‌ నగర అ«ధ్యక్షునిగా వ్యవహరించారు. ఆంధ్రకేసరి యువజన సమితి లో పలు పదవులు నిర్వర్తించారు. చాంబర్‌ ఆఫ్‌  కామర్స్‌ అధ్యక్షుడు, కోస్తా జిల్లాల వర్తక సంఘం అధ్యక్షుడు (1989–1999), ఎపెక్స్‌ క్లబ్‌ చైర్మన్,(1987–88), జిల్లా ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు (1990–2004) రాజమహేంద్రవరం  ఎమ్మెల్యే (2004–2011), తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు(2011, 2012), స్టేట్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ చైర్మన్‌( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌), గోదావరి స్విమ్మర్స్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షుడు.

రాజానగరం -  జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌


 అభ్యర్థి : జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌
తల్లిదండ్రులు: రామ్మోహనరావు, విజయలక్ష్మి
పుట్టిన తేదీ : 5 అక్టోబర్‌ 1988 విద్యార్హతలు : బీకాం, ఎం బీఏ, కుటుంబం : భార్య డాక్టర్‌ రాజశ్రీ, ఇద్దరు కుమార్తెలు
రాజకీయ నేపథ్యం: తండ్రి రామ్మోహనరావు పూర్వపు కడియం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ మంత్రి మండలిలో ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా పని చేశారు. తల్లి విజయలక్ష్మి
2009 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014 ఎన్నికల్లో రాజానగరం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 

అమలాపురం - పినిపే విశ్వరూప్‌


  అభ్యర్థి: పినిపే విశ్వరూప్‌
తల్లిదండ్రులు    : సీతమ్మ, రెడ్డి పంతులు
పుట్టిన తేదీ: 02.10.1962
విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ
భార్య : బేబి (మీనాక్షి)
రాజకీయ నేపథ్యం : 1987లో కాంగ్రెస్‌ నాయకునిగా రాజకీయ అరంగ్రేటం. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో  ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఆభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
ముమ్మిడివరం నుంచి (2004–09), అమలాపురం నుంచి (2009–14) ఎమ్మెల్యేగా ఉన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య ప్రభుత్వాలలో రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో 2010 నుంచి 2013 వరకు పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, వెటర్నరీ యూనివర్సిటీ మంత్రిగా పనిచేశారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఆది నుంచి మహానేత వైఎస్‌ విధేయుడిగా ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం తర్వాత అయిదు నెలల ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  రాష్ట్ర పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సభ్యునిగా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నియోజవర్గ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. 

అనపర్తి - డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి


     అభ్యర్థి: డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి
పుట్టిన తేదీ: 31.10.1961
తల్లిదండ్రులు: సీతయ్యమ్మ, గంగిరెడ్డి,     
విద్యార్హతలు:  ఎంబీబీఎస్, ఎంఎస్‌
(జనరల్‌ సర్జన్‌) 
కుటుంబం: భార్య: సత్తి ఆదిలక్ష్మి, 
కుమారుడు డాక్టర్‌ సత్తి గౌతమ్‌రెడ్డి, (ఎంబీబీఎస్, ఎంఎస్,   ఎంసీహెచ్‌(యూరాలజీ)
వైద్య సేవలు:  తండ్రి సత్తి గంగిరెడ్డి పేరున 
15.11.1991న అనపర్తిలో గంగిరెడ్డి నర్సింగ్‌ హోమ్‌ ప్రారంభించారు. 21.06.1995లో నిర్మించిన సొంత భవనంలో 80 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.
రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నా పరోక్షంగా తన పినతండ్రి, జిల్లా పరిషత్‌ మాజీ ప్రతిపక్ష నాయకుడు సత్తి రామారెడ్డి, తన మేనమామ, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డిల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన వంతు తోడ్పాటును అందించారు. జగన్‌ కాంగ్రెస్‌ను వీడిన వెంటనే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి తన సతీమణి, అప్పటి అనపర్తి మండల పరిషత్‌ ప్రతిపక్ష నాయకురాలు సత్తి ఆదిలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు.  ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన పాత్రను పోషించారు.

పెద్దాపురం- తోట సరస్వతి (వాణి)

అభ్యర్థి: తోట సరస్వతి (వాణి)
వయస్సు: 48, విద్యార్హత : డిగ్రీ
తండ్రి: మెట్ల సత్యనారాయణ (మాజీ మంత్రి)
భర్త  : తోట నరసింహం ( మాజీ మంత్రి,  ఎంపీ)
రాజకీయనేపథ్యం : 2014లో వీరవరం  పంచాయతీ సర్పంచ్‌. తండ్రి మెట్ల  కోనసీమలో  సీనియర్‌ నాయకుడు. ఆమె భర్త నరసింహంకు 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చారు. 2009లో తిరిగి పోటీ చేసి విజయం సాధించి,  స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా పని చేశారు.  కాంగ్రెస్‌ను వీడి టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని విస్మరించిన చంద్రబాబు తీరుతో టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు.      

రామచంద్రపురం - చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ


 అభ్యర్థి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
పుట్టిన తేదీ: 23.12.1962, విద్యార్హత : బీఏ
కుటుంబం : భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు–నరీన్, ఉమాశంకర్‌. చేపట్టిన పదవులు: 1999 నుంచి ఇప్పటివరకు ఏపీ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, 2001 నుంచి 2006 వరకు రాజోలు నుంచి జెడ్పీటీసీ సభ్యుడు. 2006లో తిరిగి రాజోలు నుంచి జడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.  2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 

కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి


అభ్యర్థి: ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
తండ్రి : ద్వారంపూడి భాస్కరరెడ్డి
పుట్టిన తేదీ: 8.7.1967
విద్యార్హత: బీకాం
కుటుంబం: భార్య మహాలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు
రాజకీయ నేపథ్యం : 1988లో స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ సెక్రటరీ, 2000–2009 పీసీసీ మెంబర్, 2000 నుంచి 2006 వరకూ కాకినాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, 2005లో హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్, 2009 నుంచి 2014 వరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ద్వారంపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మున్సిపల్‌ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ.

 కాకినాడ రూరల్‌ - కురసాల కన్నబాబు


 అభ్యర్థి: కురసాల కన్నబాబు
వయస్సు : 46
విద్యార్హత: బీకాం,  ఎంఏ
తల్లిదండ్రులు: సత్యనారాయణ, కృష్ణవేణి
కుటుంబం : భార్య  శ్రీవిద్య, కుమార్తె సిరి
రాజకీయ నేపథ్యం : ఈనాడు సంస్థలో సాధారణ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌ స్థాయికి ఎదిగారు, 2009లో  మెగాస్టార్‌  చిరంజీవి  ఆశీస్సులతో కాకినాడ రూరల్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా  పోటీ చేసి గెలుపొందారు. 2014లో పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మూడవ స్థానంలో నిలిచారు. అనంతరం వైఎస్సార్‌ సీపీలో చేరి కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా, కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.  

కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి 


అభ్యర్థి : చిర్ల జగ్గిరెడ్డి 
పుట్టిన తేదీ: 26.11.1970
విద్యార్హత : ఎంబీఏ
తల్లిదండ్రులు: రాధాదేవి, సోమసుందరరెడ్డి  
కుటుంబం: భార్య: లావణ్య, కుమారుడు సోమసుందరరెడ్డి, కుమార్తె శ్రీనిధిరెడ్డి
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తాత చిర్ల జగ్గిరెడ్డి 1957కి ముందు గోపాలపురం సర్పంచ్‌గా, 1987లో కొత్తపేట పంచాయతీ సమితి  ప్రథమ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన వారసునిగా సోమసుందరరెడ్డి  రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తొలుత 1983లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్‌ నుంచి  ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సేవలో గడిపారు. సోమసుందరరెడ్డి  వారసునిగా కుమారుడు జగ్గిరెడ్డి 2001లో రాజకీయ అరంగేట్రం చేసి  రావులపాలెం  జడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014  ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే విజయం సాధించారు.

పిఠాపురం - పెండెం దొరబాబు


అభ్యర్థి : పెండెం దొరబాబు
పుట్టినతేదీ : జనవరి 12, 1959 విద్యార్హత : డిగ్రీ
తల్లిదండ్రులు : వీరరాఘవరావు, వీరరాఘవమ్మ
కుటుంబం : భార్య అన్నపూర్ణ, కుమార్తె సత్యఅనంతలక్ష్మీదేవి (అర్షిత)
రాజకీయ నేపథ్యం: దొరబాబు తండ్రి పెద వీరరాఘవరావు కాకినాడ సర్పవరం సొసైటీ అధ్యక్షునిగా 25 ఏళ్లు పనిచేయగా సోదరుడు సుబ్బారావు 5 ఏళ్లు సొసైటీ అధ్యక్షునిగా పని చేశారు.  1999లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో తిరిగి ఆ పార్టీ నుంచే  గెలుపొందారు. 2009లో వైఎస్‌  ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.  2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేశారు. 

మండపేట -  పిల్లి సుభాష్‌చంద్రబోస్

అభ్యర్థి: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
వయస్సు : 69 సంవత్సరాలు
విద్యార్హత : బీఎస్సీ
తల్లిదండ్రులు: ముత్యాలమ్మ, సూర్యనారాయణ
కుటుంబం : భార్య సత్యనారాయణమ్మ,  ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
రాజకీయ నేపథ్యం: రాయవరం మునసబు వుండవిల్లి సత్యనారాయణమూర్తిని రాజకీయ గురువుగా భావిస్తారు. జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ (1978), హసన్‌బాద సర్పంచ్‌ (1983).
ఎమ్మెల్యేగా మొట్టమొదట రామచంద్రపురం నుంచి 1985లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2004లో ఇండిపెండెంట్‌గా, 2009లో తిరిగి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి రామచంద్రపురం నుంచి పోటీ చేశారు. 2006లో మంత్రి పదవి చేపట్టి 2009 ఫిబ్రవరి వరకు, తిరిగి 2009 మే నుంచి 2010 డిసెంబర్‌ వరకు మంత్రిగా ఉన్నారు. 

ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌


అభ్యర్థి : పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌
పుట్టిన తేదీ: 14.2.1973 విద్యార్హత: బీకాం
తల్లిదండ్రులు: సత్యారావు, రామానుజమ్మ,
కుటుంబం: భార్య నీరజ, కుమారులు సత్య సుమంత్, రేవంత్,
రాజకీయ నేపథ్యం:  2009లో దివగంత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేపి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

జగ్గంపేట - జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండరావు (చంటిబాబు)


అభ్యర్థి: జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండరావు (చంటిబాబు)  

పుట్టిన తేదీ : 08.10.1978 విద్యార్హత : ఎంఏ (పాలిటిక్స్‌)
తల్లిదండ్రులు:  అన్నపూర్ణ, రామస్వామి
కుటుంబం: భార్య నాగసూర్యవేణి, కుమార్తె, కుమారుడు.
రాజకీయ నేపథ్యం : చంటిబాబు తండ్రి రామస్వామి సొసైటీ అధ్యక్షునిగా పని చేశారు. చంటిబాబు 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌గా వ్యవహరించారు. 

పి.గన్నవరం - కొండేటి చిట్టిబాబు


 అభ్యర్థి : కొండేటి చిట్టిబాబు
పుట్టిన తేదీ : 1, ఏప్రిల్‌ 1963
విద్యార్హత : ఎంఏ
తండ్రి : నాగేశ్వరరావు
కుటుంబం: భార్య లక్ష్మి, కుమారులు వికాస్‌బాబు, స్టాలిన్‌బాబు, కుమార్తె దేవీప్రియాంక 
రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశలో పలు సమస్యలపై  పోరాటం చేశారు. మొదట్లో కాంగ్రెస్‌లో ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వైఎస్సార్‌ సీపీ  ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో  చురుగ్గా పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పి.గన్నవరం నుంచి పోటీ చేశారు.   

రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మి


 అభ్యర్థి: నాగులపల్లి ధనలక్ష్మి
తల్లిదండ్రులు: రాఘవ, వీరబ్బాయిదొర 
పుట్టిన తేదీ:  06.12.1984
విద్యార్హతలు: బిఏ(తెలుగు లిటరేచర్‌), బీఈడీ
నేపథ్యం:  2013 ఆగస్టులో రంపచోడవరం మండలం ఎర్రంపాలెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా   చేరారు. 2018 జూన్‌లో  ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు.  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్ర సాగించేటప్పుడు  రావుపాలెంలో పార్టీలో చేరారు. ధనలక్ష్మి తల్లి రాఘవ గొండోలు సర్పంచ్‌గా 2001 నుంచి 2006 వరకు, 2013 నుంచి 2018 వరకు పనిచేశారు. 

రాజోలు - బొంతు రాజేశ్వరరావు


అభ్యర్థి : బొంతు రాజేశ్వరరావు
పుట్టిన తేదీ: 28.6.1953
తల్లిదండ్రులు:   విక్టోరియమ్మ, ప్రభాకరరావు,
చదువు: ఎంటెక్‌ 
కుటుంబం: భార్య అరుణకుమారి
కుమార్తెలు: భార్గవి, ఈశ్వరి ప్రియాంక, కుమారుడు: సాయి వెంకట్‌
ఉద్యోగ, రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా రిటైరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 19,545 జనావాసాలకు తాగునీటి వసతి కల్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూప కల్పన చేశారు. స్వయం సహాయక గ్రూపుల నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి తదితర అంశాలపై ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. అనంతరం జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున రాజోలు నుంచి పోటీ చేసి 4,808 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

తుని -  దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)


అభ్యర్థి :  దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
పుట్టిన తేదీ : 19.07.1975
తల్లిదండ్రులు : సత్యనారాయణమ్మ, శంకర్రావు
విద్యార్హత  : బీఏ 
కుటుంబం : భార్య లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్‌ మల్లిక్, కుమార్తె ఆశ్రిత
రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. తుని నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం ప్రయత్నించారు. 2010లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున తుని అభ్యర్థిగా పోటీ చేసి యనమల రాకమకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడిపై విజయం సాధించారు

ప్రత్తిపాడు - పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌


అభ్యర్థి:  పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌
పుట్టిన తేదీ: 14–8–1964 
విద్యార్హత : ఇంటర్మీడియట్‌
కుటుంబం: భార్య సత్యవేణి, కుమార్తెలు నందిని, దీనా
రాజకీయ నేపథ్యం: 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. శంఖవరం పంచాయతీ ఉపసర్పంచ్‌గా పని చేశారు. ఆంధ్రా బ్యాంక్‌ ఎఫ్‌ఏసీఎస్‌ అ««ధ్యక్షుడిగా, జెడ్పీటీసీ సభ్యుడిగా, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్‌గా, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

--------------------------

prakasam

చీరాల


అభ్యర్థి పేరు : ఆమంచి కృష్ణమోహన్‌ 
పుట్టిన తేదీ : 22.08.1975 
విద్యార్హత: బీఎస్సీ
తల్లిదండ్రులు: వెంకటేశ్వర్లు, సుబ్బరావమ్మ
స్వగ్రామం: పందిళ్లపల్లి, వేటపాలెం మండలం.
కుటుంబం: భార్య సుజాత, ఇద్దరు కుమారులు ( సేతునాయుడు, వెంకటేశ్వర్లు)
స్వస్థలం : పందిళ్లపల్లి, వేటపాలెం మండలం
నేపథ్యం: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 2000లో రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన వేటపాలెం జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటికే కొణిజేటి రోశయ్యతో సత్సంబందాలు మెరుగ్గా ఉండటంతో 2006లో వేటపాలెంలోని దేశాయిపేట–2 నుంచి ఎంపీటీసీగా పోటీచేసి వేటపాలెం ఎంపీపీగా ఎన్నికయ్యారు. వేటపాలెం మండలంలో బలమైన నేతగా ఎదిగిన ఆయన 2004లో కొణిజేటి రోశయ్య చీరాలనుంచి పోటీ చేశారు. రోశయ్య విజయానికి కీలకంగా వ్యవహరించిన ఆమంచి కృష్ణమోహన్‌ రోశయ్య రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందారు. 2009లో ప్రత్యక్ష ఎన్నికలకు కొణిజేటి రోశయ్య దూరంగా కావడంతో రోశయ్య స్థానంలో చీరాల అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన జంజనం శ్రీనివాసరావుపై ఆమంచి గెలిచాడు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అలానే 2014 సార్వత్రి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి నవోదయం పార్టీ నుంచి పోటీచేసి 11వేల ఓట్లతో గెలుపొందాడు. రాష్ట్రంలోనే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందడంతో ఆమంచికి రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది. అనంతరం మూడున్నరేళ్ల క్రితం ఆమంచి టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీ తరపున చీరాల నుంచి పోటీ చేస్తున్నారు.

దర్శి

  
అభ్యర్ధి పేరు:  మద్దిశెట్టి వేణుగోపాల్‌
పుట్టిన తేదీ:1–1 1966                                                                                                                                                                                                               
విద్యార్హత : బీ.ఈ, డీ.ఎం.ఎం, ఎం. బీఏ
తల్లిదండ్రులు:  కస్తూరమ్మ , శ్రీనివాసులు
సామాజిక వర్గం: కాపు
కుటుంబం: పద్మ, ఇద్దరు, లహరీ, రాజీవ్‌  
స్వగ్రామం: లక్ష్మినరసాపురం, పామూరు మండలం 
రాజకీయ నేపథ్యం:  2009లో పీఆర్పీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసారు. తర్వాత పలు ప్రజా సేవా కార్యక్రమాలు, విద్యాసంస్థలు నిర్వహణ, పలు సాఫ్ట్‌ వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థలు, పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేసారు. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున దర్శి నియోజక వర్గ సమన్వయకర్తగా నియమించారు.

కనిగిరి


అభ్యర్ధిపేరు: బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 
పుట్టిన తేది: 15.5.1972
విద్యార్హత: ఇంటర్మీడియట్‌
తల్లి దండ్రులు: బి.చినపేరయ్య, లక్ష్మమ్మ  
సామాజిక వర్గం: బీసీ 
కుటుంబం: భార్య–లక్ష్మీ, ముగ్గురు పిల్లలు (అమృత భార్గవి,  వెంకటసాయి, లక్ష్మీనారాయణ ) 
స్వగ్రామం: శివపురం, (కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలం)
ప్రస్తుత నివాసం: కనిగిరి 
వృత్తి: బిల్డర్‌ (బెంగళూరు, హైదరాబాద్‌)    
రాజకీయ నేపథ్యం: 2013లో వైఎస్సార్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కందుకూరు నియోజకవర్గ సమన్వయ కర్తగా పనిచేశారు. అక్కడ అనేక సేవాహిత కార్యక్రమాలు చేపట్టారు. 2014లో కనిగిరి నియోజకవర్గ అభ్యర్ధిగా కనిగిరిలో పోటీ చేసి, స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు (2019 వరకు) కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జిగా పని చేస్తున్నారు.

పర్చూరు


అభ్యర్థి పేరు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
పుట్టినతేదీ: 14–12–1953
విద్యార్హత: ఎం.బి.బి.ఎస్, పీజీ
తల్లిదండ్రులు: రమాదేవి, చెంచురామయ్య
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య- పురందేశ్వరి, కుమార్తె - నివేదిత, కుమారుడు- హితేష్‌ చెంచురామ్‌
స్వగ్రామం: కారంచేడు గ్రామం, కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా
రాజకీయ నేపథ్యం: 1982 లో రాజకీయ ప్రవేశం చేశారు. 1984 లో మార్టూరు ఎమ్మెల్యేగా, 1985 లో పర్చూరు ఎమ్మెల్యే గా, 1989 లో పర్చూరు ఎమ్మెల్యేగా, 1991 లో బాపట్ల ఎంపీగా, 2004 లో పర్చూరు ఎమ్మెల్యేగా, 2009 లో పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 లో రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. 1987 లో ఎన్టీఆర్‌ క్యాబినేట్లో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ మినిస్టర్‌గా పనిచేశారు.

గిద్దలూరు


అభ్యర్థి పేరు: అన్నా వెంకటరాంబాబు 
తల్లిదండ్రులు: ధనలక్ష్మమ్మ, సుబ్బరంగయ్య
కుటుంబం: భార్య దుర్గాకుమారి, సంతానం: ఒక కుమారుడు, ఒక కుమార్తె
పుట్టిన తేదీ: 01–08–1964
స్వగ్రామం: సైదాపురం, కంభం మండలం
నివాసం : మార్కాపురం
వృత్తి: కాంట్రాక్టరు, కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజీ చైర్మన్‌.
సేవా కార్యక్రమాలు: అన్నా సుబ్బరంగయ్య, ధనలక్ష్మమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా 2004 నుంచి ఉచిత అంబులెన్స్, ప్రతి సంవత్సరం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, 10 మంది పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు కల్పించడం. పేదలకు చేయూతనివ్వడం.
రాజకీయ నేపథ్యం: మార్కాపురం ఎమ్మెల్యే కే.పి.కొండారెడ్డి ఆధ్వర్యంలో 1987వ సంవత్సరం నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. అనంతరం 2009లో గిద్దలూరు నుంచి పీఆర్‌పీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీడీపీలో చేరి ఓటమి చెందారు. అయినప్పటికీ తన వెంట ఉన్న కార్యకర్తలకు అండగా ఉన్నారు.

కందుకూరు


అభ్యర్ధి పేరు: మానుగుంట మహీధర్‌రెడ్డి    
తల్లిదండ్రులు: దివంగత మానుగుంట ఆదినారాయణరెడ్డి (మాజీ ఎమ్మెల్యే), లలితమ్మ 
స్వగ్రామం: కందుకూరు మండలం, మాచవరం గ్రామం 
పుట్టిన తేదీ: 01–06–1957
విద్యార్హత: బికాం, ఎల్‌ఎల్‌బి 
సతీమణి: జ్యోతి 
కుమార్తెలు: భవ్య, సత్య 
రాజకీయ నేపథ్యం: 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు.  గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మున్సిఫల్‌శాఖ మంత్రిగా పనిచేశారు.

సంతనూతలపాడు (ఎస్సీ)


అభ్యర్థి పేరు: తలతోటి జయరత్న సుధాకర్‌బాబు
తల్లిదండ్రులు: అన్నమ్మ, ఛార్లెస్‌
పుట్టిన తేదీ: 23.10.1973
భార్య : వనజ
పిల్లలు: కుమారుడు ఛార్లెస్, కుమార్తె సోనియా ఛార్లెస్‌
విద్యార్హతలు: ఎంబీఏ (ఎల్‌ఎల్‌బీ), పీజీ ఒంగోలు నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌
పదవులు: 1991లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగంఅధ్యక్షులు, 1997లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, 2001లో స్టేట్‌ప్రచార కార్యదర్శి, 2004లో స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, 2007లో కాంగ్రెస్‌ యూత్‌ రాష్ట్ర అధ్యక్షులు, 2012లో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 2012లో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర పరిశీలకులు, 2018లో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, 2018 నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంవెఎస్సార్‌సీపీ సమన్వయకర్త

ఒంగోలు

అభ్యర్థి పేరు: బాలినేని శ్రీనివాసరెడ్డి 
పుట్టిన తేదీ: 12.12.1964
విద్యార్హత: అండర్‌ గ్రాడ్యుయేషన్‌ 
తల్లిదండ్రులు : రమాదేవి, వెంకటేశ్వరరెడ్డి
కుటుంబం: భార్య శచీదేవి, కుమారుడు ప్రణీత్‌రెడ్డి, కోడలు కావ్య
స్వస్థలం : కొణిజేడు, టంగుటూరు మండలం 
ప్రస్తుత నివాసం: లాయర్‌పేట, ఒంగోలు
రాజకీయ అనుభవం: కాంగ్రెస్‌ పార్టీలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. రెండోసారి వైఎస్సార్‌ ప్రభుత్వంలో గనులశాఖ, చేనేత జౌళి మరియు స్పిన్నింగ్‌ , చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుపున పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 6వ సారి ఒంగోలు అసెంబ్లీకి వైఎస్సార్‌ సీపీ తరుపున బాలినేని పోటీ చేస్తున్నారు.

యర్రగొండపాలెం(ఎస్సీ)


అభ్యర్థి పేరు: ఆదిమూలపు సురేష్‌
పుట్టిన తేదీ: 27.04.1964
విద్యార్హత: ఐఆర్‌ఎస్‌
తల్లి దండ్రులు: ఆదిమూలపు సామ్యూల్‌ సామ్యూల్జార్జి, థెరిసమ్మ
సామాజిక వర్గం: ఎస్సీ(మాదిగ)
భార్య: టి.హెచ్‌.విజయలక్ష్మి, కుమారుడు: విశాల్, కుమార్తె: శ్రీష్ఠి
స్వగ్రామం: గజ్జలకొండ, మార్కాపురం మండలం
రాజకీయ నేపథ్యం: 2009లో వైఎస్సార్‌ ప్రోత్సాహంతో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిగెలుపొందారు. 2009లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడుగా, 2014లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

అద్దంకి


అభర్థి పేరు : డాక్డర్‌ బాచిన చెంచుగరటయ్య  
పుట్టిన తేదీ : 24 జనవరి 1946
విద్యార్హత: ఎంబీబీఎస్‌
తల్లిదండ్రులు: బాచిన రాఘవయ్య, కాంతమ్మ
సామాజిక వర్గం: ఓసీ (కమ్మ)
కుటుంబం: భార్య రత్నకుమారి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
స్వగ్రామం: జే పంగులూరు
రాజకీయ నేపథ్యం :  ఎంబీబీఎస్‌ చదివి డాక్టరుగా కొన్నేళ్లపాటు వైద్యునిగా ప్రాక్టీస్‌ చేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983, 1989, 1994,1999 సార్వత్రిక ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యేగా పని చేశారు. మొత్తం నాలుగు సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండు సార్లు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలుపొందారు.

కొండపి(ఎస్సీ)


అభ్యర్థి పేరు: మాదాసి వెంకయ్య
పుట్టిన తేది: 10–11–1968
తల్లి దండ్రులు : కోటమ్మ, కోటయ్య 
స్వగ్రామం : కారుమంచి, టంగుటూరు  మండలం
ప్రస్తుత నివాసం: ఉలవపాడు
విద్యార్హతలు: ఎంబీబీఎస్, ఎంఎస్‌
నేపథ్యం: డాక్టర్‌గా పేదలకు ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నారు. మదర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట ఉచిత వైద్య పేవలు. వెంకయ్య వైద్య సేవలకు గుర్తింగా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు సైతం తీసుకున్నారు. సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్నారు.రాజకీయ నేపథ్యం లేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో డాక్టర్‌ వృత్తికి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలో చేరారు. తొలిసారి కొండపి నుంచి పోటీ చేస్తున్నారు. 

---------------------

Nellore

సర్వేపల్లి నియోజకవర్గం


అభ్యర్థి పేరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
జన్మస్థలం : తోడేరు, పొదలకూరు మండలం
విద్యార్హత: బీఈ(మైసూర్‌ యూనివర్సిటీ)
కుటుంబ నేపథ్యం: రాజకీయ కుటుంబం
తల్లిదండ్రులు: లక్ష్మీకాంతమ్మ – కాకాణి రమణారెడ్డి  (మాజీ సమితి అధ్యక్షుడు) 
సతీమణి: విజిత
కుమార్తెలు : పూజిత, సుచిత్ర
రాజకీయ ప్రస్థానం
2006లో సైదాపురం జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నిమితులయ్యారు. 2014లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.  మళ్లీ రెండో పర్యాయం ఎన్నికల బరిలో నిలిచారు.

గూడూరు నియోజకవర్గం


అభ్యర్థి పేరు : వెలగపల్లి వరప్రసాద్‌రావు 
పుట్టిన తేదీ : 15.05.1953
విద్యార్హత : ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ(ఆంధ్రా యూనివర్సిటీ), బయోకెమిస్ట్రీ 
ఉద్యోగం : 1982లో రిజర్వ్‌ బ్యాంకులో పనిచేశారు. అనంతరం ఐఏఎస్‌కు సెలెక్టయి తమిళనాడులోని మూడు జిల్లాలకు కలెక్టర్‌గా(1983 – 2009 వరకు) పనిచేశారు. 2009లో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశారు.
భార్య : లక్ష్మి, ఎమ్మెస్సీ 
జన్మస్థలం : కొమ్మలమూడి, మండవల్లి మండలం, కృష్ణా జిల్లా 
రాజకీయ ప్రస్థానం
2009లో ప్రజారాజ్యంలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గూడూరు నుంచి పోటీకి దిగారు.

కోవూరు నియోజకవర్గం


అభ్యర్థి పేరు : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
పుట్టిన తేదీ : 12.12.1961
విద్యార్హత : బీఏ (నిజాం కాలేజ్, హైదరాబాద్‌)
జన్మస్థలం : కోట 
తల్లిదండ్రులు : నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శ్రీలక్ష్మమ్మ
భార్య : నల్లపరెడ్డి గీత
కుమారుడు : నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి
రాజకీయ ప్రస్థానం
తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా 1993లో ఆయన మరణాంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఓడిపోయి 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఆకర్షితులయ్యారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చడంపై నిరసనగా ప్రసన్నకుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో  చేరారు. 2012లో ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై 23,494 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గం 


అభ్యర్థి పేరు : పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌
జన్మస్థలం : కొత్తూరు(అంబాపురం)
పుట్టిన తేదీ : 23.03.1980
తండ్రి : కీ.శే.పోలుబోయిన తిరుపాలయ్య 
భార్య : జాగృతి
కుమార్తె : సమన్వవి
కుమారుడు : దర్శనందన్‌
విద్యార్హతలు : వైద్యవిద్య – బీడీఎస్‌
రాజకీయ ప్రస్థానం
చిన్నాన్న సుధాకర్‌ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశ దక్కింది. 91 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి ఘన విజయం సాధించారు. మళ్లీ రెండో పర్యాయం నెల్లూరు నగరం నుంచి బరిలో దిగారు.

ఆత్మకూరు నియోజకవర్గం


అభ్యర్థి పేరు : మేకపాటి గౌతమ్‌రెడ్డి
జన్మస్థలం : బ్రహ్మణపల్లి, మర్రిపాడు మండలం
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి
విద్యార్హత : ఎమ్మెస్సీ, టెక్స్‌టైల్స్‌(మాంచెస్టర్, యూకే)
కుటుంబం : భార్య – శ్రీకీర్తి, కుమార్తె అన్యన్యరెడ్డి, 
కుమారుడు – అర్జున్‌రెడ్డి
బాధ్యతలు : కె.ఎం.సి. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌
రాజకీయ ప్రస్థానం
2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో గెలుపొందారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. వైఎస్సార్‌సీపీ తరఫున మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

కావలి నియోజకవర్గం


అభ్యర్థి పేరు: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 
జన్మస్థలం : కావలి పట్టణం 
పుట్టిన తేదీ : 04.06.1964
విద్యార్హత : కావలిలోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో, జవహర్‌ భారతి కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. చెన్నైలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. 
తల్లిదండ్రులు : రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి, శివరావమ్మ
భార్య : ఆదిలక్ష్మి
పిల్లలు : బాల సాకేత్‌రెడ్డి, సంహిత
వ్యాపారాలు : కాంట్రాక్టర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించి బిల్డర్‌గా స్థిరపడ్డారు. 
ప్రజాసేవ : వ్యాపారాలు బెంగళూరులో ఉండడంతో అక్కడే లయన్స్‌ క్లబ్‌లో చేరి సేవా కార్యాక్రమాలు విస్తృతంగా చేశారు. కావలి సమీపంలోని కడనూతల గ్రామం వద్ద ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.
రాజకీయ ప్రస్థానం
2009 లో  కావలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2011 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్‌సీపీ తరుపన పోటీ చేశారు. తర్వాత 2014 లో కావలి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా çపోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఉదయగిరి నియోజకవర్గం


అభ్యర్థి పేరు : మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
జననం : 1952
తల్లిదండ్రులు : వెంకటసుబ్బమ్మ, వెంకురెడ్డి
జన్మస్థలం : బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం
విద్యార్హత : ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.
భార్య : తులశమ్మ
సంతానం : ఒక కుమార్తె
రాజకీయ ప్రస్థానం
1994లో రాజకీయ అరంగేట్రం చేసి బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కంభం విజయరామిరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కంభం విజయరామిరెడ్డి(టీడీపీ)పై గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై విజయం సాధించారు. 2014లో మళ్లీ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మళ్లీ బరిలో నిలిచారు.

వెంకటగిరి నియోజకవర్గం


అభ్యర్థి పేరు : ఆనం రామనారాయణరెడ్డి  
పుట్టిన తేదీ : 10.07.1952
తండ్రి : ఆనం వెంకటరెడ్డి
విద్యార్హత : బీకాం, బీఎల్‌ 
రాజకీయ నేపథ్యం
1982లో జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1983లో మొదటిసారిగా నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్‌గా, 1985లో రాపూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1989లో టీడీపీ అభ్యర్థిగా, 1994లో రాపూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999, 2004లలో రాపూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో దివంగత వైఎస్సార్‌ హయాంలో రాపూరు నుంచి గెలిచిన క్రమంలో 2007 నుంచి రాష్ట్ర సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఆత్మకూరు నుంచి గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం


అభ్యర్థి పేరు : కిలివేటి సంజీవయ్య
జన్మస్థలం : కాదలూరు, తడ మండలం 
తల్లిదండ్రులు : రాజయ్య–మస్తానమ్మ
భార్య : పసల సుభాషిణి(మాజీ మంత్రి పసల పెంచలయ్య ఏకైక కుమార్తె)
సంతానం : ఇద్దరు కుమార్తెలు
విద్యార్హత : బీటెక్‌ సివిల్‌ ఇంజినీర్‌
ఉద్యోగం : 1993లో గృహనిర్మాణ శాఖలో ఇంజినీర్‌గా ప్రవేశించి డీఈ అయ్యారు
రాజకీయ ప్రస్థానం
మాజీ మంత్రి పసల పెంచలయ్య రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు. 2013లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం


అభ్యర్థి పేరు : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 26.4.1964
విద్యార్హతలు : డిగ్రీ (వీఆర్‌ కళాశాల, నెల్లూరు)
తల్లిదండ్రులు : బాబిరెడ్డి – సరళమ్మ
భార్య : సునందమ్మ
కుమార్తెలు : లక్ష్మీహైందవి, సాయివైష్ణవి
రాజకీయ ప్రస్థానం
రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి విద్యార్థి సంఘం నేతగా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో వీఆర్‌ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, అనంతరం ఎస్వీ యూనివర్సిటీ సెనెట్‌ మెంబర్‌గా పనిచేశారు. ఏబీవీపీలో పనిచేశారు. వైఎస్సార్‌ ఆశయాల పట్ల ఆకర్షితుడై 1988 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ గుర్తింపు పొందారు. 2009లో మెడికల్‌ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌గా పనిచేశారు. 2009 నుంచి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2014లో నెల్లూరు రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. మళ్లీ రెండో పర్యాయం బరిలో నిలిచారు.

-----------------------

Visaka district

భీమిలి :ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విద్యార్హత: ఎం.ఏ., ఎల్‌ఎల్‌బీ
వయసు:52
కుటుంబ సభ్యులు: భార్య జ్ఞానేశ్వరి, కుమార్తె ప్రియాంక, కుమారుడు వెంకట శివనందేష్‌
రాజకీయ నేపథ్యం: అవంతి విద్యాసంస్థల అధినేత. 2009లో రాజకీయ ప్రవేశం.
నిర్వహించిన పదవులు: 2009–2014 వరకూ భీమిలి ఎమ్మెల్యే, 2014–2019 వరకూ అనకాపల్లి ఎంపీగా పనిచేశారు.

పెందుర్తి :అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
విద్యార్హత: ఎంబీఏ, వయసు:36
కుటుంబ సభ్యులు: భార్య శిరీష, కుమారుడు సత్యధన్విరాజ్‌
రాజకీయ నేపథ్యం: వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
నిర్వహించిన పదవులు: రాంపురం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో  వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు.

గాజువాక :తిప్పల నాగిరెడ్డి
విద్యార్హత:ఇంటర్మీడియట్‌ వయసు:65
కుటుంబ సభ్యులు: భార్య రాధ, కుమార్తె కవిత, కుమారులు వంశీరెడ్డి, దేవన్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం: వీఏఓగా పనిచేస్తూ.. ఆ వ్యవస్థను రద్దు చేయడంతో 1984లో కాంగ్రెస్‌లో చేరారు.  
నిర్వహించిన పదవులు: 2007 జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. విశాఖ గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి, వీఏవో సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

విశాఖ తూర్పు : అక్కరమాని విజయనిర్మల
విద్యార్హత: ఇంటర్మీడియట్, వయసు : 47         
కుటుంబ సభ్యులు: భర్త వెంకటరావు, కుమార్తె భారతి, కుమారుడు అవినాష్‌
రాజకీయ నేపథ్యం: 2005లో రాజకీయ ప్రవేశం.
నిర్వహించిన పదవులు: 2005లో భీమిలి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలుపొందారు. అదే ఏడాది మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2008–2010 వరకూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

విశాఖ పశ్చిమ : మళ్ల విజయప్రసాద్‌
విద్యార్హత: డిగ్రీ
వయసు:53
కుటుంబ సభ్యులు: భార్య అరుణకుమారి, కుమార్తెలు అనూష, అలేఖ్య
రాజకీయ నేపథ్యం: వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ సంస్థ అధినేతగా ఉంటూ 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  
నిర్వహించిన పదవులు: 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

విశాఖ దక్షిణ : ద్రోణంరాజు శ్రీనివాస్‌
విద్యార్హత: బి.కాం., బీఎల్‌
వయసు:58
కుటుంబ సభ్యులు: భార్య శశి, కుమారుడు శ్రీవత్సవ, కుమార్తె శ్వేత,
రాజకీయ నేపథ్యం: తండ్రి ద్రోణం రాజు సత్యనారాయణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. తండ్రి మరణాననంతరం శ్రీనివాస్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
నిర్వహించిన పదవులు 2006లో జరిగిన ఉప ఎన్నికలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు.

విశాఖ ఉత్తర : కేకే రాజు
విద్యార్హత: బీఏ,  వయసు:42
కుటుంబ సభ్యులు: భార్య సుమ, కుమార్తెలు సాత్విక, హాన్విక
రాజకీయ నేపథ్యం: 2014 నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
నిర్వహించిన పదవులు: ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.

మాడుగుల : బూడి ముత్యాలనాయుడు
విద్యార్హత: ఇంటర్మీడియట్‌
వయసు : 57   కుటుంబ సభ్యులు: భార్య రమణమ్మ
రాజకీయ నేపథ్యం: 1984లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కన్వీనర్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తదితర పదవులు నిర్వహించారు.
నిర్వహించిన పదవులు: తారువా గ్రామ సర్పంచ్, ములకలాపల్లి ఎంపీటీసీ సభ్యుడు, దేవరాపల్లి మండల పరిషత్‌ అధ్యక్ష పదవులు చేపట్టారు.

అరకులోయ :చెట్టి పాల్గుణ
విద్యార్హత: ఎం.ఏ. పాలిటిక్స్,  వయసు:57
కుటుంబ సభ్యులు: భార్య అనురాధ, కుమారులు వికాస్, వినయ్, సాయి శ్రీనివాస్‌
రాజకీయ నేపథ్యం: టీచర్‌గా చేరి..1984లో ఎస్‌బీఐ క్లర్క్‌గా పనిచేసి..33 ఏళ్ల తరువాత బ్యాంకు మేనేజర్‌గా పదోన్నతి పొందారు. తరువాత రాజీనామా చేశారు. 2017లో వైఎస్సార్‌ సీపీలో చేరారు.
నిర్వహించిన పదవులు: మన్యప్రజల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

పాడేరు :కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
విద్యార్హత: ఎమ్మెస్సీ బయోటెక్నాలజి, బీఈడీ
వయసు:34
కుటుంబ సభ్యులు: భర్త తమర్భ నర్సింగరావు, కుమారుడు వివేక్, కుమార్తెలు జస్మితశ్రీనందన గాయిత్రి
రాజకీయ నేపథ్యం: దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మి.   వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌లో చేరారు. 2009 నుంచి 2014 వరకు ట్రైఫాడ్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు.  
నిర్వహించిన పదవులు: అరకు పార్లమెంట్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పని చేశారు. 2014 నుంచి 2017 వరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2017లో వైఎస్సార్‌సీలో చేరారు.

నర్సీపట్నం: పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌
విద్యార్హత: బీఏ,   వయసు: 47
కుటుంబ సభ్యులు: భార్య కళావతి, కుమారులు అవినాష్, ఆదర్శ్‌
రాజకీయ నేపథ్యం: 1992లో టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో ప్రారంభం నుంచి ఉన్నారు.
నిర్వహించిన పదవులు: బాపిరాజు కొత్తపల్లి సర్పంచ్‌గా 1995 నుంచి 2001 వరకు, తాండవ ఆయకట్టు సంఘం చైర్మన్‌గా 2009 నుంచి 2012 వరకు పనిచేశారు.

యలమంచిలి : ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు)
విద్యార్హత: బీకాం డిస్కంటిన్యూ.., వయసు:67
కుటుంబ సభ్యులు: రాధాదేవి, సుకుమారవర్మ, కుమార్తెలు రోజారాణి, రూపారాణి
రాజకీయ నేపథ్యం: రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్‌ ఉండేవారు. 1999లో రాజకీయ ప్రవేశం చేశారు.
నిర్వహించిన పదవులు: 2004,2009లో వరుసుగా కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్సార్‌ సీపీలో చేరి ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.

పాయకరావుపేట :గొల్ల బాబూరావు
విద్యార్హత: ఎం.ఏ., ఎల్‌ఎల్‌బీ,    వయసు:65
కుటుంబ సభ్యులు: భార్య వసంతకుమారి, కుమారుడు సాయికార్తీక్, కుమార్తె నాగసౌమ్య
రాజకీయ నేపథ్యం: పంచాయతీరాజ్‌ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2009,2012 (ఉప ఎన్నిక) ఎమ్మెల్యేగాగా పనిచేశారు.
నిర్వహించిన పదవులు: 2011 నుంచి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

చోడవరం :కరణం ధర్మశ్రీ
విద్యార్హత: బీఏ, బీఎడ్, బీఎల్‌
వయసు: 51
కుటుంబ సభ్యులు: భార్య వెంకట విజయ, కుమార్తెలు కుసువు, స్వాతి, కుమారుడు సూర్య
రాజకీయ నేపథ్యం: 1997లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్ష పదవితోపాటు అనేక పార్టీ పదవులు చేపట్టారు.
నిర్వహించిన పదవులు: 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరపున మాడుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనకాపల్లి :గుడివాడ అమర్‌నాథ్‌
విద్యార్హత: ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు
వయసు: 35
కుటుంబ సభ్యులు: తండ్రి దివంగత మంత్రి గుడివాడ గురునాథరావు, తల్లి నాగమణి
రాజకీయ నేపథ్యం: 21 ఏళ్లకే రాజకీయ అరంగేట్రం చేసి, 2007లో టీడీపీ చేరారు.
నిర్వహించిన పదవులు: 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 65వ వార్డు కార్పొరేటర్‌గా గెలుపొందారు.

---------------

తాజా వీడియోలు

Back to Top