<br/>దేశంలో ఏమూల హవాలా కేసులు వెలుగు చూసినా దాని మూలాలు తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ టిడిపి నాయకుల కాళ్ల కిందకే చేరుతున్నాయి. గుర్రాల వ్యాపారి హసన్ అలీ హవాలా సొమ్ములు చేరేయడంలో దిట్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు 2004 కు ముందే బళ్లకొద్దీ బ్లాక్ మనీ దాచారని బైటపెట్టాడు. ఎన్నికల సమయంలో కొంత వెనక్కి తీసుకున్నారని కూడా ఒప్పుకున్నాడు. చంద్రబాబు దుబాయ్ లింకుల గుట్టు హసన్ ఆలీతోనే రట్టైంది. కానీ అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల పేర్లు కూడా బయటపడటంతో తేలుకుట్టిన దొంగల మాదిరి అందరూ కామ్ అయిపోయారు. కోలా కృష్ణమోహన్ కూడా చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు సింగపూర్ బాంకుల్లో ఎక్కౌంట్లుఉన్నాయని, భారీగా నల్లడబ్బు ఆ ఖాతాల్లో మూలుగుతోందని బైటపెట్టాడు. చంద్రబాబు ఎంపి సీటు ఇచ్చేందుకు ఒప్పందంతో 5 కోట్లు తీసుకున్నాడని కూడా కోలా చెప్పుకొచ్చాడు. సింగపూర్ లోని డ్యూషే బాంక్ లో సి.నాయుడు.నారా అనే పేరుతో ఉన్న చంద్రబాబు ఎక్కౌంట్ నెంబర్ ను కూడా కోలా బైటపెట్టాడు. తాజాగా ఇప్పుడు మాసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో బాబుగారి బినామీల పేర్లు బయటకొస్తున్నాయి. అందుకే చంద్రబాబు పదేపదే ఉలిక్కిపడుతున్నాడు. అలీ హసన్ హవాలా వ్యవహారం జరిగినప్పుడు పేర్లు బైటపెట్టాలంటూ డాంబికంగా హడావిడి చేసినట్టే, తనకేం సంబంధం లేదని అనుకునేలా సిబిఐ సోదాల విషయంలోనూ కేంద్రం తమపై కుట్రలు చేస్తోంది అంటూ కంగారు పడుతున్నాడు. ఇవే కాదు ఒకప్పుడు దొంగనోట్ల నిందితులతోనూ బాబుగారి సంబంధాలు ఫోటోలుగా బహిరంగమయ్యాయి. ఫొటోల విషయం ముందుగానే తెలుసుకున్నచంద్రబాబు ఆరోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టడం కూడా పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.తెహల్కా టేపులు కూడా చంద్రబాబు చీకటి చరిత్రను బట్టబయలు చేసాయి.ఈ మహానుభావుడి హయాంలోనే స్టాంపుల కుంభకోణమూ జరిగింది.మొన్నటికి మొన్న విజయవాడలో టిడిపి నేతల కనుసన్నల్లో జరిగిన భారీ సెక్స్ రాకెట్ కాల్ మనీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. హవాలా పేరు వినిపిస్తే చాలు చంద్రబాబు భుజాలు తడుముకునేది ఇందుకే. ఆ ఉలికిపాటుతోనే నేను నిప్పునంటూ చిందులేస్తుంటాడు. నల్లసొమ్ముల నిజాలు ఎక్కడ పొక్కి తన పదవికి పొగపెడతాయో అని లోలోపలే గుబులుపడతాడు. <br/>