విజయమ్మ దీక్షకు పెరుగుతున్న మద్దతు

విజయవాడ 16 ఆగస్టు 2013:

అన్ని ప్రాంతాల మధ్య సమన్యాయం పాటించాలనీ, లేని పక్షంలో  రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలనీ డిమాండ్ చేస్తూ  వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ  ఈ నెల 19 నుంచి చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతు పెరుగుతోంది. దీక్షకు ఏపీ ఎన్జీవోలు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు హైదరాబాదులో శ్రీమతి విజయమ్మను కలిసి దీక్ష నిర్ణయాన్ని స్వాగతించారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఎవరు పూనుకున్నా తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని  తెలిపారు. ఇప్పటికే రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కూడా శ్రీమతి విజయమ్మ దీక్షకు సంఘీభావం ప్రకటించించింది. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వారందరూ దీక్ష నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 అధికార కాంగ్రెస్‌తో పాటు దానికి కొమ్ముకాస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ద్వంద్వ వైఖరులతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుండగా, సమైక్యం కోసం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచే కావడంతో ప్రజలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. సమైక్యం కోసం ఏకంగా ఒక పార్టీ అధినేత్రి నిరవధిక దీక్షకు పూనుకోవడం వల్ల ఉద్యమానికి మద్దతు పెరుగుతుందని సమైక్యవాదులు భావిస్తున్నారు.

Back to Top