ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం2018వరకు ఆ ప్రాజెక్టు పూర్తయ్యేనా..?రెండు పిల్లులు కోట్లాడితే మధ్యలో కోతికి లాభం వచ్చినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కారణంగా కొన్ని లక్షల ఎకరాలు బీడుగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పోలవరం పనులకు నాలుగేళ్ల క్రితం మొదలైన పనులకు ఇప్పటికి రూపురేఖలు లేవు. ఆ ప్రాజెక్టుపై పెత్తనం మాది ఉండాలంటే మాది ఉండాలని ఆ ప్రాజెక్టును ములకు పడేస్తున్నాయి. టీడీపీ సర్కార్ పైకి పెత్తనం కేంద్ర ప్రభుత్వానిదే చెబుతున్న అధికారికంగా మాత్రం బాధ్యతలు ఇవ్వడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
ఉభయగోదావరి జిల్లా మధ్యనున్న పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షల ఎకరాల భూమి సాగులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునిరెత్తినట్లు వ్యవహారిస్తున్నాయనే చెప్పాలి. ప్రభుత్వాలు మాత్రమే కాదు కాంట్రాక్టర్లు సైతం పోలవరం ప్రాజెక్టుతో ఆటలాడుతున్నారు. దానికి ఉదాహరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అంతంత మాత్రంగా నిధులు కేటాయించడమే. చంద్రబాబు సర్కారు గత రెండేళ్లుగా అధికారులకు తెలియని కొత్త అంశాన్ని పైకి తీసుకొచ్చింది. పోలవరం ప్రాజెక్టులో ఫేజ్-1 అని చెబుతూ దానిని మేమే పూర్తిచేశాం అని చెప్పుకోవడానికి కొత్త జిమ్మిక్కులు చేస్తుంది. అసలు పోలవరం హెడ్‌వర్క్స్‌లో ఫేజ్ లేవని అధికారులు, నిపుణులు, టెండర్లలో కూడా లేవని ఎప్పుడో చెప్పారు.
నీటి ముటలుగానే హామీలన్నీబీజేపీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని రాష్ట్ర విభజన సమయంలో హామినిచ్చింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ పోలవరంపై చిన్నచూపు చూస్తోంది. పోనీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా పోలవరంను పట్టించుకుంటుందనుకుంటే అది కూడా నీటిపై రాతలు అన్న చందంగా మారింది. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా పనులు చేపట్టడం లేదని అనేక విమర్శలు వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,660 కోట్లు కేటాయించిన ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తారా అన్న ప్రశ్నకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కాల్‌మనీ - సెక్స్‌రాకెట్, రాజధాని భూదందా వంటివి చూస్తుంటే ప్రజలు అనుమానించడంలో తప్పు లేదు. ఓ వైపు పోలవరంపై అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరిపెత్తనమే తెలియకే తీవ్రజాప్యం ఏర్పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అధికారాన్ని కేంద్రానికి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న చంద్రబాబు, ఇప్పటికి అప్పగించలేదు. అసలు పోలవరంపై చంద్రబాబు పెత్తనం ఉండాలి... కానీ నిధులు మాత్రం కేంద్రం కేటాయించాలని, ప్రాజెక్టు అధారిటీ నిర్మాణం జరిగితే కేంద్రం విడుదల చేసే నిధుల్లో రాష్ట్రం కల్పించుకోవడానికి అవకాశం ఉండదనే కారణంతోనే బాబు ఇదంతా చేస్తున్నారు.